Bigg Boss Telugu 8: బిగ్ బాస్ పేరిట జరిగే బాగోతాలు ఇవే.. సంచలన విషయాలు బయటపెట్టిన ఆది రెడ్డి.. వీడియో

బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్ బాస్ మళ్లీ వస్తున్నాడు. ఇప్పటికే ఏడు సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ సెలబ్రిటీ గేమ్ షో కొత్త సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇటీవలే ఈ షోకు సంబంధించి ప్రోమోను రిలీజ్ చేసిన మేకర్స్ శనివారం (ఆగస్టు 03) బిగ్ బాస్ లేటెస్ట్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఇ

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ పేరిట జరిగే బాగోతాలు ఇవే.. సంచలన విషయాలు బయటపెట్టిన ఆది రెడ్డి.. వీడియో
Bigg Boss Telugu 8
Follow us

|

Updated on: Aug 04, 2024 | 9:26 PM

బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్ బాస్ మళ్లీ వస్తున్నాడు. ఇప్పటికే ఏడు సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ సెలబ్రిటీ గేమ్ షో కొత్త సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇటీవలే ఈ షోకు సంబంధించి ప్రోమోను రిలీజ్ చేసిన మేకర్స్ శనివారం (ఆగస్టు 03) బిగ్ బాస్ లేటెస్ట్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక అన్నపూర్ణ స్టూడియో ఆవరణలో బిగ్ బాస్ సెట్ వర్క్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే కంటెస్టెంట్స్ ఎంపికపై కూడా కసరత్తు జరుగుతోంది. కాగా బిగ్ బాస్ పేరిట గతంలో పలు మోసాలు వెలుగు చూశాయి. హౌస్ లోకి పంపిస్తామని ఎవరెవరికో డబ్బులు ఇచ్చి మోసపోయిన బాధితులు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు ఇదే విషయంపై బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, రివ్యూవర్ ఆది రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అదే సమయంలో ఎవరూ ఈ ట్రాప్ లో పడొద్దంటూ అందరినీ హెచ్చరించాడు. గతంలో బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన ఆది రెడ్డి ఆ తర్వాత బిగ్ బాస్ షోస్ పై రివ్యూలు, విశ్లేషణలు అందిస్తున్నాడు. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 వీడియోలు కూడా మొదలు పెట్టాడు. అందులో భాగంగా బిగ్ బాస్ పేరిట బయట జరుగుతు్న మోసాల గురించి కొన్ని కీలక విషయాలను ఒక వీడియోగా రూపొందించి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ఆదిరెడ్డి.. తనకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పటి నుంచి హౌస్ లోకి వెళ్లే వరకు జరిగిన మొత్తం విషయాలను, సెలక్షన్ ప్రాసెస్, రెమ్యూనరేషన్ తదితర విషయాల గురించి మొత్తం చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా తనకు బిగ్ బాస్ సీజన్ ద్వారా రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు పారితోషకం అందినట్లు చెప్పాడు. ‘నాకు బిగ్ బాస్ కు సంబంధించిన ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. మీకు బిగ్ బాస్ కి రావడానికి ఆసక్తి ఉందా అని అడిగాడు. నాకు ఇంట్రస్ట్ ఉంది అని చెప్పిన తర్వాత అధికారిక వెబ్ సైట్ నుంచి మెయిల్ పంపి కొన్ని వివరాలు అడిగారు. ఆ తర్వాత నాకు జూమ్ కాల్ ద్వారా ఇంటర్వ్యూ జరిగింది. తర్వాత రెమ్యూనరేషన్ వివరాలు చర్చిస్తారు. హెల్చ్ చెకప్స్, తర్వాత మెయిన్ ఇంటర్వ్యూ కూడా జరిగింది. ఏవీలు, డ్యాన్స్ షూట్స్ అన్నీ అయిన తర్వాత హౌస్ లోకి పంపుతారు. ప్రముఖులు సిఫారసులు, రికమెండేషన్ లతో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం అసాధ్యం. ఎవరైనా మీకు బిగ్ బాస్ హౌస్ కి పంపుతాను అని డబ్బులు అడిగితే ఆ ట్రాప్ లో పడకండి . ఆఫర్ ఇచ్చే పనైతే వాళ్లే కాల్ చేసి.. అధికారిక మెయిల్ ఐడీ నుంచి మెయిల్ చేస్తారు’ అని తన వీడియోలో చెప్పుకొచ్చాడు ఆదిరెడ్డి.

ఇవి కూడా చదవండి

ఆది రెడ్డి వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సామాన్యులకు తక్కువ సమయంలో శ్రీవారి దర్శనం టీటీడీ సరికొత్త ప్లాన్
సామాన్యులకు తక్కువ సమయంలో శ్రీవారి దర్శనం టీటీడీ సరికొత్త ప్లాన్
'ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌ కోటా రిజర్వేషన్‌ 2 నుంచి 3%నికి పెంపు'
'ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌ కోటా రిజర్వేషన్‌ 2 నుంచి 3%నికి పెంపు'
షారుక్ కోసం అభిమాని సాహసం..
షారుక్ కోసం అభిమాని సాహసం..
వరద బాధితులకు వెల్లూరు గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ భారీ వితరణ..
వరద బాధితులకు వెల్లూరు గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ భారీ వితరణ..
అది కూడా మానసిక ఆరోగ్య సమస్యలకు సంకేతమట..
అది కూడా మానసిక ఆరోగ్య సమస్యలకు సంకేతమట..
శ్రీశైలంలో కన్నుల పండువగా కార్తీకలక్షదీపోత్సవం పోటెత్తిన భక్తులు
శ్రీశైలంలో కన్నుల పండువగా కార్తీకలక్షదీపోత్సవం పోటెత్తిన భక్తులు
బస్సు టికెట్ చార్జీల పెంపుపై TGSRTC క్లారిటీ.. ఏం చెప్పిందంటే
బస్సు టికెట్ చార్జీల పెంపుపై TGSRTC క్లారిటీ.. ఏం చెప్పిందంటే
టెట్‌ ఫలితాల్లో అన్ని పేపర్లకు భారీగా తగ్గిన పాస్‌ పర్సెంటైల్
టెట్‌ ఫలితాల్లో అన్ని పేపర్లకు భారీగా తగ్గిన పాస్‌ పర్సెంటైల్
అమెరికాలో ఎన్నికలు భారత్‌లో హడావిడి ట్రంప్, కమలా గెలుపు కోసంపూజలు
అమెరికాలో ఎన్నికలు భారత్‌లో హడావిడి ట్రంప్, కమలా గెలుపు కోసంపూజలు
నిమ్మకాయా మజాకా.. ఆరోగ్యానికి పవర్‌ఫుల్.. డైలీ ఉదయాన్నే..
నిమ్మకాయా మజాకా.. ఆరోగ్యానికి పవర్‌ఫుల్.. డైలీ ఉదయాన్నే..