Olympics 2036: భారత్‌లోనే 2036 ఒలింపిక్స్? లెటర్ ఆఫ్ ఇంటెంట్ పంపిన ఐఓఏ

Olympics 2036 In India: భారత ఒలింపిక్ సంఘం (IOA) 2036లో ఒలింపిక్స్, పారాలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని అక్టోబర్ 1న ఫ్యూచర్ హోస్ట్ కమిషన్, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (IOC)కి అధికారికంగా లెటర్ ఆఫ్ ఇంటెంట్ పంపింది. దీంతో పీఎం మోడీ సంకల్పానికి కీలక అడుగుపడినట్లైంది.

Olympics 2036: భారత్‌లోనే 2036 ఒలింపిక్స్? లెటర్ ఆఫ్ ఇంటెంట్ పంపిన ఐఓఏ
Olympics 2036
Follow us
Venkata Chari

|

Updated on: Nov 05, 2024 | 6:25 PM

Olympics 2036 In India: భారత్‌ను స్పోర్ట్స్ పవర్‌హౌస్‌గా మార్చాలనే ప్రధాని మోదీ సంకల్పానికి అనుగుణంగా ఓ కీలకమైన అడుగు పడింది. ఇందులో భాగంగా భారత ఒలింపిక్ సంఘం (IOA) ఒలింపిక్స్‌ను భారతదేశంలో నిర్వించేందుకు సిద్ధమైది. ఈమేరకు ఐఓఏ అధికారికంగా ఫ్యూచర్ హోస్ట్ కమిషన్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC)కి అధికారికంగా ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను పంపింది. ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం ఆసక్తిని వ్యక్తం చేస్తున్నట్లు అందులో పేర్కొంది. 2036లో పారాలింపిక్స్ క్రీడలు జరగనున్న సంగత తెలిసిందే. 2036లో భారతదేశంలో ఒలింపిక్, పారాలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంకల్పానికి ఓ కీలక అడుగుపడినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే దేశవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి, సామాజిక పురోగతితోపాటు యువత సాధికారతను పెంపొందించే వీలుంటుంది.

2036 ఒలింపిక్స్, పారాలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం ఆసక్తిగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అనేక సందర్భాల్లో వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. న్యూఢిల్లీలోని తన నివాసంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పారిస్ ఒలింపిక్స్ అథ్లెట్లతో జరిపిన సంభాషణలో ఈ వ్యాఖ్యలు చేశారు. 2036లో ఒలింపిక్స్ నిర్వహించేందుకు సన్నాహాలను అందించాలని ఐఓవోతోపాటు ఆటగాళ్లను ప్రధాని మోదీ కోరిన సంగతి తెలిసిందే.

“భారతదేశం 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఈ విషయంలో, గత ఒలింపిక్స్‌లో ఆడిన అథ్లెట్ల నుంచి వచ్చే సూచనలు ఎంతో కీలకమైనవి. మీరందరూ చాలా విషయాలను గమనించి, అనుభవించి ఉంటారు. మేం వాటిని డాక్యుమెంట్ చేసి ప్రభుత్వంతో పంచుకోవాలనుకుంటున్నాం. 2036కి సన్నాహక ఏర్పాట్లలో ఏ చిన్న విషయాన్ని కూడా మనం మిస్ కాకుడదు అంటూ ప్రధాని మోదీ అన్నారు.

గత సంవత్సరం ముంబైలో జరిగిన 141వ IOC సెషన్‌లో, 140 కోట్ల మంది భారతీయులు క్రీడలను నిర్వహించడానికి కట్టుబడి ఉన్నారని, 2036లో ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం ఆసక్తిగా ఎదురుచూస్తోందంటూ పీఎం మోడీ ప్రకటించారు.

IOC ప్రెసిడెంట్ థామస్ బాచ్ కూడా ప్రధాని మాటలను సమర్థించారు. భారతదేశం ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నాడు.

2036 ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి ఆసక్తి చూపిన 10 దేశాల్లో భారత్ కూడా ఉంది. 2036 క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి ఆసక్తిని కనబరిచిన 10 దేశాల్లో మెక్సికో (మెక్సికో సిటీ, గ్వాడలజారా-మాంటెర్రే-టిజువానా), ఇండోనేషియా (నుసంతారా), టర్కీ (ఇస్తాంబుల్), ఇండియా (అహ్మదాబాద్), పోలాండ్ (వార్సా, క్రాకో), ఈజిప్ట్ ( కొత్త అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్), దక్షిణ కొరియా (సియోల్-ఇంచియాన్) కూడా ఉన్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..