Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందరి ముందే హద్దులు దాటారు.. పీకల్లోతు వివాదంలో ఆ దేశాధ్యక్షుడు, మహిళా మంత్రి

ఆయనో దేశానికి అధ్యక్షుడు.. ఆమె క్రీడా మంత్రి.. అంతా ఓకే కానీ.. విశ్వ వేదికపై ఇద్దరూ చూపులు కలిశాయి.. ఈ క్రమంలో లేడీ మినిస్టర్ తడబడింది.. ఇంకేముంది ఆయన ఒక దేశానికి అధ్యక్షుడు.. ఇంకా చాలా మంది ప్రముఖులు వేదికపై ఉన్నారన్న సంగతి మర్చిపోయింది.. ఓ  అడుగు ముందుకేసి అధ్యక్షుడిని కౌగిలించుకుని కిస్ చేసింది.

అందరి ముందే హద్దులు దాటారు.. పీకల్లోతు వివాదంలో ఆ దేశాధ్యక్షుడు, మహిళా మంత్రి
French President
Shaik Madar Saheb
| Edited By: Janardhan Veluru|

Updated on: Jul 31, 2024 | 6:04 PM

Share

ఆయనో దేశానికి అధ్యక్షుడు.. ఆమె క్రీడా మంత్రి.. అంతా ఓకే కానీ.. విశ్వ వేదికపై ఇద్దరూ చూపులు కలిశాయి.. ఈ క్రమంలో లేడీ మినిస్టర్ తడబడింది.. ఇంకేముంది ఆయన ఒక దేశానికి అధ్యక్షుడు.. ఇంకా చాలా మంది ప్రముఖులు వేదికపై ఉన్నారన్న సంగతి మర్చిపోయింది.. ఓ  అడుగు ముందుకేసి అధ్యక్షుడిని కౌగిలించుకుని కిస్ చేసింది.. ఇంకేముంది అధ్యక్షుడు కూడా ఆమెను గట్టిగానే హత్తుకున్నాడు.. దీంతో ఈ ముద్దూ ముచ్చట దుమ్ముదుమారంగా మారింది. అసలేం జరిగిందంటే.. ఒలింపిక్స్‌ వేడుకలకు ఫ్రాన్స్‌ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. గతవారం పారిస్‌లోని సెన్‌ నదిపై ఈ విశ్వ క్రీడా సంబరం అట్టహాసంగా ప్రారంభమైంది. ఒలిపిక్స్ వేడుకల్లో అధ్యక్షుడు మేక్రాన్‌తో పాటు ఇతర దేశాల ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్‌ క్రీడల మంత్రి ఎమిలీ కాస్టెరా అధ్యక్షుడు మాక్రాన్ ని కౌగలించుకొని ఆయన చెంపపై గాఢంగా ముద్దు పెట్టారు. ఆ సమయంలో పక్కనే ఉన్న ఫ్రాన్స్ ప్రధాని గాబ్రియల్‌ అట్టాల్‌ కాస్త ఇబ్బంది పడుతూ పక్కకు చూస్తూ కనిపించారు. ఈ దృశ్యాన్ని ఫ్రెంచ్‌ మ్యాగజైన్‌ మాడమ్‌ ఫిగారో క్లిక్‌ మనిపించింది.. దీంతో దేశంలో దుమ్ముదుమారం మొదలైంది.. ఆ ఫొటో కాస్త నెట్టింట వైరల్‌గా మారడంతో మాక్రాన్‌పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇటీవల మాడమ్‌ ఫిగారో కథనంలో ప్రచురిస్తూ.. ‘ఈ ముద్దు చాలా వింతగా ఉంది. బహుశా మంత్రి ఎమిలీ అందరి దృష్టిని ఆకర్షించాలనుకుంటున్నారేమో అందుకే ఇలా చేశారు’ అని రాసుకొచ్చింది. ఇందులో వీరిద్దరూ చాలా సన్నిహితంగా ఉన్నట్లు కన్పించడం మరింత వివాదానికి దారితీసింది. ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తులు.. ఓ గొప్ప కార్యక్రమంలో ఇలా అనుచితంగా ప్రవర్తించడం ఏంటంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

ఈ ఫోటోలు ఫ్రాన్స్‌లో సంచలనం కలిగించాయి.. వినియోగదారులు వారిద్దరూ ప్రేమలో ఉన్నారని.. కానీ అందరి ముందు ఇలా ముద్దులు పెట్టుకోవడం ఇబ్బందిగా ఉంది.. అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఉన్నతంగా ఉండాల్సిన వారు ఇలా ప్రవర్తించడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు.

ఇదిలాఉంటే.. క్రీడల మంత్రిగా ఉన్న ఎమిలీ ఇటీవల ఒలింపిక్స్‌ ప్రారంభానికి ముందు సెన్‌ నదిలో స్విమ్మింగ్‌ చేశారు. నది చాలా పరిశుభ్రంగా ఉందని చాటి చెప్పేందుకు ఈ ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అందులో నీటి నాణ్యతపై ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.. అంతేకాకుండా నదిలో నిర్వహించాల్సిన కొన్ని పోటీలను వాయిదా కూడా వేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..