AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shilpa Shetty: శిల్పాశెట్టిలా మీరూ అందంగా, ఫిట్‌గా ఉండాలనుకుంటున్నారా? తన బ్యూటీ, ఫిట్ నెస్ సీక్రెట్స్ ఇవిగో

ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పేరుకు బాలీవుడ్ నటే అయినప్పటికీ తెలుగు ఆడియెన్స్ కు కూడా ఈ ముద్దు గుమ్మ బాగా చేరువైంది. సాహస వీరుడు సాగర కన్య, భలే వాడివి బాసూ, వీడెవడండి బాబూ, ఆజాత్ తదితర తెలుగు సినిమాల్లో నటించి మెప్పించిందీ అందాల తార.

Shilpa Shetty: శిల్పాశెట్టిలా మీరూ అందంగా, ఫిట్‌గా ఉండాలనుకుంటున్నారా? తన బ్యూటీ, ఫిట్ నెస్ సీక్రెట్స్ ఇవిగో
Actress Shilpa Shetty
Basha Shek
|

Updated on: Aug 03, 2024 | 9:33 PM

Share

ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పేరుకు బాలీవుడ్ నటే అయినప్పటికీ తెలుగు ఆడియెన్స్ కు కూడా ఈ ముద్దు గుమ్మ బాగా చేరువైంది. సాహస వీరుడు సాగర కన్య, భలే వాడివి బాసూ, వీడెవడండి బాబూ, ఆజాత్ తదితర తెలుగు సినిమాల్లో నటించి మెప్పించిందీ అందాల తార. బాలీవుడ్ లో ఎక్కువగా గ్లామర్ పాత్రల్లోనే శిల్ప మెప్పించింది. గతంలో కంటే ప్రస్తుతం సినిమాలు తగ్గించినప్పటికీ బాలీవుడ్ లో ఆమె క్రేజ్ ఏ మాత్రంతగ్గ లేదు. ముఖ్యంగా ఈ నటి ఫిట్‌నెస్, అందం గురించి నిరంతరం చర్చ జరుగుతుంది. నేటి నటీమణులు కూడా శిల్ప అందాన్ని చూసి అసూయపడతారంటే అతిశయోక్తి కాదు. 49 ఏళ్లు వచ్చినా శిల్పా అందం ఏమాత్రం తగ్గలేదు. 90వ దశకంలో ఎంత ఫిట్‌గా, అందంగా ఉందో ఇప్పటికీ అలానే కనిపిస్తోంది. మరి శిల్పా అందం వెనుక రహస్యం ఏంటో తెలుసుకుందాం రండి. శిల్పాశెట్టి పెద్ద ఫిట్‌నెస్ ఫ్రీక్. తన బ్యూటీ అండ్ ఫిట్ నెస్ గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది.

ఇక తన డైలీ రొటీన్ గురించి శిల్పా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ‘ఉదయం నిద్రలేవగానే గోరువెచ్చని నీళ్లు తాగుతాను. ఇది శరీరం నుండి విష పదార్థాలను బయటకు పంపుతుంది. అలాగే చర్మాన్ని శుభ్రపరుస్తుంది. నేను ఉసిరి రసం తాగుతాను. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. చర్మం మెరుపును పెంచేందుకు ఇది తోడ్పడుతుంది’ అని చెప్పుకొచ్చింది శిల్ప.

ఇవి కూడా చదవండి

శిల్పా తన ముఖాన్ని మాయిశ్చరైజ్ చేయడం మర్చిపోదు. ఇది చర్మాన్ని తేమగా మార్చడంతో పాటు మృదువుగా ఉంచుతుంది. దీని వల్ల ముఖంపై ముడతలు రావు. శిల్పా నిత్యం యోగా, మెడిటేషన్ సాధన చేస్తుంటారు. ఇది నటి శరీరం, చర్మం రెండింటినీ ఆరోగ్యంగా ఉంచుతుంది. శిల్పాశెట్టి ఎప్పుడూ తన వర్కవుట్‌ల ఫోటోలు మరియు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. అంతే కాకుండా అభిమానులకు వర్కవుట్ టిప్స్ కూడా ఇస్తుంటుంది. శిల్పా ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

శిల్పా ఒకప్పటిలా బాలీవుడ్‌లో యాక్టివ్‌గా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా ఆమెకు భారీగా అభిమానులు ఉన్నారు. నటి షేర ప్రతి పోస్ట్‌కి అభిమానులు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తుంటారు. ప్రస్తుతం కన్నడ చిత్రం ‘కెడి’లో నటిస్తోంది. ఈ సినిమాలో ధృవ సర్జా హీరోగా నటిస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది