AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నల్ల దారం ఎందుకు ధరిస్తారు? కట్టుకునే ముందు ఈ నియమాలు తప్పక పాటించండి!

చాలా మంది తమ చేతికి లేదా కాలికి నల్ల దారం కట్టుకుంటారు. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చాలామంది దీన్ని ఒక రక్షణ కవచంలా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, నల్ల దారం శని దేవుని ఆశీస్సులకు చిహ్నం, ఇది ప్రతికూల శక్తుల నుండి రక్షణ కల్పిస్తుంది. అయితే, అందరూ దీన్ని ధరించవచ్చా? దీని వెనుక ఉన్న శాస్త్రీయ, జ్యోతిష్య కారణాలు ఏమిటి? తెలుసుకుందాం.

నల్ల దారం ఎందుకు ధరిస్తారు? కట్టుకునే ముందు ఈ నియమాలు తప్పక పాటించండి!
Black Thread Significance
Jyothi Gadda
|

Updated on: Jul 29, 2026 | 9:35 AM

Share

హిందూ ధర్మంలో నల్ల దారం ధరించడం అనేది ఒక ప్రాచీన నమ్మకం. ఇది కేవలం ఫ్యాషన్ మాత్రమే కాదు, దృష్టి దోషం నుండి రక్షణ పొందేందుకు, శని గ్రహ ప్రభావాలను తగ్గించుకునేందుకు ఉపయోగించే ఒక శక్తివంతమైన పరిహారం. నల్ల రంగు ప్రతికూల శక్తులను గ్రహిస్తుందని, తద్వారా మనల్ని దుష్టశక్తుల నుండి కాపాడుతుందని విశ్వసిస్తారు. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నల్ల దారాన్ని ఎవరు ధరించాలి, ఏ సమయంలో కట్టుకోవాలి మరియు ఏ రాశుల వారు దీనికి దూరంగా ఉండాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. సరైన పద్ధతిలో ధరించినప్పుడే ఈ దారం శుభఫలితాలను ఇస్తుంది, లేదంటే ప్రతికూల ప్రభావాలు చూపే అవకాశం ఉంటుంది.

నల్ల దారం ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు:

దిష్టి దోష నివారణ: నలుపు రంగు దృష్టిని ఆకర్షిస్తుందని, ఇతరుల చెడు చూపులు వ్యక్తిపై పడకుండా అడ్డుకుంటుందని పెద్దల నమ్మకం.

శని దోష శాంతి: జాతకంలో శని ప్రభావం బలంగా ఉన్నవారు లేదా ఏలినాటి శని, అష్టమ శనితో బాధపడేవారు శనివారం నాడు నల్ల దారం ధరిస్తే ఉపశమనం కలుగుతుంది.

ఇవి కూడా చదవండి

ఆరోగ్య ప్రయోజనాలు: ఆయుర్వేద మరియు జానపద వైద్యంలో, కడుపు నొప్పి లేదా జీర్ణ సమస్యలతో బాధపడే పిల్లలకు నల్ల దారం కట్టడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెబుతారు.

ధరించేటప్పుడు పాటించాల్సిన నియమాలు: నల్ల దారాన్ని ఏ సమయంలో పడితే ఆ సమయంలో ధరించకూడదు. కొన్ని నియమాలు పాటిస్తేనే పూర్తి ప్రయోజనం లభిస్తుంది.

శుభ సమయం: నల్ల దారాన్ని ఎల్లప్పుడూ శనివారం నాడు ధరించడం అత్యంత శ్రేష్ఠం. ఆ రోజు ఉదయం స్నానం ఆచరించి, శని దేవుని స్మరించుకుంటూ ధరించాలి.

మంత్ర పఠనం: దారం కట్టుకునేటప్పుడు ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం చాలా మంచిది.

బేసి సంఖ్య: దారాన్ని చుట్టేటప్పుడు 3, 7 లేదా 9 సార్లు (బేసి సంఖ్యలో) చుట్టడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.

మిశ్రమ రంగులు: నల్ల దారం కట్టిన చోట ఎరుపు లేదా పసుపు రంగు దారాలను కట్టకూడదు. ఇది శని దేవుని శక్తిని నిర్వీర్యం చేస్తుంది.

