Paris Olympics 2024: నిండు గర్భంతో ఒలింపిక్స్ క్రీడల్లో పోటీ.. ఈ మగువ తెగువను మెచ్చుకోవాల్సిందే

ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో పతకం గెల్చుకోవాలని క్రీడాకారులందరూ కలలు కంటారు. కనీసం పతకం గెలవకపోయినా ఈ మెగా క్రీడల్లో పాల్గొంటే చాలని ఎదురు చూసే వారు చాలా మందే ఉన్నారు. ఇందుకోసం అహర్నిశలు కష్టపడుతుంటారు.

Paris Olympics 2024: నిండు గర్భంతో ఒలింపిక్స్ క్రీడల్లో పోటీ.. ఈ మగువ తెగువను మెచ్చుకోవాల్సిందే
Egyptian Fencer Nada Hafez
Follow us

|

Updated on: Jul 31, 2024 | 6:58 PM

ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో పతకం గెల్చుకోవాలని క్రీడాకారులందరూ కలలు కంటారు. కనీసం పతకం గెలవకపోయినా ఈ మెగా క్రీడల్లో పాల్గొంటే చాలని ఎదురు చూసే వారు చాలా మందే ఉన్నారు. ఇందుకోసం అహర్నిశలు కష్టపడుతుంటారు. అయితే ఈజిప్ట్ ఫెన్సర్ నాడా హఫీజ్ మాత్రం మరో అడుగు ముందు కేసింది. ఏడు నెలల నిండు గర్భంతో పారిస్ ఒలింపిక్స్ పోటీల్లో బరిలోకి దిగింది. ఒలింపిక్స్ వేదికపైనే మాతృత్వాన్ని చాటుకోవాలని, దీని ద్వారా మహిళలందరికీ సందేశం ఇవ్వాలని కలలు కంది. అయితే దురదృష్టవశాత్తూ హఫీజ్ 16వ రౌండ్‌లో ఓడిపోయింది. అయితేనేం గర్భం లేదా ప్రసవం ఒక మహిళ విజయానికి ఎలాంటి అడ్డంకి కాదని ఈ డేరింగ్ వుమన్ నిరూపించింది. అయితే తాను 7 నెలల గర్భవతి అయినప్పటికీ ఒలింపిక్స్‌లో పాల్గొన్నట్లు నాడా హఫీజ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసేంత వరకు ఈ విషయం చాలా మందికి ఈ విషయం తెలియదు. ఇప్పుడు ఆమె ధైర్యాన్ని, నిబద్ధతను అందరూ అభినందిస్తున్నారు.

ఈజిప్టు ఫెన్సర్ నాడా హఫీజ్ పారిస్ 2024 ఒలింపిక్స్‌లో కొత్త రికార్డు సృష్టించింది. 26 ఏళ్ల నాడా హఫీజ్ తన మూడో ఒలింపిక్స్‌లో మహిళల వ్యక్తిగత సాబర్ ఈవెంట్‌లో తన మొదటి మ్యాచ్‌ను గెలుచుకుంది. మహిళల వ్యక్తిగత ఫెన్సింగ్ పోటీలో 26 ఏళ్ల హఫీజ్ తన తొలి మ్యాచ్‌లో 15-13తో అమెరికాకు చెందిన ఎలిజబెత్ టార్టకోవ్‌స్కీపై గెలిచింది. ఆ తర్వాత 16వ రౌండ్‌లో దక్షిణ కొరియాకు చెందిన జియోన్ హయాంగ్‌తో తలపడింది. అయితే ఈ రౌండ్ లో ఆమెకు ఓటమి ఎదురైంది. “సాధారణంగా ఒలింపిక్ వేదికపై ఇద్దరు ఆటగాళ్లు తలపడడం మీరు చూసి ఉండొచ్చు. కానీ ఈ వేదికపై మేం ముగ్గురం ఉన్నాం. నేను, నా ప్రత్యర్థి, అలాగే నా కడుపులోని పసి బిడ్డ. తాను ఇంకా మన ప్రపంచంలోకి అడుగు పెట్టలేదు! నేను ఇప్పుడు 7 నెలల గర్భవతిని. కాబట్టి, ఈ పోటీ నాకు చాలా ప్రత్యేకమైనది. ఈసారి నేను ఒక చిన్న ఒలింపియన్‌ను వేదికపైకి తీసుకువెళ్లాను’ అని నాడా హఫీజ్ తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది.

ఇవి కూడా చదవండి

నాడా హఫీజ్ ఎమోషనల్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Nada Hafez (@nada_hafez)

కాగా ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనడం హఫీజ్ కు ఇది మూడోసారి. ఇది వరకు ఆమె 2016 రియో ​​ఒలింపిక్స్, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో నూ పాల్గొంది. మాజీ జిమ్నాస్ట్ కూడా అయిన హఫీజ్ 2019 ఆఫ్రికన్ గేమ్స్‌లో వ్యక్తిగత, టీమ్ సాబర్ ఈవెంట్‌లలో స్వర్ణం సాధించింది.

