Suma Kanakala: స్టేజిపైనే సుమను ముద్దుపెట్టుకున్న ప్రముఖ నటుడు.. భలే కవర్ చేసిన యాంకరమ్మ.. వీడియో వైరల్

స్టార్ యాంకర్‌ సుమ కనకాల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సందర్భం ఏదైనా, వేదిక ఎక్కడైనా.. మైక్ పట్టుకుంటే చాలు తన మాటల సవ్వడితో అందరినీ మైమరిపిస్తుంది. స్పాంటేనియస్ గా పంచులు వేయడమే కాదు.. ఎదుటి వాళ్ల పంచల్ కు వెంటనే రివర్స్ కౌంటర్ ఇవ్వడం ఈ యాంకరమ్మ స్టైల్. ఎప్పుడూ కూల్ గా నవ్వుతూ, నవ్విస్తూ ఉండే స్టార్ యాంకర్ సుమకు తాజాగా ఓ ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది

Suma Kanakala: స్టేజిపైనే సుమను ముద్దుపెట్టుకున్న ప్రముఖ నటుడు.. భలే కవర్ చేసిన యాంకరమ్మ.. వీడియో వైరల్
Anchor Suma Kanakala
Follow us
Basha Shek

|

Updated on: Aug 05, 2024 | 9:03 PM

స్టార్ యాంకర్‌ సుమ కనకాల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సందర్భం ఏదైనా, వేదిక ఎక్కడైనా.. మైక్ పట్టుకుంటే చాలు తన మాటల సవ్వడితో అందరినీ మైమరిపిస్తుంది. స్పాంటేనియస్ గా పంచులు వేయడమే కాదు.. ఎదుటి వాళ్ల పంచల్ కు వెంటనే రివర్స్ కౌంటర్ ఇవ్వడం ఈ యాంకరమ్మ స్టైల్. ఎప్పుడూ కూల్ గా నవ్వుతూ, నవ్విస్తూ ఉండే స్టార్ యాంకర్ సుమకు తాజాగా ఓ ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. వివరాలిలా ఉన్నాయి. త‌మిళ స్టార్ హీరో విక్ర‌మ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం తంగ‌లాన్. ‘క‌బాలి’, ‘కాలా’, ‘స‌ర్ప‌ట్ట ప‌రంప‌ర’ చిత్రాల‌ తో ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పా. రంజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మాళవికా మోహనన్‌, పార్వతి తిరువొతు కథానాయికలుగా కనిపించనుండగా, పశుపతి, హాలీవుడ్ న‌టుడు డానియెల్‌ కల్టగిరోన్‌ తదితరులు ప్రధాన పాత్రలు‌ పోషిస్తున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న తంగలాన్ సినిమా ఇండిపెండెన్స్ కానుక‌గా ఆగ‌ష్టు 15న విడుద‌ల కానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. విక్రమ్, మాళవిక, దర్శకుడు పా. రంజిత్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమా వేడుకలో సందడి చేశారు.

ఇక తంగలాన్‌ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ప్రముఖ హాలీవుడ్ నటుడు డేనియల్‌ కాల్టగిరోన్‌ను స్టేజీపైకి ఆహ్వానించింది సుమ. అతనితో తెలుగులో మాట్లాడించే ప్రయత్నం చేసింది. ఇక చివర్లో కాస్త ఫన్‌ క్రియేట్‌ చేసేందుకు ప్రయత్నించింది. ఇక్కడ ఉండే అమ్మాయిల్లో సుమనే అందంగా ఉంది అని డేనియల్‌ తో తెలుగులో అనిపించింది. ఆ లైన్‌ కరెక్ట్‌గా చెప్పడంతో సంతోషంతో షేక్‌ హ్యాండ్‌ కూడా ఇచ్చింది. కానీ డేనియల్‌.. ఆమె చేతికి ముద్దు పెట్టడంతో సుమ అవాక్కయింది. అయితే ఈ సిట్యుయేషన్ ని కూడా ఎంతో కూల్ గా హ్యాండిల్ చేసింది మన యాంకరమ్మ. ‘రాజా(రాజీవ్ క‌న‌క‌లా) ఇత‌డు మా అన్న‌య్యా.. రాఖీ పండగ వ‌స్తుంది క‌దా.. అన్నయ్య సన్నిధి’ అంటూ పాట అందుకుంది. దీంతో ఒక్కసారిగా ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. అక్క‌డ ఉన్న అభిమానులంతా ఒక్క‌సారిగా అరుపులు కేక‌లు వేస్తూ హోరెత్తించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం