పారిస్ ఒలింపిక్స్ 2024
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో 33వ ఒలింపిక్స్ నిర్వహిస్తున్నారు. ఈ మెగా బ్యాటిల్ ఆఫ్ స్పోర్ట్స్ 26 జూలై నుండి 11 ఆగస్టు 2024 వరకు కొనసాగుతుంది. 100 ఏళ్ల తర్వాత పారిస్‌లో ఒలింపిక్స్ నిర్వహిస్తుండటం విశేషం. గతంలో పారిస్ నగరంలో 1900, 1924 సంవత్సరాలలో ఒలింపిక్స్ పోటీలు నిర్వహించారు. లండన్ తర్వాత, మూడోసారి ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇస్తున్న ఏకైక నగరం పారిస్. పారిస్ ఒలింపిక్స్‌లో 329 ఈవెంట్‌లు జరగనుండగా, 19 రోజుల పాటు 32 క్రీడా పోటీలు జరగనున్నాయి. పారిస్ ఒలింపిక్స్‌లో 10,500 మంది అథ్లెట్లు పాల్గొనబోతున్నారు. ఒలంపిక్స్ క్రీడల కోసం మొత్తం రూ. 81 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు.
ఒలంపిక్స్ చరిత్రలో భారత్ ఇప్పటి వరకు 35 పతకాలు సాధించింది. 2020 టోక్యో ఒలంపిక్స్‌లో భారత్ 7 పతకాలు సాధించింది. భారత ఆటగాళ్ల అత్యుత్తమ ప్రదర్శన ఇదేకావడం విశేషం. 2012 లండన్ ఒలంపిక్స్‌లో భారత్ 6 పతకాలు సాధించింది.