AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: ‘బంగారం రా.. మా బాలయ్య! చిన్నారి వైద్యానికి బాలకృష్ణ సాయం.. రుణపడి ఉంటామన్న తల్లిదండ్రులు

పైకి కొంచెం కఠినంగా కనిపించినా నందమూరి బాలకృష్ణ మనసు వెన్నలాంటిది. ఆయనకు దగ్గరగా ఉన్న వాళ్లలో ఎవరని అడిగినా ఇదే విషయం చెబుతారు. చాలా సందర్భాల్లో ఆయన అభిమానులపై చేయి చేసుకుని విమర్శల పాలై ఉండచ్చు. కానీ కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంలో మాత్రం బాలయ్య ఎప్పుడూ ముందుంటారు. అలా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు నందమూరి నట సింహం.

Balakrishna: 'బంగారం రా.. మా బాలయ్య! చిన్నారి వైద్యానికి బాలకృష్ణ సాయం.. రుణపడి ఉంటామన్న తల్లిదండ్రులు
Nandamuri Balakrishna
Basha Shek
|

Updated on: Aug 16, 2024 | 12:18 PM

Share

పైకి కొంచెం కఠినంగా కనిపించినా నందమూరి బాలకృష్ణ మనసు వెన్నలాంటిది. ఆయనకు దగ్గరగా ఉన్న వాళ్లలో ఎవరని అడిగినా ఇదే విషయం చెబుతారు. చాలా సందర్భాల్లో ఆయన అభిమానులపై చేయి చేసుకుని విమర్శల పాలై ఉండచ్చు. కానీ కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంలో మాత్రం బాలయ్య ఎప్పుడూ ముందుంటారు. అలా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు నందమూరి నట సింహం. వివరాలిలా ఉన్నాయి. తూర్పుగోదావరి జి్లా కడియపులంకలో పూలకుండీల షాపులో రాజ్‌కుమార్‌ పాండే మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన కుమార్తె ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆస్పత్రిలో చికిత్స అందించారు. కానీ పాప ఆరోగ్యం కుదుట పడలేదు. దీంతో పాప పరిస్థితిని తండ్రి రాజ్‌కుమార్ జనసేన పార్టీ నేత రత్నం అయ్యప్ప దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఈ విషయాన్ని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్‌కు వివరించారు. ఆయన కూడా వెంటనే స్పందించి ఫోన్ ద్వారా బాలయ్యకు పాప పరిస్థితిని వివరించారు. చిన్నారి వైద్యానికి సాయం చేయాలని కోరారు. అలాగే పాపకు అందించాల్సిన వైద్య వివరాలను కూడా బాలయ్యకు తెలియజేశారు. దీంతో వెంటనే స్పందించిన బాలకృష్ణ సదరు చిన్నారిని హైదరాబాదులోని బ‌స‌వ‌తార‌కం కేన్స‌ర్‌ ఆసుప‌త్రికి తీసుకురావాల్సిందిగా సూచించారు.

ఆ తర్వాత పాప‌కు కావాల్సిన పూర్తి వైద్య స‌దుపాయాల్ని అందించాల‌ని బసవ తారకం ఆస్పత్రి వైద్యుల‌ను ఆదేశించారు బాలయ్య. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. బాలకృష్ణ స్వ‌యంగా వ‌చ్చి కూతురు వైద్య‌చికిత్స‌కు ఆదేశించ‌డం ఎప్ప‌టికీ మ‌రిచిపోలేన‌ని తండ్రి రాజ్‌కుమార్ పాండే చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు తెగ మురిసిపోతున్నారు. ‘మా బాలయ్య బాబు గోల్డ్ ఎహే’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు బాలయ్య. NBK 109 (వర్కింగ్ టైటిల్) పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సాయి సౌజన్య, నాగ వంశీ సంయుక్తంగా ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను నిర్మిస్తున్నారు. బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

చిన్నారుల మధ్య ఇండిపెండెన్సెడే వేడుకలు చేసుకున్న బాలయ్య.. వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి మొదలంటే?
పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి మొదలంటే?
రాజధాని అమరావతికి కేంద్ర వరాల జల్లు..!
రాజధాని అమరావతికి కేంద్ర వరాల జల్లు..!
ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్.. రెండు స్థానాలు ఎగబాకిన గిల్
ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్.. రెండు స్థానాలు ఎగబాకిన గిల్
IAS అవ్వాలంటే ఏం చేయాలి? ఈ మార్గంలో నడిస్తే మీ లక్ష్యం చేరవచ్చు
IAS అవ్వాలంటే ఏం చేయాలి? ఈ మార్గంలో నడిస్తే మీ లక్ష్యం చేరవచ్చు
భారత్‌లో పెట్రోల్‌పైనే ఎక్కువ ఖర్చు.. ఖంగుతినే లెక్కలివే..
భారత్‌లో పెట్రోల్‌పైనే ఎక్కువ ఖర్చు.. ఖంగుతినే లెక్కలివే..
దేశంలో ఇప్పటికీ రైల్వే సర్వీస్‌లు లేని రాష్ట్రం ఏదో మీకు తెలసా?
దేశంలో ఇప్పటికీ రైల్వే సర్వీస్‌లు లేని రాష్ట్రం ఏదో మీకు తెలసా?
పండ్లలో రాజు మామిడి.. మరి రాణి ఎవరో తెలుసా..?
పండ్లలో రాజు మామిడి.. మరి రాణి ఎవరో తెలుసా..?
హెచ్-1బీ ఫీజు పెంపు రద్దు..! కోర్టు సంచలన తీర్పు!
హెచ్-1బీ ఫీజు పెంపు రద్దు..! కోర్టు సంచలన తీర్పు!
రైల్వే ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? మీ హాల్‌టికెట్ వచ్చిందా?
రైల్వే ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? మీ హాల్‌టికెట్ వచ్చిందా?
కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..
కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..