- Telugu News Photo Gallery Cinema photos Genelia offers prayers at Tulja Bhavani temple with husband Riteish Deshmukh, Photos goes viral
Genelia: తుల్జాభవానీ అమ్మవారిని దర్శించుకున్న జెనీలియా దంపతులు.. ఫొటోస్ వైరల్
బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైపోయింది జెనీలియా డిసౌజా. ఇందులో ఆమె అల్లరి, అమాయకత్వం కలబోసిన తింగరి పిల్లగా కనిపించి తెలుగు ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. జెన్నీ పోషించిన హాసినీ పాత్ర పలువురి ప్రశంసలు అందుకుంది. ఇప్పటికీ చాలా మంది జెన్నీని హాసిని గానే గుర్తు పెట్టుకున్నారు.
Updated on: Aug 15, 2024 | 10:07 PM

బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైపోయింది జెనీలియా డిసౌజా. ఇందులో ఆమె అల్లరి, అమాయకత్వం కలబోసిన తింగరి పిల్లగా కనిపించి తెలుగు ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. జెన్నీ పోషించిన హాసినీ పాత్ర పలువురి ప్రశంసలు అందుకుంది. ఇప్పటికీ చాలా మంది జెన్నీని హాసిని గానే గుర్తు పెట్టుకున్నారు.

ముంబైలో జన్మించిన జెనీలియా.. తుఝే మేరీ కసమ్ (నువ్వే కావాలి రీమేక్) సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. రితేశ దేశముఖ్ ఇందులో హీరోగా నటించాడు.

ఆ తర్వాత డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన బాయ్స్ సినిమాలో నటించింది. ఎన్టీఆర్ సరసన సాంబ, నా అల్లుడు చిత్రాల్లో నటించింది

అలాగే వెంకటేశ్ కు జోడిగా సుభాష్ చంద్రబోస్ మూవీలో నటించగా.. సై, హ్యాపీ, రామ్ తదితర సినిమాల్లోనూ తళుక్కుమంది.

ఇక 2012లో బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్ ముఖ్ ను ప్రేమ వివాహం చేసుకుంది జెనీలియా. ఇప్పుడీ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు.

తాజాగా ఈ దంపతులు తుల్జాపూర్ లోని తుల్జా భవానీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వీరిని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ప్రస్తుతం వీరి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.