ఎవరు ధరించకూడదు? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మేషం, వృశ్చిక రాశుల వారు నల్ల దారాన్ని ధరించకూడదు. ఈ రెండు రాశులకు కుజుడు అధిపతి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, కుజుడికి, శనికి అస్సలు పడదు. కాబట్టి, ఈ రాశుల వారు నల్ల దారం ధరిస్తే జీవితంలో అనవసరమైన గొడవలు, ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే, మీ జాతకంలో శని గ్రహం మీకు యోగకారుడై అంటే మంచి ఫలితాలు ఇచ్చేవాడుగా ఉంటే, దాన్ని ధరించకపోవడమే మంచిది.

ముఖ్య గమనిక: నమ్మకం అనేది మనసుకి సంబంధించినది. ఏదైనా పరిహారాన్ని ఆచరించేటప్పుడు శ్రద్ధాభక్తులతో చేయడం వల్ల ఫలితాలు ఖచ్చితంగా కనిపిస్తాయి. అయితే, జ్యోతిష్యపరమైన సందేహాలు ఉంటే ఒకసారి మీ జాతకాన్ని పరిశీలింపజేసుకోవడం ఉత్తమం.

(Disclaimer: ఈ సమాచారం, పరిహారాలు జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న సంప్రదాయ విశ్వాసాల ఆధారంగా మాత్రమే అందించడం జరిగింది. వీటికి శాస్త్రీయ ఆధారాలు నిర్ధారించబడలేదు. వ్యక్తిగత విశ్వాసం మేరకు మాత్రమే వీటిని ఆచరించాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రికార్డ్ టైమింగ్‎తో దుమ్ములేపిన తెలుగమ్మాయి
రికార్డ్ టైమింగ్‎తో దుమ్ములేపిన తెలుగమ్మాయి
రావణుడి పది తలలు దేనికి సంకేతం? ఆ 10 దుర్గుణాలు ఏమిటో తెలుసా?
రావణుడి పది తలలు దేనికి సంకేతం? ఆ 10 దుర్గుణాలు ఏమిటో తెలుసా?
క్రేజీ కాంబినేషన్.. ఆ సౌత్ డైరెక్టర్ తో హృతిక్ రోషన్ సినిమా..
క్రేజీ కాంబినేషన్.. ఆ సౌత్ డైరెక్టర్ తో హృతిక్ రోషన్ సినిమా..
కాబోయే భార్యతో కలిసి బతుకమ్మ సంబరాల్లో డైరెక్టర్ డేగల బాబు
కాబోయే భార్యతో కలిసి బతుకమ్మ సంబరాల్లో డైరెక్టర్ డేగల బాబు
ఉప్పల్‌–నాగోల్‌ రోడ్డులో కారు బీభత్సం.. ఫౌంటెన్‌లా ఎగసిపడ్డ నీరు
ఉప్పల్‌–నాగోల్‌ రోడ్డులో కారు బీభత్సం.. ఫౌంటెన్‌లా ఎగసిపడ్డ నీరు
18 ఏళ్లు నిండాక పాన్ కార్డులో ఫొటో, సంతకం అప్డేట్ చేేసుకోవడం ఎలా
18 ఏళ్లు నిండాక పాన్ కార్డులో ఫొటో, సంతకం అప్డేట్ చేేసుకోవడం ఎలా
భువీ స్వింగ్‌కు కివీస్ బ్యాటర్లు దొరుకుతారా.. లేక పాత కథేనా?
భువీ స్వింగ్‌కు కివీస్ బ్యాటర్లు దొరుకుతారా.. లేక పాత కథేనా?
దసరా తర్వాత.. వీరికి విపరీతంగా కలిసివస్తుంది.. మీ రాశి ఉందా?
దసరా తర్వాత.. వీరికి విపరీతంగా కలిసివస్తుంది.. మీ రాశి ఉందా?
కివీస్ గడ్డపై టీమిండియా జోరు సాగుతుందా?
కివీస్ గడ్డపై టీమిండియా జోరు సాగుతుందా?
విజయదశమి రోజు ఇంటికి ఏ వస్తువులు కొనాలి? ఈ పనులు చేస్తే శుభప్రదం!
విజయదశమి రోజు ఇంటికి ఏ వస్తువులు కొనాలి? ఈ పనులు చేస్తే శుభప్రదం!