Chirutha: రామ్ చరణ్ చిరుత హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడేంటిలా మారిపోయింది.. లేటెస్ట్ ఫొటోస్ చూస్తే మైండ్ బ్లాక్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మొదటి చిత్రం చిరుత. 2007లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా చిరంజీవి వారసత్వంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన చరణ్ కు చిరుత సినిమా మంచి పునాదిగా నిలిచింది. ఇందులో చరణ్ డ్యాన్స్, ఫైట్స్ మెగాభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Chirutha: రామ్ చరణ్ చిరుత హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడేంటిలా మారిపోయింది.. లేటెస్ట్ ఫొటోస్ చూస్తే మైండ్ బ్లాక్
Chirutha Movie
Follow us
Basha Shek

|

Updated on: Aug 16, 2024 | 8:50 AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మొదటి చిత్రం చిరుత. 2007లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా చిరంజీవి వారసత్వంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన చరణ్ కు చిరుత సినిమా మంచి పునాదిగా నిలిచింది. ఇందులో చరణ్ డ్యాన్స్, ఫైట్స్ మెగాభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నేహా శర్మ హీరోయిన్ గా నటించింది. పొగరు బోతు అమ్మాయి పాత్రలో మంచి అభినయం ప్రదర్శించింది. రామ్ చరణ్ తో పాటు నేహా శర్మకు కూడా ఇదే మొదటి సినిమా కావడం గమనార్హం. ఈ సినిమా తర్వాత వరుణ్ సందేశ్ హీరోగా నటించిన కుర్రాడు సినిమాలో కనిపించింది. ఈ సినిమా కూడా హిట్ గా నిలిచింది. అయితే దీని తర్వాత పెద్దగా తెలుగు సినిమాల్లో కనిపించలేదు నేహా శర్మ. తేరీ మేరీ కహానీ’ సినిమాతో హిందీలో అడుగు పెట్టింది. ఆ తర్వాత పలు హిందీ చిత్రాల్లోనూ బోల్డ్ పాత్రల్లో అదరగొట్టింది. క్యా సూపర్ కూల్ హై హై హమ్, యమ్లా పాగలా దీవానా 2, యంగిస్తాన్, తుమ్ బిన్, ముబారకన్, సోలో, తానాజి, వికల్ప్ తదితర హిందీ సినిమాల్లో నటించింది.

కాగా నాని, మృణాళ్ ఠాకూర్ నటించిన హాయ్ నాన్న సినిమాలో ఓ క్యామియో రోల్ పోషించింది నేహా శర్మ. అలాగే ఈ ఏడాది విడుదలైన బాలీవుడ్ హిట్ మూవీ విక్కీ కౌశల్ బ్యాడ్ న్యూస్‌ లోనూ ఓ స్పెషల్ రోల్ లో మెరిసింది. అలాగే 36 డేస్ అనే వెబ్ సిరీస్ లోనూ మెరిసింది. గతంలో కంటే బాగా సినిమాలు తగ్గించేసిన నేహా వర్మ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. ఆ మధ్యన ఐస్ బాత్ ఛాలెంజ్ అంటూ నేహా షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. అఅలాగే ఈ ఏడాది లోక్ సభ ఎన్నికల ప్రచారంలోనూ మెరిసిందీ అందాల తార. తన తండ్రి అజిత్‌ శర్మ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడంతో ఆయన తరఫున ఎన్నికల రోడ్‌షోలో పాల్గొని ప్రచారం చేసింది. తాజాగా తన సోదరి పుట్టిన రోజు సందర్భంగా నేహా శర్మ కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో అక్కా చెల్లెలిద్దరూ ఎంతో అందంగా కనిపించారు. అయితే నేహా మాత్రం చాలా బొద్దుగా తయారయ్యింది.

ఇవి కూడా చదవండి

నేహా శర్మ లేటెస్ట్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?