AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఆరోగ్యం విషయంలో వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Today Horoscope (March 8, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక వ్యవహారాలు చాలావరకు చక్కబడతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల ఆశించిన ఫలితాలుంటాయి. వృషభ రాశి వారికి ఆదాయ పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహం కలిగిస్తాయి. మిథున రాశి వారు ఉద్యోగంలో కొత్త లక్ష్యాలు, బాధ్యతలను చేపట్టడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Horoscope Today: ఆరోగ్యం విషయంలో వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Daily Horoscope 08 March 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 08, 2026 | 5:31 AM

Share

దిన ఫలాలు (మార్చి 8, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక వ్యవహారాలు చాలావరకు చక్కబడే అవకాశముంది. వృషభ రాశి వారికి ఆదాయ పరిస్థితి అనుకూలంగా ఉండే అవకాశముంది. మిథున రాశి వారు ఉద్యోగంలో కొత్త లక్ష్యాలు, బాధ్యతలను చేపట్టే ఛాన్స్ ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో ప్రతిభా పాటవాలకు, సమర్థతకు ఊహించని గుర్తింపు లభిస్తుంది. డాక్టర్లు, లాయర్లు, వ్యాపారులు తదితరులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు చాలావరకు చక్కబడతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల ఆశించిన ఫలితాలుంటాయి. ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉపయోగపడతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలలో సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో పని భారం, పని ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సహోద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపారాల మీద శ్రద్ధ పెంచడం మంచిది. ఆదాయం పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహం కలిగిస్తాయి. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. పిల్లలు చదువుల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో కూడా కొత్త లక్ష్యాలు, బాధ్యతలను చేపట్టడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక సమస్యలు కూడా చాలావరకు తీరిపోతాయి. మిత్రుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. అదనపు రాబడికి అవకాశం ఉంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. బంధువులతో శుభకార్యంలో పాల్గొంటారు. ఒకటి రెండు కుటుంబ సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో అధికారులతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఎవరికీ ఎటువంటి వాగ్దానాలూ చేయ వద్దు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. చేపట్టిన వ్యవహారాలను కొద్దిగా నిదానంగా పూర్తి చేస్తారు. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగుతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

రోజంతా ఆశించిన విధంగా సాగిపోతుంది. ఉద్యోగంలో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. ఆర్థికంగా లాభాలు అందుతాయి. వ్యవహార జయానికి అవకాశం ఉంది. ఇష్టమైన దేవాలయాలను సందర్శిస్తారు. బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. నిరుద్యోగులు ఆశించిన శుభవార్త అందుకుంటారు.

కన్య ( ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెంచడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. సర్వత్రా మీ మాట చెల్లుబాటవుతుంది. చేపట్టిన వ్యవహారాలు త్వరితగతిన పూర్తవుతాయి. ప్రయాణాల వల్ల లబ్ధి పొందుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాలు నిర్వహిస్తారు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. ఇతరుల నుంచి రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలు పూర్తి అవుతాయి. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందివస్తాయి. వ్యాపారాలు బాగా లాభసాటిగా సాగిపోతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు పూర్తి స్థాయిలో సత్ఫలితాలనిస్తాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని భారీ లక్ష్యాలను సకాలంలో సమర్థవంతంగా పూర్తి చేస్తారు. అధికారుల గుర్తింపు పొందుతారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. సమయానికి చేతికి డబ్బు అంది ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. వస్త్రాభరణాలు కొను గోలు చేస్తారు. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగ జీవితం ప్రోత్సాహకరంగా సాగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కొద్ది పాటి ఉపశమనం లభిస్తుంది. మిత్రుల సహా యంతో ముఖ్యమైన పనుల్ని పూర్తి చేస్తారు. కొన్ని ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో గానీ పూర్తి కావు. కుటుంబ జీవితం ఆనందోత్సాహాలతో సాగిపోతుంది. ప్రయాణాలు లాభిస్తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో అధికారులకు మీ సలహాలు, సూచనలు బాగా ఉపయోగపడతాయి. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు, లావాదేవీలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఒకటి రెండు అవకాశాలు కలిసి వస్తాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాలు చాలావరకు సజావుగా సాగిపోతాయి. సహోద్యోగుల నుంచి ఆశించిన సహకారం అందకపోవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో ఒకటి రెండు సమస్యలున్నా అవి తొలగిపోతాయి. చిన్ననాటి మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. సోదరులతో అనుకూలతలు ఏర్పడతాయి. అనవసర పరిచయాలు వల్ల డబ్బు న‌ష్టపోయే అవకాశం ఉంది. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఖర్చుల్ని బాగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆర్థికాభివృద్ధికి సమయం బాగా అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉత్సాహంగా పనిచేసి ఆశించిన లక్ష్యాలను అందుకోవడం జరుగుతుంది. ఉద్యోగులకు పదోన్నతికి అవకాశం ఉంది. రాజకీయాలు, రియల్ ఎస్టేట్, లిక్కర్ వంటి రంగాలకు చెందినవారికి ఆర్థికంగా అంచనాలను మించి లబ్ధి చేకూరుతుంది. ఒక శుభ కార్యానికి ప్లాన్ చేస్తారు. బంధువులను కలుసుకుంటారు. కుటుంబంలో సామరస్య వాతావరణం నెలకొంటుంది. చిన్ననాటి మిత్రులతో బాగా ఎంజాయ్ చేస్తారు.

Follow Us