- Telugu News Photo Gallery Cricket photos Indian Cricketer Jitesh Sharma gets engaged with Shalaka Makeshwar, Shares Photos
Jitesh Sharma: పెళ్లిపీటలెక్కనున్న టీమిండియా క్రికెటర్.. గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్.. ఫొటోస్ చూశారా?
టీమిండియా క్రికెటర్ జితేష్ శర్మ తన జీవితంలో నూతన ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నారు. టీ20 స్పెషలిస్టుగా పేరొందిన ఈ డ్యాషింగ్ బ్యాటర్ త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నాడు. తాజాగ తన చిన్ననాటి స్నేహితురాలితో జితేశ్ శర్మ నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది.
Updated on: Aug 10, 2024 | 10:57 PM

టీమిండియా క్రికెటర్ జితేష్ శర్మ తన జీవితంలో నూతన ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నారు. టీ20 స్పెషలిస్టుగా పేరొందిన ఈ డ్యాషింగ్ బ్యాటర్ త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నాడు. తాజాగ తన చిన్ననాటి స్నేహితురాలితో జితేశ్ శర్మ నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది

జితేశ్ శర్మకు కాబోయే భార్య పేరు శలక మకేశ్వర్‌తో. తన నిశ్చితార్థం ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడీ టీమిండియా డ్యాషింగ్ ప్లేయర్

ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. టీమిండయా క్రికెటర్లతో పాటు అభిమానులు, నెటిజన్లు కాబోయే జంటకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

గతేడాది చైనా వేదికగా జరిగిన ఆసియా క్రీడల ద్వారా భారత జట్టు తరపున అరంగ్రేటం చేశాడు జితేష్ శర్మ. టీమిండియాతో పాటు ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

భారత్ ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన జితేష్ కేవలం 100 పరుగులు మాత్రమే చేశాడు. అలాగే ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరపున 40 మ్యాచ్‌లు ఆడిన జితేష్ శర్మ.. 730 పరుగులు చేశాడు




