- Telugu News Photo Gallery Cinema photos Jabardasth Comedians Rocking Rakesh And Jordar Sujatha Maternity Photos Goes Viral
Rocking Rakesh-Sujatha: భార్యతో కలిసి మెటర్నరీ ఫొటో షూట్‌లో జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేశ్.. ఫొటోస్ ఇదిగో
జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేశ్ శుభవార్త చెప్పాడు. త్వరలో తాను తండ్రిగా ప్రమోషన్ పొందనున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం తన భార్య జోర్దార్ సుజాత గర్భంతో ఉందని చెప్పిన రాకింగ్ రాకేశ్.. ఇటీవల జరిగిన సీమంతం ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో అవి కాస్తా నెట్టింట వైరల్ గా మారాయి.
Updated on: Aug 04, 2024 | 9:53 PM

జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేశ్ శుభవార్త చెప్పాడు. త్వరలో తాను తండ్రిగా ప్రమోషన్ పొందనున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం తన భార్య జోర్దార్ సుజాత గర్భంతో ఉందని చెప్పిన రాకింగ్ రాకేశ్.. ఇటీవల జరిగిన సీమంతం ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో అవి కాస్తా నెట్టింట వైరల్ గా మారాయి.

జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో రాకింగ్ రాకేష్- జోర్దార్ సుజాత జోడీ ఒకటి. ఇదే వేదికపై ఒకరికొకరు పంచులు, సైటైర్లు వేసి బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఈ జంట నిజ జీవితంలోనూ కపుల్ గా మారారు.

ఇదే జబర్దస్త్ వేదికపైనే రాకేష్- సుజాత తమ ప్రేమను అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత ఇరు కుటుంబ పెద్దల అంగీకారంతో గత ఏడాది పెళ్లిపీటలెక్కారు.

ఇప్పుడు తమ ప్రేమ బంధానికి ప్రతీకగా ఒక పండంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించనున్నారీ క్యూట్ కపుల్. ఇటీవలే సుజాత సీమంతం వేడుకలు ఘనంగా నిర్వహించారు కుటుంబ సభ్యులు.

కాగా తాము తల్లిదండ్రులవుతున్నామన్న విషయాన్ని ఇన్నాళ్లూ గోప్యంగా ఉంచారు రాకేశ్- సుజాత దంపతులు. ప్రస్తుతం సుజాత తొమ్మిది నెలల గర్భంతో ఉందని పేర్కొంది.

కాగా రాకేశ్‌తో కలిసి మెటర్నటీ షూట్ లో పాల్గొంది సుజాత. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా అవి కాస్తా వైరలవుతున్నాయి.