AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vinesh Phogat: ‘మీకల, నా ధైర్యం రెండూ ఓడిపోయాయి.. ఇక గుడ్‌బై!’ వినేశ్‌ ఫొగాట్‌ సంచలన నిర్ణయం

ప్యారీస్‌ ఒలంపిక్స్‌లో కేవలం 100 గ్రాముల అదనపు బరువు వల్ల రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌పై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. ఆమెకు ధైర్యం చెబుతూ ఎందరో ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. అయితే.. ఒలంపిక్స్‌లో అనర్హతపై ఆమె భావోధ్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలో వినేశ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు..

Vinesh Phogat: 'మీకల, నా ధైర్యం రెండూ ఓడిపోయాయి.. ఇక గుడ్‌బై!' వినేశ్‌ ఫొగాట్‌ సంచలన నిర్ణయం
Vinesh Phogat
Srilakshmi C
|

Updated on: Aug 08, 2024 | 6:57 AM

Share

ప్యారీస్‌ ఒలంపిక్స్‌లో కేవలం 100 గ్రాముల అదనపు బరువు వల్ల రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌పై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. ఆమెకు ధైర్యం చెబుతూ ఎందరో ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. అయితే.. ఒలంపిక్స్‌లో అనర్హతపై ఆమె భావోధ్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలో వినేశ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెజ్లింగ్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటిస్తూ ట్వీట్‌ చేశారు. వినేశ్‌ ట్వీట్‌ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ‘మీకల, నా ధైర్యం విచ్చిన్నమైంది. నాకింక పోరాడే బలం లేదు. నాపై కుస్తీ గెలిచింది. నేను ఓడిపోయాను. నన్ను క్షమించండి. మీకెప్పటికీ రుణపడి ఉంటాను’ అంటూ రెజ్లింగ్‌కు వీడ్కోలు చెబుతూ వినేశ్‌ సంచలన ట్వీట్‌ చేశారు.

పారిస్ ఒలింపిక్స్‌కు అనర్హత వేటు పడటంపై భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ గుండె పగిలింది. అందుకే రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించినట్లు తెలుస్తుంది. మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఈవెంట్‌లో బుధవారం ఉదయం బరువు 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఆమె పసిడి పోరుకు దూరమైంది. ఆమె అనర్హతను సవాల్ చేస్తూ వినేష్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (CAS)లో నిరసన వ్యక్తం చేసింది కూడా. అయితే తనతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రెజ్లింగే గెలిచిందని, తన ధైర్యాన్ని దెబ్బతీసి, ఓడించిందని వినేష్ సోషల్ మీడియాలో ట్వీట్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

2001లో రెజ్లర్‌గా అరంగేట్రం చేసిన వినేశ్‌ 29 యేళ్ల వయసులో రిటైర్‌మెంట్‌ ప్రకటించడం భారతీయులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఒలంపిక్స్‌ నుంచి ఆమె వెనుదిరిగిన తర్వాత ఆమెకు ధైర్యం చెబుతూ ప్రధాని నరేంద్రమోదీతో సహా ఎందరో ప్రముఖులు ఎన్నో పోస్టులు పెట్టారు. ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ గోల్డ్‌ మెడల్‌ సాధించేందుకు 2028 LA గేమ్స్‌పై దృష్టి పెట్టాలని కోరారు. అయినప్పటికీ వినేష్ మనోధైర్యం కోల్పోయారు. చివరి యుద్ధంలో ఓడిపోయానని, ఇకపై కొనసాగించడానికి ఏమీ మిగల్లేదని తీవ్ర భావోధ్వేగానికి గురయ్యారు. కాగా సెమీ ఫైనల్లో వినేష్ చేతిలో ఓడిపోయిన క్యూబా రెజ్లర్ యుస్నీలిస్ గుజ్మాన్ లోపెజ్.. వినేశ్‌ స్థానంలో అమెరికాకు చెందిన సారా ఆన్ హిల్డెబ్రాండ్‌తో జరిగిన ఫైనల్‌లో తలపడింది. ఈ పోరులో సారా ఆన్ హిల్డెబ్రాండ్‌ స్వర్ణం గెలుచుకుంది. వినేష్ – లోపెజ్‌లకు ఉమ్మడి రజత పతకం దక్కి అవకాశం ఉంది.

మరిన్ని ఒలంపిక్స్‌ సంబంధిత వార్తల కోసం క్లిక్‌ చేయండి.