- Telugu News Photo Gallery Sports photos Manu Bhaker likley skip the Shooting World Cup in New Delhi says reports telugu news
Manu Bhaker: భారత్‌లో జరిగే షూటింగ్ ప్రపంచకప్ నుంచి మను భాకర్ ఔట్.. కారణం ఏంటంటే?
Shooting World Cup: పారిస్ ఒలింపిక్స్‌లో షూటింగ్ పోటీల్లో భారత్‌కు 2 కాంస్య పతకాలు సాధించిన మను భాకర్ ఈ ఏడాది భారత్‌లో జరిగే షూటింగ్ ప్రపంచకప్‌లో పాల్గొనడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయాన్ని తెలియజేసిన మను కోచ్ జస్పాల్ రాణా.. షూటింగ్ ప్రపంచకప్‌లో మను పాల్గొనే అవకాశం చాలా తక్కువంటూ షాక్ ఇచ్చాడు.
Updated on: Aug 13, 2024 | 8:08 PM

పారిస్ ఒలింపిక్స్‌లో షూటింగ్ పోటీల్లో భారత్ తరపున 2 కాంస్య పతకాలు సాధించిన మను భాకర్ ఈ ఏడాది భారత్‌లో జరిగే షూటింగ్ ప్రపంచకప్‌లో పాల్గొనడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ విషయాన్ని తెలియజేసిన మను కోచ్ జస్పాల్ రాణా.. షూటింగ్ ప్రపంచకప్‌లో మను పాల్గొనే అవకాశం చాలా తక్కువని అన్నాడు.

దీనిపై క్లారిటీ ఇస్తూ.. ఇప్పుడు మను మూడు నెలల విరామం అడిగినట్లు తెలిపాడు. అందుకే షూటింగ్ వరల్డ్ కప్‌లో పాల్గొనడం లేదని అన్నాడు. అక్టోబర్‌లో జరిగే ప్రపంచకప్‌లో మను ఆడుతుందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఆమె మూడు నెలల విరామం తీసుకుంది.

నిలకడగా పోటీపడిన తర్వాత సుదీర్ఘ విరామం తీసుకోవడం అన్ని క్రీడల్లో సాధారణం. అలాగే మను భాకర్ కోచ్ జస్పిల్ రానా మాట్లాడుతూ ప్రస్తుతం మను భాకర్ దృష్టి 2026 ఆసియా గేమ్స్, కామన్వెల్త్ క్రీడలపైనే ఉందని అన్నారు.

షూటింగ్ ప్రపంచకప్ గురించి మాట్లాడితే, అక్టోబర్ 13 నుంచి 18 వరకు న్యూఢిల్లీలో షూటింగ్ ప్రపంచకప్ జరగనుంది. ప్రపంచ వ్యాప్తంగా అనుభవజ్ఞులైన షూటర్లు ఈ ప్రపంచకప్‌లో ఆడటం చూడవచ్చు.

ఈ ఏడాది ఒలింపిక్స్‌లో మను భాకర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని సాధించి ఒలింపిక్స్‌లో భారత్ పతక ఖాతా తెరిచింది. ఆ తర్వాత, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగం మిక్స్‌డ్ ఈవెంట్‌లో మను భాకర్ సరబ్జోత్ సింగ్‌తో కలిసి కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

దీంతో పాటు ఈ ఒలింపిక్స్‌లో మను మూడో పతకం సాధించే అవకాశం ఉంది. అలాగే, మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను ఫైనల్ చేరింది. కానీ, తృటిలో పతకాన్ని చేజార్చుకోవడంతో నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే, ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన స్వతంత్ర భారత్ నుంచి తొలి అథ్లెట్‌గా మను నిలిచింది.




