AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: జైలులో ఉన్నా ప్రియురాలిపై తగ్గని ప్రేమ.. హీరోయిన్ బర్త్ డేకు కోట్ల విలువైన గిఫ్ట్ ఇచ్చాడు..

అంతేకాదు ఆ పడవకు తన ప్రేయసి హీరోయిన్ జాక్వెలిన్ పేరు పెట్టాడు. ఈ విషయాన్ని ఆదివారం తన ప్రియురాలికి బర్త్ డే విషెస్ చెబుతూ రాసిన లేఖలో సుకేష్ ఈ విషయాన్ని వెల్లడించారు. 2021లో జాక్వెలిన్ ఈ పడవను సెలక్ట్ చేసిందని.. అందుకే ఇప్పుడు తన ప్రేయసికి ఈ బోట్ గిఫ్ట్ గా అందించారు.

Tollywood: జైలులో ఉన్నా ప్రియురాలిపై తగ్గని ప్రేమ.. హీరోయిన్ బర్త్ డేకు కోట్ల విలువైన గిఫ్ట్ ఇచ్చాడు..
Actress
Rajitha Chanti
|

Updated on: Aug 16, 2024 | 2:26 PM

Share

ఢిల్లీ జైలులో ఉన్న నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ తన ప్రియురాలు బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఊహించని సర్ ప్రైజ్ అందించాడు. తన ప్రియురాలి బర్త్ డే సందర్భంగా ఆమెకు కోట్లు విలువైన పడవను బహుమతిగా ఇచ్చాడు. అంతేకాదు ఆ పడవకు తన ప్రేయసి హీరోయిన్ జాక్వెలిన్ పేరు పెట్టాడు. ఈ విషయాన్ని ఆదివారం తన ప్రియురాలికి బర్త్ డే విషెస్ చెబుతూ రాసిన లేఖలో సుకేష్ ఈ విషయాన్ని వెల్లడించారు. 2021లో జాక్వెలిన్ ఈ పడవను సెలక్ట్ చేసిందని.. అందుకే ఇప్పుడు తన ప్రేయసికి ఈ బోట్ గిఫ్ట్ గా అందించారు. ‘లేడీ జాక్వెలిన్’ పేరు పెట్టిన ఆ యాచ్‌ను ఈ నెలలో డెలివరీ చేయనున్నట్టు తన లేఖలో పేర్కొన్నాడు. యాచ్‌కి సంబంధించిన అన్ని పన్నులు చెల్లించారని.. ఇది పూర్తిగా చట్టబద్ధమైనదని రాశాడు.

అంతేకాకుండా జాక్వెలిన్ పుట్టినరోజును పురస్కరించుకుని వాయనాడ్ కొండచరియల విపత్తులో నిరాశ్రయులైన బాధిత కుటుంబాలకు రూ. 15 కోట్లు, 300 ఇళ్లను విరాళంగా అందజేస్తానని వాగ్దానం చేశాడు. జాక్వెలిన్ నటించిన ‘యిమ్మీ యిమ్మీ’ పాటను సూపర్ హిట్ చేసినందుకు అతను 100 ఐఫోన్ 15 ప్రోను కూడా ప్రకటించాడు. భారత శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్లు 420 (మోసం), 120-B (నేరపూరిత కుట్ర), ప్రైజ్ చిట్‌లు, మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ (నిషేధించడం) చట్టంలోని కొన్ని సెక్షన్ల కింద సుకేష్‌ను మే 29, 2015న అరెస్టు చేశారు. మహారాష్ట్ర డిపాజిటర్ల (ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌లో) మనీలాండరింగ్ కేసులో అతడికి బాంబే హైకోర్టు గత నెలలో బెయిల్ మంజూరు చేసింది. కానీ అతనిపై నమోదైన అనేక కేసుల కారణంగా జైలులో కొనసాగుతున్నాడు.

సుకేష్ చంద్రశేఖర్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రశ్నించేందుకు సమన్లు ​​జారీ చేసింది. 2022లో దాఖలు చేసిన ED ఛార్జ్ షీట్ ప్రకారం.. అతను జాక్వెలిన్‌కు బహుమతులు కొనడానికి అక్రమ డబ్బును ఉపయోగించాడు. అదనంగా, సుకేష్ చంద్రశేఖర్‌కు సంబంధించిన రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసుకు సంబంధించి నటి నోరా ఫతేహిని కూడా ప్రశ్నించారు. ఇదిలా ఉంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో జాక్వెలిన్ ఒకరు. శ్రీలంకకు చెందిన ఈ బ్యూటీ బీటౌన్ లో స్టార్ డమ్ సంపాదించుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.