- Telugu News Photo Gallery Cricket photos Virat Kohli could easily get 30 Crores in IPL auction 2025 says auctioneer Hugh Edmeades
IPL 2025: ‘ఐపీఎల్ వేలంలోకి ఆయనొస్తే రూ.30 కోట్లకుపైగానే పట్టుకెళ్తాడు.. రికార్డులన్నీ బద్దలవ్వాల్సిందే’
Virat Kohli: విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున మాత్రమే ఆడుతున్నాడు. 2008లో రూ.12 లక్షల జీతంతో మొదలైన ప్రయాణం ఇప్పుడు రూ.15 కోట్లకు చేరింది. ఈసారి మెగా వేలానికి ముందు RCB రూ.15 కోట్ల రూపాయలకు పైగా చెల్లించి విరాట్ కోహ్లీని రిటైన్ చేసుకుంది. అయితే, ఐపీఎల్ 2025 వేలంలో కోహ్లీ కనిపిస్తే మాత్రం రికార్డులు బ్రేక్ అవ్వా్లసిందే అంటున్నా ఓ నిపుణుడు.
Updated on: Aug 13, 2024 | 4:28 PM

ఐపీఎల్ (IPL 2025) మెగా వేలం సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ వేలానికి సంబంధించిన బ్లూప్రింట్‌లను సిద్ధం చేసే పనిలో ఐపీఎల్ పాలకమండలి నిమగ్నమైంది. ఇదిలా ఉంటే, ఈ వేలానికి ముందు ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు ఫ్రాంచైజీలను అనుమతించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

కాబట్టి ఈ మెగా వేలానికి ముందు అన్ని ఫ్రాంచైజీలు తమ స్టార్ ప్లేయర్‌లను అట్టిపెట్టుకోవడం ఖాయం. మరికొందరు ముఖ్యమైన ఆటగాళ్లు వేలంలో కనిపిస్తే.. కోట్లకు అమ్ముడుపోతారనడంలో సందేహం లేదు.

ముఖ్యంగా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీ మెగా వేలంలో కనిపిస్తే రూ.30 కోట్లకు పైగా దక్కించుకోవడం ఖాయమని ప్రముఖ వేలం నిర్వాహకుడు హ్యూ ఎడ్‌మీడ్స్ చెప్పుకొచ్చాడు. ఎడ్మీడ్స్ 2018 నుంచి 2022 వరకు ఐపీఎల్‌లో వేలంపాటదారుగా వ్యవహరించారు. అతను ప్రపంచవ్యాప్తంగా 2,500 కంటే ఎక్కువ వేలం కూడా నిర్వహించాడు.

అనేక వేలంలో పాల్గొన్న హ్యూ ఎడ్మీడ్స్ ప్రకారం, IPL స్టార్ విరాట్ కోహ్లీ వేలంలో భాగమైతే రూ.30 కోట్లకు పైగా దక్కించుకుంటాడని తెలిపాడు. దీని ద్వారా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఆటగాడిగా కింగ్ కోహ్లీ అవతరిస్తాడని ఎడ్ మీడ్స్ అభిప్రాయపడ్డాడు.

కానీ, 2008లో రూ.12 లక్షలకు ఆర్సీబీ జట్టులోకి అడుగుపెట్టిన విరాట్ కోహ్లి ఆ తర్వాత ఎప్పుడూ వేలంలో కనిపించకపోవడం విశేషం. అలాగే, ఐపీఎల్ చరిత్రలో ఒకే జట్టు తరపున అత్యధిక సంవత్సరాలు ఆడిన ఆటగాడిగా కింగ్ కోహ్లీ రికార్డు సృష్టించాడు.

ఐపీఎల్‌లో ఈ మెగా వేలానికి ముందు ఆర్సీబీ విరాట్ కోహ్లీని రిటైన్ చేస్తుందనడంలో సందేహం లేదు. కాబట్టి ఈసారి కూడా వేలంలో కింగ్ కోహ్లీని ఆశించలేం.



















