- Telugu News Photo Gallery Cinema photos AP Deputy CM Pawan Kalyan Meets Fans At Gannavaram Airport, See Photos
Pawan Kalyan: ‘మీరు గ్రేట్ సార్’.. బిజీ టైమ్‌లోనూ అభిమానులతో సందడిగా గడిపిన డిప్యూటీ సీఎం పవన్ .. ఫొటోస్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా ఫుల్ బిజీ బిజీగా ఉంటున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుని అక్కడక్కే పరిష్కరించేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇంత బిజీ టైమ్ లోనూ తన కోసం వచ్చిన అభిమానులకు సమయం కేటాయించారు పవన్ కల్యాణ్.
Updated on: Aug 01, 2024 | 5:56 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా ఫుల్ బిజీ బిజీగా ఉంటున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుని అక్కడక్కే పరిష్కరించేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇంత బిజీ టైమ్ లోనూ తన కోసం వచ్చిన అభిమానులకు సమయం కేటాయించారు పవన్ కల్యాణ్.

బుధవారం (జులై 31) రాత్రిపవన్ కళ్యాణ్ గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు. దీంతో అక్కడున్న ప్రయాణీకులు, అభిమానులు ఆయనను చుట్టు ముట్టారు.

పవన్ కల్యాణ్ చూడగానే అరుపులు, విజిల్స్ తో సందడి చేసారు. దీంతో ఎయిర్ పోర్ట్ పవన్ నినాదాలతో మార్మోగిపోయింది. దీనిని గమనించిన డిప్యూటీ సీఎం నేరుగా తన అభిమానుల వద్దకు వెళ్లారు.

ఎయిర్ పోర్ట్ లో ఉన్న ఫ్యాన్స్ ని, ప్రయాణికుల్ని కలిసి వారితో కాసేపు ముచ్చటించారు పవన్ కల్యాణ్. అక్కడ ఉన్న ఓ చిన్ని అభిమానిని ఎత్తుకొని ఆ ఫ్యామిలీతో సరదాగా మాట్లాడారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. డిప్యూటీ సీఎంగా బిజీలో ఉండి కూడా ఇలా ఫ్యాన్స్ తో ముచ్చటించడంతో పవన్ ని అందరూ అభినందిస్తున్నారు.