- Telugu News Photo Gallery Cinema photos Heroine Malavika Mohanan birthday celebration on the sets of Prabhas' The Raja Saab
ప్రభాస్ హీరోయిన్ వచ్చేసింది.. రాజా సాబ్ సెట్‌లో మాళవిక బర్త్ డే సెలబ్రేషన్స్
కోలీవుడ్ హాట్ బ్యూటీ మాళవిక మోహన్. ఈ అమ్మడు ఇప్పటివరకు తెలుగులో సినిమాలు చేయలేదు. కానీ తమిళ్ సినిమాల్లో నటించింది. ఆ సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి ఆకట్టుకున్నాయి. దాంతో మాళవికాకు మంచి క్రేజ్ వచ్చింది.
Updated on: Aug 04, 2024 | 4:14 PM

కోలీవుడ్ హాట్ బ్యూటీ మాళవిక మోహన్. ఈ అమ్మడు ఇప్పటివరకు తెలుగులో సినిమాలు చేయలేదు. కానీ తమిళ్ సినిమాల్లో నటించింది. ఆ సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి ఆకట్టుకున్నాయి. దాంతో మాళవికాకు మంచి క్రేజ్ వచ్చింది.

మాళవిక మోహన్ మలయాళ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. మలయాళంలో కొన్ని సినిమాల్లో నటించి మెప్పించింది ఈ చిన్నది. ఆతర్వాత తమిళ్ లో సినిమాలు చేసింది. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన పేట సినిమాతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

దళపతి విజయ్ హీరోగా నటించిన మాస్టర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అలాగే ధనుష్ హీరోగా నటించిన మారన్ సినిమాలోనూ నటించింది. తాజాగా తంగలన్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.

ఇక ఇప్పుడు ఈ చిన్నది టాలీవుడ్ లోకి అడుగు పెట్టనుంది. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రాజా సాబ్ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ సెట్ లో ఈ అమ్మడి బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంది.

ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇక ఈ బ్యూటీ అందాల ఆరబోతలోనూ ఏమాత్రం వెనుకాడడు. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో సినిమాలు చేయడానికి ఇంట్రెస్టింగ్ గా ఎదుచూస్తుంది.. ప్రభాస్ సినిమాతో ఈ అమ్మడి క్రేజ్ డబుల్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.




