AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2026 : వరల్డ్ కప్ నుంచి అవుట్ అయినా..రూ.కోట్ల బహుమతులు..ఐసీసీ నుంచి పాక్‎కు జాక్‎పాట్

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్ ప్రయాణం ముగిసింది. ఆశించిన స్థాయిలో రాణించలేక సూపర్ 8 రౌండ్‌లోనే ఆ జట్టు ఇంటిదారి పట్టింది. అయితే ఆట పరంగా అభిమానులను నిరాశపరిచినప్పటికీ, ఐసీసీ నుంచి భారీగానే నగదు బహుమతిని అందుకోబోతోంది పాక్ జట్టు.

T20 World Cup 2026 : వరల్డ్ కప్ నుంచి అవుట్ అయినా..రూ.కోట్ల బహుమతులు..ఐసీసీ నుంచి పాక్‎కు జాక్‎పాట్
Pakistan Cricket
Rakesh
|

Updated on: Mar 01, 2026 | 12:44 PM

Share

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్ ప్రయాణం ముగిసింది. ఆశించిన స్థాయిలో రాణించలేక సూపర్ 8 రౌండ్‌లోనే ఆ జట్టు ఇంటిదారి పట్టింది. అయితే ఆట పరంగా అభిమానులను నిరాశపరిచినప్పటికీ, ఐసీసీ నుంచి భారీగానే నగదు బహుమతిని అందుకోబోతోంది పాక్ జట్టు. టోర్నీ నుంచి నిష్క్రమించినా, నిబంధనల ప్రకారం ఆ జట్టుకు కోట్ల రూపాయల ప్రైజ్ మనీ దక్కనుంది. సూపర్‌ 8 వరకు చేరడం, అలాగే ఆడిన మ్యాచుల్లో సాధించిన విజయాల ఆధారంగా ఈ లెక్కలు వేస్తున్నారు.

ఐసీసీ నిబంధనల ప్రకారం.. సూపర్ 8 దశలో వెనుదిరిగిన జట్లకు (5వ స్థానం నుంచి 8వ స్థానం వరకు) సుమారు 3.8 లక్షల అమెరికన్ డాలర్ల గ్యారెంటీ ప్రైజ్ మనీ లభిస్తుంది. మన భారతీయ కరెన్సీలో దీని విలువ దాదాపు రూ.3.5 కోట్లు. టోర్నీలో పాల్గొన్నందుకు, సూపర్-8 రౌండ్ వరకు ప్రయాణించినందుకు గానూ ఈ మొత్తాన్ని ఐసీసీ అందజేస్తుంది. కేవలం ఇది మాత్రమే కాకుండా, జట్టు సాధించిన ప్రతి విజయాకి అదనంగా బోనస్ కూడా లభిస్తుంది.

ఈ వరల్డ్ కప్‌లో సెమీఫైనల్, ఫైనల్ మినహా, గ్రూప్ స్టేజ్, సూపర్ 8లో సాధించిన ప్రతి విజయాకి ఐసీసీ సుమారు 31,154 డాలర్లు (దాదాపు రూ. 28 లక్షలు) ఇస్తుంది. పాకిస్థాన్ ఈ టోర్నీలో మొత్తం 4 మ్యాచుల్లో విజయం సాధించింది. గ్రూప్ స్టేజ్‌లో నెదర్లాండ్స్, యూఎస్ఏ, నమీబియాపై గెలవగా.. సూపర్ 8లో శ్రీలంకపై ఒక విజయాన్ని నమోదు చేసింది. ఈ 4 విజయాలకు గానూ అదనంగా 1.24 లక్షల డాలర్లు అంటే సుమారు రూ.1.12 కోట్లు పాక్ ఖాతాలో చేరనున్నాయి. మొత్తంగా చూస్తే, ఈ వరల్డ్ కప్ ద్వారా పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు దాదాపు రూ.4.6 కోట్ల పైచిలుకు ఆదాయం లభించనుంది.

