Vinesh Phogat: ‘పతకం ముఖ్యం కాదు.. మీరు నిజమైన ఛాంపియన్’.. వినేశ్ ఫొగాట్‌కు ధైర్యం చెప్పిన మహేశ్ బాబు
పలువురు సెలబ్రిటీలు వినేష్ ఫోగట్‌కు అనుకూలంగా పోస్ట్‌లు పెట్టారు. సమంత, అలియా భట్, ఫర్హాన్ అక్తర్, తాప్సీ పన్ను, కరీనా కపూర్ ఖాన్ పలువురు వినేష్ ఫోగట్ కు ధైర్యం చెప్పారు. 'నవ్వు నిజమైన ఛాంపియన్' అంటూ సోషల్ మీడియాలో పోస్టు లు పెట్టారు. తాజాగా మహేశ్ బాబు కూడా వినేశ్‌కు అండగా నిలబడ్డాడు
పారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ స్వర్ణ పతకం సాధిస్తుందని కోట్లాది మంది భారతీయులు కలలు కన్నారు. వినేష్ ఫోగట్ తన శరీర బరువు 50 కిలోల కంటే ఎక్కువ ఉన్నందున చివరి దశలో అనర్హులిగా ప్రకటించడంతో యావత్ దేశం షాక్ లోకి వెళ్లిపోయింది. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు వినేష్ ఫోగట్‌కు అనుకూలంగా పోస్ట్‌లు పెట్టారు. సమంత, అలియా భట్, ఫర్హాన్ అక్తర్, తాప్సీ పన్ను, కరీనా కపూర్ ఖాన్ పలువురు వినేష్ ఫోగట్ కు ధైర్యం చెప్పారు. ‘నవ్వు నిజమైన ఛాంపియన్’ అంటూ సోషల్ మీడియాలో పోస్టు లు పెట్టారు. తాజాగా మహేశ్ బాబు కూడా వినేశ్‌కు అండగా నిలబడ్డాడు. ఆమె నిజమైన ఛాంపియన్ అంటూ కొనియాడాడు. ఈ రోజు ఫలితంతో సంబంధం లేదు. మీరు నిర్ణయాన్ని ఎలా ఎదుర్కొన్నారో అది మీ గొప్పతనం. వినేశ్ ఫోగాట్.. మీరు నిజమైన ఛాంపియన్ అని అందరికీ చూపించారు. కష్ట సమయాల్లో అండగా నిలవడానికి మీ దృఢత్వం, బలం అందరికి స్ఫూర్తి. పతకం వచ్చిందా లేదా అన్నది ముఖ్యం కాదు.. మీ స్ఫూర్తి మాలో ప్రతి ఒక్కరిలో ప్రకాశిస్తుంది. 1.4 బిలియన్ హృదయాలు మీతో పాటు ఉన్నాయి.’ అని మహేశ్ బాబు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
అంతకు ముందు అలియా భట్ కూడా వినేశ్ అనర్హత వేటుపై స్పందించింది.. ‘వినేష్ ఫోగట్, మీరు దేశం మొత్తానికి స్ఫూర్తిని పంచారు. చరిత్ర సృష్టించాలనే మీ ధైర్యాన్ని, పట్టుదలను ఎవరూ తీసివేయలేరు. ఈ రోజు మీలాగే మేము కూడా షాక్ అయ్యాము. మీరు ఛాంపియన్. మీలాంటి వారు మరొకరు లేరు’ అంటూ అలియా భట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. వీరితో పాటు ఫాతిమా సనాషేక్, రకుల్ ప్రీత్ సింగ్, అనన్య పాండేతో సహా చాలా మంది నటీమణులు వినేశ్ ఫొగాట్ కు అండగా నిలిచారు. వినేష్ ఫోగట్ గురించి దేశం మొత్తం గర్విస్తోంది. అయితే ఫైనల్‌లో పోటీ చేయలేకపోవడం అందరినీ బాధిస్తోంది.
మహేశ్ బాబు ట్వీట్..
Today’s outcome doesn’t matter, but your greatness in how you coped with the decision does 👏👏👏#VineshPhogat, you’ve shown everyone that your heart is that of a true champion; your resilience and strength to stand tall in difficult times inspires us all.
Medal or not, your…
— Mahesh Babu (@urstrulyMahesh) August 7, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.