AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PAK vs SL: 12 ఏళ్ల విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన పాక్ ప్లేయర్.. అదేంటంటే?

Most Runs in Single T20 World Cup Edition: డూ-ఆర్-డై మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు కొన్ని మార్పులు చేసి, ఫర్హాన్‌ను ఫఖార్ జమాన్ (Fakhar Zaman)తో కలిసి ఓపెనింగ్‌కు పంపింది. ఈ నిర్ణయం ఫలితమిచ్చి, ఇద్దరూ కలిసి 80 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

PAK vs SL: 12 ఏళ్ల విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన పాక్ ప్లేయర్.. అదేంటంటే?
Sahibzada Farhan, Virat Kohli Record
Venkata Chari
|

Updated on: Feb 28, 2026 | 8:04 PM

Share

PAK vs SL: సాహిబ్‌జాదా ఫర్హాన్ (Sahibzada Farhan) టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అరుదైన ఘనత సాధించాడు. ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. దీంతో టీమిండియా దిగ్గజం ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) పేరిట 12 ఏళ్లుగా నిలిచిన రికార్డును చెరిపేశాడు. 2014 టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ 319 పరుగులు చేసి ఈ గౌరవాన్ని దక్కించుకున్నాడు. అయితే 2026 ఎడిషన్‌లో ఫర్హాన్ ఆ రికార్డును అధిగమించి చరిత్ర సృష్టించాడు.

శ్రీలంక మ్యాచ్‌కు ముందు ఫర్హాన్‌కు కోహ్లీ రికార్డును దాటేందుకు 37 పరుగులు అవసరమయ్యాయి. ఒత్తిడి పరిస్థితుల్లో క్రీజ్‌లోకి వచ్చిన ఈ కుడిచేతి బ్యాటర్ 25 బంతుల్లో వేగంగా 40 పరుగులు సాధించి తన జట్టుకు బలమైన ఆరంభం ఇచ్చాడు. జట్టు ఆ సమయంలో దూకుడుగా ఆడాల్సిన అవసరం ఉండగా, ఫర్హాన్ బాధ్యతగా ఆడుతూ లక్ష్యాన్ని చేరుకున్నాడు.

ఒకే టీ20 వరల్డ్ కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు..

2026 టోర్నీలో ఫర్హాన్ అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాడు. 6 ఇన్నింగ్స్‌లలో 320కి పైగా పరుగులు చేసి, 78.25 సగటుతో మెరిశాడు. ఈ టోర్నీలో అతని ఖాతాలో ఒక శతకం, రెండు అర్ధశతకాలు ఉన్నాయి.

ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితా ఇలా ఉంది:

323* – సాహిబ్‌జాదా ఫర్హాన్ (Sahibzada Farhan), పాకిస్థాన్ (2026)

319 – విరాట్ కోహ్లీ (Virat Kohli), భారత్ (2014)

317 – తిలక్ రత్నే దిల్షాన్ (Tillakaratne Dilshan), శ్రీలంక (2009)

303 – బాబర్ ఆజాం (Babar Azam), పాకిస్థాన్ (2021)

302 – మహేళ జయవర్ధనే (Mahela Jayawardene), శ్రీలంక (2010)

బాబర్ ఆజామ్ రికార్డును దాటిన ఫర్హాన్..

ఫర్హాన్ కేవలం కోహ్లీ రికార్డునే కాదు, పాకిస్థాన్ బ్యాటర్‌గా ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన బాబార్ ఆజం (Babar Azam) రికార్డును కూడా చెరిపేశాడు. బాబర్ 2021 ఎడిషన్‌లో 303 పరుగులు సాధించాడు. శ్రీలంకపై 20 పరుగుల మైలురాయిని దాటిన వెంటనే ఫర్హాన్ ఈ ప్రత్యేక ఘనతను అందుకున్నాడు.

కోహ్లీ రికార్డును దాటిన తర్వాత కూడా ఫర్హాన్ ఎలాంటి సంబరాలు చేయలేదు. జట్టును సెమీఫైనల్‌కు తీసుకెళ్లడం తన ప్రధాన లక్ష్యమని భావించి, ప్రశాంతంగా తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. ప్రస్తుతం మొత్తం దేశం ఆశలు ఈ యువ ఓపెనర్‌పైనే నిలిచాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us