Mohammed Siraj: కుటుంబ సభ్యుల కోసం కొత్త లగ్జరీ కారు కొన్న హైదరాబాదీ పేసర్.. ధర ఎంతో తెలుసా?

టీమిండియా ఫాస్ట్ బౌలర్, హైదరాబాదీ క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌ ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉన్నాడు. తన సంచలన బౌలింగ్ తో మూడు ఫార్మాట్లలోనూ టీమిండియా కీలక బౌలర్ గా ఎదిగాడు సిరాజ్. ఓవైపు మైదానంలో ఆటతో దుమ్ము రేపుతోన్న మియా.. సంపాదనలోనూ అదరగొడుతున్నాడు. ఇటీవలే శ్రీలంక పర్యటన ముగించుకుని వచ్చిన సిరాజ్.. తన కుటుంబ సభ్యుల కోసం

Mohammed Siraj: కుటుంబ సభ్యుల కోసం కొత్త లగ్జరీ కారు కొన్న హైదరాబాదీ పేసర్.. ధర ఎంతో తెలుసా?
Mohammed Siraj
Follow us
Basha Shek

|

Updated on: Aug 11, 2024 | 10:45 PM

టీమిండియా ఫాస్ట్ బౌలర్, హైదరాబాదీ క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌ ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉన్నాడు. తన సంచలన బౌలింగ్ తో మూడు ఫార్మాట్లలోనూ టీమిండియా కీలక బౌలర్ గా ఎదిగాడు సిరాజ్. ఓవైపు మైదానంలో ఆటతో దుమ్ము రేపుతోన్న మియా.. సంపాదనలోనూ అదరగొడుతున్నాడు. ఇటీవలే శ్రీలంక పర్యటన ముగించుకుని వచ్చిన సిరాజ్.. తన కుటుంబ సభ్యుల కోసం రూ. 3 కోట్లు విలువ చేసే ల్యాండ్ రోవర్ కారు కొన్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడీ టీమిండియా పేసర్. వీటికి ‘డ్రీమ్ కార్’ అని క్యాప్షన్ ఇచ్చాడు. ‘నా ఫ్యామిలీ కోసం డ్రీమ్ కారు కొనుగోలు చేశాను. కలలకు లిమిట్ అనేది ఉండబోదు. హార్డ్ వర్క్‌ ఉంటే ఏదైనా సాధ్యం అవుతుంది. దానికి ఇదే నిదర్శనం’ అంటూ తన ఆనందానికి అక్షర రూపమిచ్చాడు సిరాజ్. ప్రస్తుతం సిరాజ్ కొత్త కారు ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన భారత జట్టులో సిరాజ్ సభ్యుడిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ప్రకటించిన రూ. 125 కోట్ల నజరానాలో అతనికి రూ 5 కోట్లు వచ్చాయి. ఇప్పుడీ డబ్బుతోనే సిరాజ్ ల్యాండ్ రోవర్ కారు కొని ఉంటాడని అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇటీవల మహ్మద్ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం ఇంటి స్థలం కూడా కేటాయించింది. జూబ్లీహిల్స్‌లో 600 చదరపు గజాల స్థలాన్ని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. 2024 టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని సాధించిన జట్టులో సభ్యునిగా ఉన్న సిరాజ్ ను అభినందిచిన సీఎం రేవంత్ రెడ్డి అతనికి ఇంటి స్థలం కేటాయించడంతో పాటు గ్రూపు-1 స్థాయి ఉద్యోగం కేటాయించారు. కాగా ఇప్పటికే మహమ్మద్ సిరాజ్ దగ్గర అత్యంత ఖరీదైన కార్లు ఉన్నాయి. టయోటా కొరోల్లా(రూ. 22 లక్షలు), టయోటా ఫార్చునర్(రూ. 40 లక్షలు), బీఎండబ్ల్యూ 5 సిరీస్-రూ. 75 లక్షలు, మెర్సిడెస్ బెంజ్ క్లాస్-(రూ. 1.86 కోట్లు), రేంజ్ రోవర్ వాగ్యూ-రూ. 2.8తో పాటు మహీంద్ర థార్ కార్లు ఉన్నాయి. తాజాగా సిరాజ్ గ్యారేజ్‌లోకి మరో లగ్జరీ కార్ చేరింది.

కొత్త కారుతో మహ్మద్ సిరాజ్ ఫొజులు..

సిరాజ్ ను సన్మానిస్తోన్న సీఎం రేవంత్ రెడ్డి.. వీడియో

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..