- Telugu News Photo Gallery Cinema photos Balagam fame Kavya Kalyanram birthday celebrations photos goes viral
Kavya Kalyanram Birthday: గ్రాండ్‌గా బలగం బ్యూటీ బర్త్ డే పార్టీ.. సందడి చేసిన సినిమా తారలు.. ఫొటోస్ చూశారా?
చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు తెలుగు సినిమాల్లో నటించి మెప్పించింది కావ్య కళ్యాణ్ రామ్. స్నేహమంటే ఇదేరా, గంగోత్రి, ఠాగూర్, అడవి రాముడు, విజయేంద్ర వర్మ, బాలు, బన్నీ, సుభాష్ చంద్ర బోస్, పాండు రంగడు, ఉల్లాసంగా ఉత్సాహంగా తదితర సినిమాల్లో కావ్య నటించింది.
Updated on: Aug 01, 2024 | 9:28 PM

చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు తెలుగు సినిమాల్లో నటించి మెప్పించింది కావ్య కళ్యాణ్ రామ్. స్నేహమంటే ఇదేరా, గంగోత్రి, ఠాగూర్, అడవి రాముడు, విజయేంద్ర వర్మ, బాలు, బన్నీ, సుభాష్ చంద్ర బోస్, పాండు రంగడు, ఉల్లాసంగా ఉత్సాహంగా తదితర సినిమాల్లో కావ్య నటించింది.

ఇక 2022లో వచ్చిన మసూద సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కావ్య కల్యాణ్ రామ్. ఈ సినిమా హిట్ అయినప్పటికీ కావ్య రోల్ కు తగిన ప్రాధాన్యం లేకపోవడంతో ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు.

అయితే వేణు దర్శకత్వంలో తెరకెక్కిన బలగం సినిమాలో కావ్య తన దైన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది.

ఇదిలా ఉంటే ఇటీవల కావ్య కల్యాణ్ రామ్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. టాలీవుడ్ కు చెందిన పలువురు సెలబ్రిటీలు ఈ వేడుకల్లో సందడి చేశారు.

మసూదా మూవీ హీరో తిరువీర్, రాజశేఖర్ కూతుళ్లు శివానీ, శివాత్మిక, ఇషా రెబ్బా తదితరులు కావ్య బర్త్ డే పార్టీలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి