AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagamma: ‘నాగమ్మ’ సీరియల్ అమ్మాయి గుర్తుందా? హీరోయిన్‌గా ఫెయిల్యూర్‌.. ఇప్పుడెలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా?

ఇప్పుడు సీరియల్స్ లో సీనియర్ ఆర్టిస్టులుగా నటిస్తున్న నీరజ, శ్రీనివాస్.. నాగమ్మ ధారావాహికతోనే గుర్తింపు తెచ్చుకున్నారు. శంకరాభరణం సోమయాజులు ఈ సీరియల్ లో ప్రధాన పాత్ర పోషించడం విశేషం. ఇకపోతే ఇందులో బాల నాగమ్మగా ఛైల్డ్ ఆర్టిస్ట్ గాయత్రి నటించింది. చారడేసి కళ్లు.. నిండా కాటుక.. నుదుటిన పెద్ద బొట్టుతో అచ్చం దేవతలా గాయత్రి దర్శనమిచ్చింది.

Nagamma: 'నాగమ్మ' సీరియల్ అమ్మాయి గుర్తుందా? హీరోయిన్‌గా ఫెయిల్యూర్‌.. ఇప్పుడెలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా?
Nagamma Serial Actress
Basha Shek
|

Updated on: Aug 06, 2024 | 9:36 PM

Share

ఇప్పుడంటే వెండి తెరపై సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ సినిమాలు వస్తున్నాయి.. కొన్నేళ్ల కిందట బుల్లితెరపై కూడా ఈ జానర్ సీరియల్స్ సందడి చేశాయి. ఆడియెన్స్ ను భయ పెట్టాయి. రహస్యం, అన్వేషిత, అలౌకిక, మనోయజ్ఞం, నాగమ్మ వంటి సీరియల్స్ సరిగ్గా ఈ కోవకే చెందుతాయి. అయితే ఇందులో నాగమ్మ సీరియల్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. ప్రముఖ టీవీ చానెల్ జెమినీలో ప్రతి ఆదివారం ప్రసారమయ్యే ఈ సీరియల్ కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూసేవారు. ఇక ఇందులోని ‘ ‘పున్నమిలోన వెన్నల వాన చలువుదనలా చల్లని తల్లి నాగమ్మా…’ సాంగ్ వింటుంటనే వెన్నులో వణుకు పుట్టేది. అయితే భయపడుతూనే నాగమ్మ సీరియల్ ను చూసేవారు. ఇప్పుడు సీరియల్స్ లో సీనియర్ ఆర్టిస్టులుగా నటిస్తున్న నీరజ, శ్రీనివాస్.. నాగమ్మ ధారావాహికతోనే గుర్తింపు తెచ్చుకున్నారు. శంకరాభరణం సోమయాజులు ఈ సీరియల్ లో ప్రధాన పాత్ర పోషించడం విశేషం. ఇకపోతే ఇందులో బాల నాగమ్మగా ఛైల్డ్ ఆర్టిస్ట్ గాయత్రి నటించింది. చారడేసి కళ్లు.. నిండా కాటుక.. నుదుటిన పెద్ద బొట్టుతో అచ్చం దేవతలా దర్శనమిచ్చింది. అంతలా బాల నాగమ్మ పాత్రలో ఇమిడిపోయిన ఆ చిన్నారి పేర గాయత్రి. రాజమండ్రిలో పుట్టి పెరిగిన ఆ అమ్మాయి తెలుగులో పలు సీరియల్స్ లో నటించి బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువైంది. అయితే నాగమ్మ సీరియల్ గాయత్రికి ఎనలేని క్రేజ్ ను తెచ్చి పెట్టింది. ఈ సీరియల్ హిట్ కావడంతో ఆమెకు హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చింది. టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు ‘రాజీవ్’ హీరోగా నటించినటువంటి ‘నోట్ బుక్’ అనే చిత్రంతో కథానాయికగా టాలీవుడ్ కు పరిచయమైంది

నోట్ బుక్ సినిమాలో అమాయకమైన అమ్మాయిగా గాయత్రి నటన మెప్పించింది. అయితే ఈ సినిమా తర్వాత అవకాశాలు వచ్చినప్పటికీ గాయత్రి పెద్దగా క్లిక్ అవ్వలేదు. నోట్ బుక్ సినిమాలో ఎంతో పద్ధతిగా కనిపించిన ఆమె ఆ తర్వాత గ్లామర్ డోస్ పెంచింది. మ్యీవ్, గంగపుత్రులు, వెయింట్ ఫర్ యు, అదే నీవు అదే నేను, గ్రీకు వీరుడు తదితర సినిమాల్లో వివిధ పాత్రలు పోషించింది. ఆ తర్వాత కోలీవుడ్ ఇండస్ట్రీ బాట పట్టింది. అయితే అక్కడ కూడా సక్సెస్ కాలేదీ అందాల తార. ప్రస్తుతం ఈ నటి ఎక్కడుందో, ఏం చేస్తుందో తెలియలేదు. కొంతమంది మాత్రం గాయత్రి పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యిందని అంటున్నారు. సోషల్ మీడియాలోనూ గాయత్రి పెద్దగా యాక్టివ్ గా ఉండడం లేదు.

ఇవి కూడా చదవండి
Nagamma Serial Actress 1

Nagamma Serial Actress 1

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ  క్లిక్ చేయండి..