Arshad Nadeem: రూ. 10 కోట్ల చెక్.. స్పెషల్ నంబర్‌తో కార్.. ‘గోల్డ్’ దెబ్బకు మిలియనీర్‌గా మారిన పాక్ అథ్లెట్

Arshad Nadeem: స్వర్ణ పతక విజేత అర్షద్ నదీమ్ తన దేశం పాకిస్తాన్‌కు చేరుకోగానే కానుకల వర్షం కురుస్తోంది. దీంతో ఇన్నేళ్ల పేదరికానికి ఇక గుడ్‌ బై చెప్పేశాడు. ఎన్నో సంవత్సరాల కరువును అంతమొందించిన ఈ పాక్ ప్లేయర్.. తన దేశం తరపున ఈయన తప్ప మరెవరూ బంగారు పతకం సాధించలేదు. పారిస్ ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో ఈవెంట్‌లో అర్షద్ నదీమ్ సరికొత్త రికార్డు సృష్టించాడు.

Arshad Nadeem: రూ. 10 కోట్ల చెక్.. స్పెషల్ నంబర్‌తో కార్.. 'గోల్డ్' దెబ్బకు మిలియనీర్‌గా మారిన పాక్ అథ్లెట్
Arshad Nadeem
Follow us
Venkata Chari

|

Updated on: Aug 13, 2024 | 7:02 PM

Arshad Nadeem: స్వర్ణ పతక విజేత అర్షద్ నదీమ్ తన దేశం పాకిస్తాన్‌కు చేరుకోగానే కానుకల వర్షం కురుస్తోంది. దీంతో ఇన్నేళ్ల పేదరికానికి ఇక గుడ్‌ బై చెప్పేశాడు. ఎన్నో సంవత్సరాల కరువును అంతమొందించిన ఈ పాక్ ప్లేయర్.. తన దేశం తరపున ఈయన తప్ప మరెవరూ బంగారు పతకం సాధించలేదు. పారిస్ ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో ఈవెంట్‌లో అర్షద్ నదీమ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. అతను భారత ఆటగాడు నీరజ్ చోప్రాను వెనక్కునెట్టి స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు.

గోల్డ్ మెడలిస్ట్ అర్షద్ ప్రైజ్ మనీగా 50 వేల డాలర్లు (దాదాపు రూ. 42 లక్షలు) అందుకున్నాడు. ఇప్పుడు, అతను తన దేశానికి తిరిగి వచ్చిన తర్వాత, అర్షద్ నదీమ్‌పై బహుమతుల వర్షం కురుస్తోంది. దీంతో ప్రస్తుతం అర్షద్ నదీమ్ గ్రామంలో ఒకటే సందడి నెలకొంది.

ప్రత్యేక నంబర్‌తో కూడిన కారు, రూ.10 కోట్ల చెక్..

పంజాబ్ ప్రావిన్స్ (పాకిస్తాన్‌లో) సీఎం, PML-N నాయకురాలు మరియం నవాజ్ ఈ సందర్భంగా అర్షద్ నదీమ్ ఇంటికి వెళ్లి సన్మానించారు. నదీమ్‌కు PAK 9297 నంబర్ కారును కూడా బహుమతిగా ఇచ్చారు. పారిస్ ఒలింపిక్స్‌లో నదీమ్ 92.97 మీటర్ల దూరం జావెలిన్ విసిరినందుకు ఈ సంఖ్య ప్రత్యేకంగా నిలిచింది. ఇదే నంబర్‌తో కార్‌ను బహుమతిగా ఇచ్చారు. దీంతో పాటు మరియం నవాజ్ అర్షద్‌కు రూ.10 కోట్ల చెక్కును కూడా అందించారు.

రెండవ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కారం..

పాకిస్థాన్ ప్రభుత్వం అర్షద్ నదీమ్‌ను దేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరిస్తున్నట్లు ప్రకటించింది. గోల్డ్ మెడలిస్ట్ అర్షద్ నదీమ్ మామ ముహమ్మద్ నవాజ్ అర్షద్‌కు గేదెను బహుమతిగా ఇచ్చారు. ఇది కాకుండా, అర్షద్ నదీమ్‌కు పాకిస్థానీ వ్యాపారవేత్త కారు బహుమతిగా కూడా ప్రకటించాడు.

పారిస్ ఒలింపిక్స్‌లో కొత్త రికార్డ్..

అర్షద్ నదీమ్ పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందినవాడు. నదీమ్ 2015 నుంచి జావెలిన్ త్రో ఈవెంట్‌లలో పాల్గొనడం ప్రారంభించాడు. గతసారి టోక్యో ఒలింపిక్స్‌లో అతని ప్రదర్శన ప్రత్యేకంగా లేదు. అతను 84.62 మీటర్ల త్రోతో ఐదో స్థానంలో నిలిచాడు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత ఆటగాడు నీరజ్ చోప్రా స్వర్ణ పతకం సాధించాడు. కానీ, పారిస్‌ ఒలింపిక్స్‌లో పాకిస్థాన్‌ ఆటగాడు అర్షద్‌ నదీమ్‌ అద్భుత ప్రదర్శన చేసి జావెలిన్‌ త్రోలో సరికొత్త రికార్డు సృష్టించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 92.97 మీటర్ల దూరంతో ఒలింపిక్ రికార్డు సృష్టించి చరిత్ర పుటల్లో తన పేరును చిరస్థాయిగా నిలిపాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..