AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: నిహారిక కోసం రంగంలోకి మహేశ్ బాబు.. మెగా డాటర్‌కు మద్దతుగా ఏం చేస్తున్నారంటే?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీ బిజీగా ఉంటున్నాడు. ఈ పాన్ వరల్డ్ మూవీ కోసం తన మేకోవర్ ను పూర్తిగా మార్చుకున్నాడీ హ్యాండ్సమ్ హీరో. ఇటీవలే జైపూర్ లో తన కుటుంబ సభ్యులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకొన్న మహేశ్ ఆదివారం హైదరాబాద్ కు తిరిగి వచ్చాడు.

Mahesh Babu: నిహారిక కోసం రంగంలోకి మహేశ్ బాబు.. మెగా డాటర్‌కు మద్దతుగా ఏం చేస్తున్నారంటే?
Niharika Konidela, Mahesh Babu
Basha Shek
|

Updated on: Aug 12, 2024 | 8:35 PM

Share

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీ బిజీగా ఉంటున్నాడు. ఈ పాన్ వరల్డ్ మూవీ కోసం తన మేకోవర్ ను పూర్తిగా మార్చుకున్నాడీ హ్యాండ్సమ్ హీరో. ఇటీవలే జైపూర్ లో తన కుటుంబ సభ్యులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకొన్న మహేశ్ ఆదివారం హైదరాబాద్ కు తిరిగి వచ్చాడు. త్వరలోనే అతను రాజమౌళి సినిమా సెట్ లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా మహేశ్ తన సినిమాలతో పాటు ఇతర హీరోల సినిమాలను కూడా బాగా ఎంకరేజ్ చేస్తుంటాడు. కంటెంట్ బాగుంటే తానే ముందుకు వచ్చి ప్రమోట్ కూడా చేస్తుంటాడు. ఇటీవలే ధనుష్ రాయన్ సినిమాను చూసిన ప్రిన్స్.. సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపించాడు. ఇప్పుడు మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన కమిటీ కుర్రోళ్లు సినిమాను ఎంకరేజ్ చేసేందుకు ముందుకు వచ్చాడు. ఈ మేరకు త్వరలోనే నిహారిక సినిమాను చూస్తానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు మహేశ్. ‘నిహారిక నిర్మించిన కమిటీ కుర్రాళ్లు సినిమా గురించి చాలా గొప్పగా వింటున్నాను. నిర్మాతగా నీ తొలి చిత్రానికి నిహారిక నీకు శుభాకాంక్షలు. సినిమా విజయం సాధించడంపై మూవీ టీమ్ మొత్తానికి నా అభినందనలు. త్వరలోనే కచ్చితంగా ఈ సినిమాను చూస్తాను’ అంటూ మహేశ్ బాబు ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. మహేశ్ రియాక్ట్ అయ్యారంటే కచ్చితంగా సినిమా బాగుంటుందంటున్నారు ఫ్యాన్స్. తాము కూడా నిహారిక సినిమాకు టికెట్స్ బుక్ చేసుకుంటున్నామంటూ మహేశ్ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

కమిటీ కుర్రోళ్లు సినిమాలో 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్లు నటించారు. ఆగస్టు 09న విడుదలైన ఈ సినిమాకు మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ వచ్చింది. కేవలం మూడ్రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా సుమారు 6.04 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. కమిటీ కుర్రోళ్లు సినిమాకు యదు వంశీ దర్శకత్వం వహించారు. పల్లెటూరి వాతావరణంలోని ప్రేమ‌, స్నేహం, కుటుంబంలోని భావోద్వేగాల‌ను మిళితం చేస్తూ ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాను నిర్మించారు. సినీ ప్రేక్ష‌కుల‌తో పాటు సెల‌బ్రిటీలు సైతం క‌మిటీ కుర్రోళ్ళు చిత్రాన్ని ప్ర‌శంసిస్తున్నారు. ఇప్పుడు మహేశ్ కూడా రియాక్ట్ అవ్వడంతో కమిటీ కుర్రోళ్లు సినిమాకు మరింత బజ్ పెరగవచ్చని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మహేశ్ బాబు ట్వీట్..

కమిటీ కుర్రోళ్లు సినిమాను చూస్తానన్న మహేశ్ బాబు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..