View this post on Instagram

A post shared by Nada Hafez (@nada_hafez)

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నిండు గర్భంతో ఒలింపిక్స్ లోకి.. ఈ మగువ తెగువను మెచ్చుకోవాల్సిందే
నిండు గర్భంతో ఒలింపిక్స్ లోకి.. ఈ మగువ తెగువను మెచ్చుకోవాల్సిందే
హత్యకుగురైన హమాస్ నాయకుడి ఆస్తులేంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
హత్యకుగురైన హమాస్ నాయకుడి ఆస్తులేంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
పెద్ద సినిమాలకు పోటీగా కీర్తిసురేష్ సినిమా..
పెద్ద సినిమాలకు పోటీగా కీర్తిసురేష్ సినిమా..
ఆన్‌లైన్‌లో పాలక్ పన్నీర్ ఆర్డర్ పెడితే.. పార్శిల్ ఓపెన్ చేసి
ఆన్‌లైన్‌లో పాలక్ పన్నీర్ ఆర్డర్ పెడితే.. పార్శిల్ ఓపెన్ చేసి
మీ ఐ ఫోకస్ ఏ రేంజ్ ఏంటి.? ఈ ఫోటోలో దాగున్న 4657 నెంబర్‌ను.!
మీ ఐ ఫోకస్ ఏ రేంజ్ ఏంటి.? ఈ ఫోటోలో దాగున్న 4657 నెంబర్‌ను.!
ప్రకృతిలో విహరిస్తున్న అందాల ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి 
ప్రకృతిలో విహరిస్తున్న అందాల ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి 
మాజీ సీఎం మనవడితో హీరోయిన్ డేటింగ్! జాన్వీకి తోడి కోడలుగా..
మాజీ సీఎం మనవడితో హీరోయిన్ డేటింగ్! జాన్వీకి తోడి కోడలుగా..
సొరచేప ఎలా పుడుతుందో ఎప్పుడైనా చూశారా..?ఆ అక్వేరియంలో అరుదైన ఘటన
సొరచేప ఎలా పుడుతుందో ఎప్పుడైనా చూశారా..?ఆ అక్వేరియంలో అరుదైన ఘటన
పెద్దరాయుడులో బ్రహ్మానందం భార్య.. ఈ ఫెమస్ జబర్దస్త్ నటి అమ్మా..!!
పెద్దరాయుడులో బ్రహ్మానందం భార్య.. ఈ ఫెమస్ జబర్దస్త్ నటి అమ్మా..!!
మోకాళ్ల నొప్పులతో బాధ పడుతున్నారా.. ఈ ఆహారాలకు దూరంగా ఉండండి..
మోకాళ్ల నొప్పులతో బాధ పడుతున్నారా.. ఈ ఆహారాలకు దూరంగా ఉండండి..
రైల్వే‌స్టేషన్‌లో కంగారుగా కనిపించిన నలుగురు వ్యక్తులు..ఆరా తీయగా
రైల్వే‌స్టేషన్‌లో కంగారుగా కనిపించిన నలుగురు వ్యక్తులు..ఆరా తీయగా
ఆర్టీసీ బస్సులో పండ్లు తోముతోన్న మహిళ
ఆర్టీసీ బస్సులో పండ్లు తోముతోన్న మహిళ
తెలంగాణ అసెంబ్లీ లైవ్ ఇక్కడ వీక్షించండి
తెలంగాణ అసెంబ్లీ లైవ్ ఇక్కడ వీక్షించండి
మీ ఏజ్‌ తగ్గి యవ్వనంగా కనిపించాలా.? అయితే ఇలా చేయండి.!
మీ ఏజ్‌ తగ్గి యవ్వనంగా కనిపించాలా.? అయితే ఇలా చేయండి.!
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.! పలు జిల్లాలకు అలర్ట్‌
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.! పలు జిల్లాలకు అలర్ట్‌
ట్రాఫిక్‌ పోలీసంటే ఇలా ఉండాలి.! ప్రశంసలు కురిపించిన నెటిజన్లు.
ట్రాఫిక్‌ పోలీసంటే ఇలా ఉండాలి.! ప్రశంసలు కురిపించిన నెటిజన్లు.
భలే ఛాన్స్‌లే! పులస చేపలతో విందు.! ఫోటో,వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్
భలే ఛాన్స్‌లే! పులస చేపలతో విందు.! ఫోటో,వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్
మంచి సమయం.. బంగారంపై పెట్టుబడికి 6 మార్గాలు.! నిపుణులు మాటేంటి.?
మంచి సమయం.. బంగారంపై పెట్టుబడికి 6 మార్గాలు.! నిపుణులు మాటేంటి.?
బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతోందా.? వేప చెట్టు నుంచి పాల ధార..
బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతోందా.? వేప చెట్టు నుంచి పాల ధార..
వెజ్ ఫుడ్ ఆర్డర్ చేస్తే.. నాన్ వెజ్ ఫుడ్ డెలివరీ.. ఎక్కడంటే..!
వెజ్ ఫుడ్ ఆర్డర్ చేస్తే.. నాన్ వెజ్ ఫుడ్ డెలివరీ.. ఎక్కడంటే..!