పాకిస్థాన్ ఈ టోర్నీని విజయంతోనే మొదలుపెట్టింది. నెదర్లాండ్స్‌ను 3 వికెట్ల తేడాతో ఓడించి మంచి ఊపు మీద కనిపించింది. ఆ తర్వాత అమెరికాపై కూడా 32 పరుగుల తేడాతో గెలిచింది. కానీ, చిరకాల ప్రత్యర్థి భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోవడంతో ఆ జట్టు ఆత్మవిశ్వాసం దెబ్బతింది. సూపర్-8లో న్యూజిలాండ్‌తో మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడం, ఇంగ్లాండ్ చేతిలో 2 వికెట్ల తేడాతో ఓడిపోవడం పాక్ కొంపముంచింది. ఆఖరి మ్యాచ్‌లో శ్రీలంకపై గెలిచినా.. రన్ రేట్ లెక్కల్లో వెనుకబడి సెమీస్ రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆట కంటే ఆదాయమే ఎక్కువగా లభించిన ఈ టోర్నీ పాక్ క్రికెట్ చరిత్రలో ఒక వింత అనుభవంగా మిగిలిపోనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మమత పాలనకు నిరసనగా తాడేపల్లి గూడెం మహిళ చేసిన అసాధారణ చర్య!
మమత పాలనకు నిరసనగా తాడేపల్లి గూడెం మహిళ చేసిన అసాధారణ చర్య!
పోలీసులను పిలవండి.. లాయర్‌పై హైకోర్టు జడ్జి ఆగ్రహం..
పోలీసులను పిలవండి.. లాయర్‌పై హైకోర్టు జడ్జి ఆగ్రహం..
జననాయగన్‌ టైటిల్స్‌ మార్పులు చేయాలి..ఫ్యాన్స్‌ స్పెషల్ రిక్వెస్ట్
జననాయగన్‌ టైటిల్స్‌ మార్పులు చేయాలి..ఫ్యాన్స్‌ స్పెషల్ రిక్వెస్ట్
మళ్లీ మొదలైన ఉద్యోగాల జాతర.. 39 వేల ఉద్యోగాలు వస్తున్నాయ్
మళ్లీ మొదలైన ఉద్యోగాల జాతర.. 39 వేల ఉద్యోగాలు వస్తున్నాయ్
11 ఫోర్లు, 8సిక్స్‌లు.. 35 బంతుల్లో సెంచరీతో ఊచకోత
11 ఫోర్లు, 8సిక్స్‌లు.. 35 బంతుల్లో సెంచరీతో ఊచకోత
చనిపోయిందని చెప్పి శిశువును అమ్మేశారు.. చివరికి ఏమైంది?
చనిపోయిందని చెప్పి శిశువును అమ్మేశారు.. చివరికి ఏమైంది?
రైలు బోగీపై SLR ఎందుకు రాసి ఉంటుంది?.. ఇది స్లీపర్ కోచ్ కాదు..!
రైలు బోగీపై SLR ఎందుకు రాసి ఉంటుంది?.. ఇది స్లీపర్ కోచ్ కాదు..!
రూ.20 లక్షల జీతం వస్తున్నా.. ఒక్క రూపాయి పన్ను లేదు!
రూ.20 లక్షల జీతం వస్తున్నా.. ఒక్క రూపాయి పన్ను లేదు!
ప్లేఆఫ్స్‌ చేరాలంటే ఒక్కో టీం ఎన్ని మ్యాచ్‌లు గెలవాలంటే..?
ప్లేఆఫ్స్‌ చేరాలంటే ఒక్కో టీం ఎన్ని మ్యాచ్‌లు గెలవాలంటే..?
పెద్ద ప్లానింగే.. ATMను బోలెరో వాహనంకి కట్టి ఈడ్చుకెళ్లిన దొంగలు!
పెద్ద ప్లానింగే.. ATMను బోలెరో వాహనంకి కట్టి ఈడ్చుకెళ్లిన దొంగలు!