Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌పై ప్రశంసలు కురిపించిన ఫ్రెంచ్ హీరో.. ఎందుకంటే?

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు రామ్ చరణ్. అయితే తన నటనతో అనతికాలంలోనే మెగా పవర్ స్టార్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మగధీర, నాయక్, ఎవడు, ధ్రువ, రంగస్థలం తదితర ఇండస్ట్రీ హిట్ సినిమాలు రామ్ చరణ్ ఖాతాలో ఉన్నాయి. ఇక దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు చెర్రీ.

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌పై ప్రశంసలు కురిపించిన ఫ్రెంచ్ హీరో.. ఎందుకంటే?
Lucas Bravo, Ram Charan
Follow us
Basha Shek

|

Updated on: Aug 16, 2024 | 1:02 PM

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు రామ్ చరణ్. అయితే తన నటనతో అనతికాలంలోనే మెగా పవర్ స్టార్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మగధీర, నాయక్, ఎవడు, ధ్రువ, రంగస్థలం తదితర ఇండస్ట్రీ హిట్ సినిమాలు రామ్ చరణ్ ఖాతాలో ఉన్నాయి. ఇక దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు చెర్రీ. ఇందులో అతను పోషించిన సీతారామరాజు పాత్ర పలువురి ప్రశంసలు అందుకుంది. హాలీవుడ్ స్టార్స్ సైతం రామ్ చరణ్ అద్భుత నటనకు ఫిదా అయ్యారు. తాజాగా ఫ్రెంచ్‌ హీరో లూకాస్ బ్రావో రామ్‌ చరణ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో చెర్రీ నటన సూపర్బ్ గా ఉందని మెచ్చుకున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో రామ్‌ చరణ్‌ నటన అద్భుతంగా ఉంటి. ఎంట్రీ సీన్‌, ఎమోషనల్‌ సన్నివేశాల్లో సూపర్ గా నటించాడు. ఇక యాక్షన్‌ సీక్వెన్స్‌లలోనూ రామ్ నటనతో అందర్నీ ఆకట్టుకున్నారు’ అని బ్రావో చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ముఖ్యంగా మెగాభిమానులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నాడు. దీంతో మరోసారి ట్విట్టర్ లో ఆర్ ఆర్ ఆర్ పేరు ట్రెండింగ్ లోకి వచ్చింది.

కాగా రాజమౌళి తెరకెక్కించిన పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా RRR సినిమా 2022లో విడుదలైంది. రామ్ చరణ్ తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్, అలియా భట్, శ్రియ, అజయ్ దేవగణ్, సముద్ర ఖని తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 1300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కేవలం భారత్ లోనే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాల్లో ఆర్ఆర్ఆర్ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఇక ఇదే సినిమాకు ప్రతిష్ఠాత్మక ఆస్కార్ పురస్కారం కూడా వచ్చింది. ఈ సినిమాతోనే రామ్ చరణ్, ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్స్ గా మారిపోయారు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతోన్న వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.