AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఈ ఆలయానికి వెళ్లి మాల ధరిస్తే మద్యం అలవాటు మానేయాల్సిందే..!

మందు వ్యసనం నుంచి బయటపడాలంటే డి-అడిక్షన్ సెంటర్లకే వెళ్లాలనేది సాధారణ అభిప్రాయం. కానీ ఒక దేవాలయం ఆధ్యాత్మిక డి-అడిక్షన్ సెంటర్‌గా మారిందంటే నమ్మగలమా? అవును.. ఏపీలోని శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవాలయం ఇప్పుడు రాయలసీమ వ్యాప్తంగా మందు వ్యసన విముక్తికి ఓ చిరునామాగా నిలుస్తోంది.

Andhra: ఈ ఆలయానికి వెళ్లి మాల ధరిస్తే మద్యం అలవాటు మానేయాల్సిందే..!
Panduranga Swamy Temple
Nalluri Naresh
| Edited By: |

Updated on: Mar 02, 2026 | 3:44 PM

Share

ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం ఉంతకల్లు గ్రామంలో 2005లో ప్రతిష్టించబడిన ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే.. ఇక్కడ పాండురంగ మాల ధరిస్తే మద్యం అలవాటు మానిపోతుందనే గట్టి విశ్వాసం. ప్రతి ఏకాదశి రోజున దాదాపు రెండు వేల మంది వరకు మద్యానికి బానిసైన వారు స్వామివారి మాల ధరించి దీక్ష తీసుకుంటున్నారు. ఒకసారి మాల వేసుకున్న తర్వాత మద్యం ముట్టుకుంటే స్వామి ఆగ్రహానికి గురవుతామనే భయం వారిలో బలంగా ఉంది. అదే భయం.. వారిని మళ్లీ మందు వైపు వెళ్లకుండా అడ్డుకుంటోంది.

మాలధారణ 41 రోజుల దీక్ష. ఈ కాలంలో తెల్లవారుజామునే స్నానం, నిత్యం భజనలు, ప్రార్థనలు చేయడం, సాత్విక ఆహారం తీసుకోవడం, నేలపైనే పడుకోవడం వంటి కఠిన నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఇలా జీవనశైలిలో వచ్చే మార్పే జీవితానికి కొత్త మలుపు. ఏకంగా 41 రోజుల పాటు ఇవన్నీ పాటించడం వల్ల మద్యం తాగాలి అన్న ఆలోచనే క్రమంగా తగ్గిపోతుందని మాలధారులు చెబుతున్నారు.

మద్యం వల్ల కూలిపోయిన కుటుంబాలు.. అమ్ముడైన ఆస్తులు.. చిచ్చుపెట్టుకున్న సంసారాలు.. ఇవన్నీ ఇక్కడ వినిపించే కథలు. కానీ మాల వేసుకున్న తర్వాత అలవాటు మానేసి మంచి జీవితాన్ని ప్రారంభించిన వారే ఇప్పుడు ఈ దేవాలయానికి సజీవ సాక్ష్యాలు. కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు.. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు ప్రతి నెల ఏకాదశి రోజున వచ్చి మాల ధరించడం విశేషం. కొంతమంది డి-అడిక్షన్ సెంటర్ల చుట్టూ తిరిగి వేల రూపాయలు ఖర్చు చేసి విసిగిపోయినవారే. కానీ ఉంతకల్లులో మాత్రం భక్తితో, ఉచితంగా మాలధారణ చేసి అలవాటు మానేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.

41 రోజుల దీక్ష పూర్తయ్యాక కూడా చాలామంది మళ్లీ మద్యం జోలికి వెళ్లకపోవడం భక్తుల నమ్మకాన్ని మరింత బలపరుస్తోంది. అందుకే ఈ చిన్న గ్రామంలోని పాండురంగ స్వామి ఆలయం ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక డి-అడిక్షన్ సెంటర్‌గా ప్రత్యేక గుర్తింపు పొందింది. మరి ఇది విశ్వాసమా? దైవానుగ్రహమా..? లేక రెండింటి కలయికా? జవాబు కోసం ఉంతకల్లు వెళ్లాల్సిందే.

Also Read: ఏదో డ్యామేజ్ వచ్చి ఇలా వేశారు అనుకునేరు.. పాపం ఆ రైతు.. 

Follow Us
పుదీనా మొక్కను ఇంట్లో పెంచుకోవడం ఎలా..? గుబురుగా పెరగాలంటే..
పుదీనా మొక్కను ఇంట్లో పెంచుకోవడం ఎలా..? గుబురుగా పెరగాలంటే..
ఈ ఆలయానికి వెళ్లి దీక్ష తీసుకుంటే.. మద్యపానం జోలికే వెళ్లరు..!
ఈ ఆలయానికి వెళ్లి దీక్ష తీసుకుంటే.. మద్యపానం జోలికే వెళ్లరు..!
చంద్రగ్రహణం: దోషాలు తొలగించి.. శుభ ఫలితాలు ఇచ్చే రెమెడీ ఇదే..
చంద్రగ్రహణం: దోషాలు తొలగించి.. శుభ ఫలితాలు ఇచ్చే రెమెడీ ఇదే..
రోకో ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఆఫ్ఘాన్‌తో వన్డే సిరీస్‌‌కు రెడీ
రోకో ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఆఫ్ఘాన్‌తో వన్డే సిరీస్‌‌కు రెడీ
రూ.10 వేలతో ఈ బిజినెస్‌ స్టార్ట్‌ చేయొచ్చు! లాభాలే లాభాలు
రూ.10 వేలతో ఈ బిజినెస్‌ స్టార్ట్‌ చేయొచ్చు! లాభాలే లాభాలు
చమురు సరఫరా ఆగిపోతే దేశంలో పెట్రోల్ నిల్వలు ఎన్ని రోజులు ఉంటాయి?
చమురు సరఫరా ఆగిపోతే దేశంలో పెట్రోల్ నిల్వలు ఎన్ని రోజులు ఉంటాయి?
బ్లాక్ బస్టర్ మూవీ మిస్ చేసుకున్న వైష్ణవి..
బ్లాక్ బస్టర్ మూవీ మిస్ చేసుకున్న వైష్ణవి..
బయట రాష్ట్రాల్లో ఉండే వాళ్ళు ఏపీ గురించి సలహాలు.. ఇవ్వొద్దు
బయట రాష్ట్రాల్లో ఉండే వాళ్ళు ఏపీ గురించి సలహాలు.. ఇవ్వొద్దు
చమురు రవాణాకు గేట్వే మూసివేత.. గ్లోబల్ మార్కెట్లలో కల్లోలం..!
చమురు రవాణాకు గేట్వే మూసివేత.. గ్లోబల్ మార్కెట్లలో కల్లోలం..!
ఇరాన్‌-అమెరికా యుద్ధం.. భారత్‌కు గుడ్‌న్యూస్‌!
ఇరాన్‌-అమెరికా యుద్ధం.. భారత్‌కు గుడ్‌న్యూస్‌!