AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharateeyudu 2 OTT : భారతీయుడు 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. అనుకున్న తేదీ కంటే ముందుగానే స్ట్రీమింగ్‌.. ఎప్పుడంటే?

లోక నాయకుడు కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం భారతీయుడు 2. 1996లో ఇదే కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ భారతీయుడుకు ఇది సీక్వెల్. జులై 12న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మొదటి షో నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది

Bharateeyudu 2 OTT : భారతీయుడు 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. అనుకున్న తేదీ కంటే ముందుగానే స్ట్రీమింగ్‌.. ఎప్పుడంటే?
Bharateeyudu 2 Movie
Basha Shek
|

Updated on: Aug 01, 2024 | 8:53 PM

Share

లోక నాయకుడు కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం భారతీయుడు 2. 1996లో ఇదే కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ భారతీయుడుకు ఇది సీక్వెల్. జులై 12న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మొదటి షో నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది. మొదటి పార్ట్ మ్యాజిక్ ను కొనసాగించలేక చతికిల పడింది. తమిళంలో భారీగానే వసూళ్లు సాధించినప్పటికీ తెలుగుతో సహా ఇతర భాషల్లోనూ ఇండియన్ 2 సినిమా డిజాస్టర్ గా నిలిచింది. భారీ తారగణంతో పాటు యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ ఆకట్టుకున్నా నీరసమైన కథా, కథనాలు భారతీయుడు 2 సినిమాను దెబ్బ తీశాయి. దీంతో చాలా మంది ఈ సినిమాను ఓటీటీలో చూద్దామని ఫిక్స్ అయ్యారు. అలాంటి వారి కోసమే ఇప్పుడు భారతీయుడు 2 సినిమా ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైందని టాక్. ప్రముఖ ఓటీటీ ప్లా ట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. . సూపర్ హిట్ మూవీ సీక్వెల్ కావడం, కమల్, శంకర్ లకు ఉన్న క్రేజ్ ఉండడంతో భారతీయుడు 2 సినిమా ఓటీటీ హక్కుల కోసం నెట్ ఫ్లిక్స్ భారీగానే ఖర్చు పెట్టిందని సమాచారం. అయితే రిలీజ్ తర్వాత సినిమాకు ప్లాఫ్ టాక్ రావడంతో అనుకున్న తేదీ కంటే ముందుగానే భారతీయుడు 2 సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నారట. ఆగష్టు 9 నుంచే ఈ మూవీని స్ట్రీమింగ్ కు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.

భారతీయుడు 2 సినిమాలో కమల్‌ హాసన్‌తో పాటుగా సిద్ధార్, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, బాబీ సింహా, బ్రహ్మానందం, ప్రియా భవానీ శంకర్, కాజల్ అగర్వాల్ తదితరులు కీలకపాత్రలలో మెరిశారు. భారతీయుడు 2 కోసం నిర్మాతలు సుమారు రూ. 250 కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా.. అయితే ఓవరాల్ గా ఈ సినిమా రూ. 120 కోట్ల వరకు మాత్రమే కలెక్షన్స్‌ రాబట్టినట్లు సమాచారం. ఈ సినిమాకు తమన్ స్వరాలు సమకూర్చారు. మొదట ఈ సినిమాను స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15న ఓటీటీలోకి తీసుకురానున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ లేకపోవడంతో ఇప్పుడీ తేదీ మారిందని సమాచారం. మరి ఆగస్టు 9నే భారతీయుడు 2 ఓటీటీలోకి వస్తుందా? రాదా? అన్నది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

భారతీయుడు సినిమా మేకింగ్ వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.