Telangana: తెలంగాణలో తొలిసారి మహిళా ఛాంపియన్‌కు పోలీస్ జాబ్.. డీఎస్‌పీ పదవిని చేపట్టనున్న నిఖత్ జరీన్
Nikhat Zareen: ప్రముఖ క్రీడాకారిణి బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డీఎస్‌పీ పదవిని కేటాయించింది. రెండుసార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్, ఒలింపిక్ క్రీడాకారిణి నిఖత్ జరీన్‌ని తెలంగాణ పోలీస్ విభాగంలో ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ ప్రకటించారు.
Nikhat Zareen: ప్రముఖ క్రీడాకారిణి బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డీఎస్‌పీ పదవిని కేటాయించింది. రెండుసార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్, ఒలింపిక్ క్రీడాకారిణి నిఖత్ జరీన్‌ని తెలంగాణ పోలీస్ విభాగంలో ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిఖత్ జరీన్ ఒక ప్రతిభావంతురాలు మాత్రమే కాదు, ఆమె ధైర్యం, పట్టుదల, క్రమశిక్షణకు నిలువుటద్దం. ఆమె సాధించిన విజయాలతో ఆమె నిష్ట, కష్టపడే ధోరణి, ప్రపంచ స్థాయిలో తన ప్రతిభను నిరూపించుకునేందుకు చేసిన శ్రమకు తగిన ఫలితాలుగా కనిపిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చిన నిఖత్, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా మార్మోగించింది. ఇప్పుడు, తెలంగాణ పోలీస్ (Special Police) విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DySP) గా చేరి, ఆమె తెలంగాణ ప్రజలకు, దేశానికి సేవచేయడానికి ముందుకు వచ్చారని తెలిపారు.
కాగా, నిఖత్ తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన తరువాత బాక్సింగ్‌లో ప్రవేశించింది. ఈ క్రీడా రంగంలో ఆమె సాధించిన విజయాలు చాలామందికి స్ఫూర్తినిచ్చాయి. కేవలం బాక్సింగ్ కాదు, ఆమె తన వ్యక్తిత్వంతో తెలంగాణ యువతకు ఒక మార్గదర్శకంగా నిలిచింది. ఆమె క్రీడా ప్రస్థానం చిన్న వయసులోనే ప్రారంభమైంది. ఆమె రెండు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లు, ఎన్నో జాతీయ, అంతర్జాతీయ బాక్సింగ్ పోటీల్లో ఆమె గెలిచింది. ఆమె ఒలింపిక్స్‌లోనూ పోటీ పడ్డారు. అది తెలంగాణ నుంచి ఒక అద్భుతమైన ఘనత. ఈ విజయాలు తెలంగాణ రాష్ట్రాన్ని గర్వపడేలా చేశాయి.
” ఆమె తెలంగాణ పోలీస్ (Special Police) విభాగంలో చేరడం Telangana రాష్ట్రానికి ఒక గొప్ప గౌరమని, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DySP) హోదాలో ఆమె అందించబోయే సేవలు, నిఖిల్ జరీన్‌కి ఉన్న క్రమశిక్షణ, పట్టుదల, బాధ్యతాయుతమైన వైఖరి కారణంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నిత్యం ఉపయోగపడతాయి” అని ఆయన ప్రకటించారు.
నిఖత్ జరీన్ తన వ్యక్తిత్వంతోనే తెలంగాణ రాష్ట్రానికి ఒక స్ఫూర్తి. ఆమె సాధించిన విజయాలు తెలంగాణ యువతకు ఒక శక్తినిచ్చాయి. ఆమె బాక్సింగ్ రంగంలో సాధించిన స్ఫూర్తిదాయక విజయాలు, తెలంగాణ ప్రజలను ఎంతో ఆనందపరిచాయి. తెలంగాణ రాష్ట్ర యువతకు ఆమె ఒక మార్గదర్శకంగా నిలుస్తోంది. నిఖత్ జరీన్ తెలంగాణ పోలీస్ విభాగంలో చేరడం రాష్ట్రానికి ఒక గొప్ప గౌరవం అని అంతా భావిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..