Bigg Boss Telugu 8: బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ వీళ్లే.. జబర్దస్త్ మహిధర్ లిస్టులో ఊహించని పేర్లు

బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్ బాస్ మళ్లీ వస్తున్నాడు. ఇప్పటికే ఏడు సీజన్లు సక్సెస్‌ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ రియాలిటీ కొత్త సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఆగస్టు ఆఖరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ ప్రారంభం కావచ్చునని ఊహగానాలు వినిపిస్తున్నాయి.

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ వీళ్లే.. జబర్దస్త్ మహిధర్ లిస్టులో ఊహించని పేర్లు
Bigg Boss Telugu 8
Follow us
Basha Shek

|

Updated on: Aug 10, 2024 | 10:11 PM

బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్ బాస్ మళ్లీ వస్తున్నాడు. ఇప్పటికే ఏడు సీజన్లు సక్సెస్‌ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ రియాలిటీ కొత్త సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఆగస్టు ఆఖరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ ప్రారంభం కావచ్చునని ఊహగానాలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్ కోసం అన్నపూర్ణ స్టూడియలో శర వేగంగా పనులు జరుగుతున్నాయి. అలాగే ఎనిమిదో సీజన్ కు సంబంధించి ఇటీవలే ప్రోమోను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అలాగే టైటిల్ లోగోనూ కూడా సరికొత్తగా డిజైన్ చేశారు. మరోవైపు కంటెస్టెంట్స్ కు సంబంధించి సోషల్ మీడియాలో పలువురి పేర్లు దర్శనమిస్తున్నాయి. తాజాగా జబర్దస్త్ మహిధర్ తనకు ఉన్న విశ్వసనీయ సమాచారమంటూ బిగ్ బాస్ ఎనిమిదో కంటెస్టెంట్స్ కొన్ని పేర్లను వెల్లడించాడు. గతంలో జబర్దస్త్ కామెడీ షో తో మంచి గుర్తింపు తెచ్చుకున్న అతను ప్రస్తుతం బిగ్ బాస్ రివ్యూలు, సినిమా రివ్యూలు ఇస్తూ ఫేమస్ యూట్యూబర్ గా గుర్తింపు పొందాడు. ఇతని రివ్యూలకు యూబ్యూబ్ లో భారీ వ్యూస్ వస్తుంటాయి. అలా తాజాగా బిగ్ బాస్ ఎనిమిదో సీజన కంటెస్టెంట్స్ లిస్ట్ ను రిలీజ్ చేశాడు మహిధర్. అతని ప్రకారం.. బుల్లితెర నుంచి బర్దస్త్ నరేశ్, యాదమ్మ రాజు, కిరాక్ ఆర్పీ, బంచిక్ బబ్లూ హౌస్‌లోకి అడుగుపెట్టనున్నారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇక సీరియల్ కేటగిరీ నుంచి రీతూ చౌదరి, ప్రేరణ కంభం, ఏక్ నాథ్- హారిక జంట, హీరోయిన్స్ కేటగిరీ నుంచి సోనియా సింగ్, కుషితా కల్లపు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ల కేటగిరీ నుంచి మహాసేన రాజేశ్, యువ సామ్రాట్, హీరో ఆదిత్య ఓం వచ్చే అవకాశాలు ఉన్నాయన్నాడు జబర్దస్త్ మహిధర్. అయితే ఈసారి కంటెస్టెంట్స్ లిస్టు పెరగనుందని త్వరలోనే మరిన్ని విషయాలతో వస్తానన్నాడీ ఫేమస్ యూబ్యూబర్. వీరందరి పేర్లు వోకే కానీ బిగ్ బాస్ షోకు రాజేశ్ మహాసేన వస్తానని మహిధర్ చెప్పడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరి మహిధర్ అంచనాలు ఎంత మేర నిజమవుతాయో తెలుసుకోవాలంటే బిగ్ బాస్ షో లాంఛింగ్ డే వరకు ఆగాల్సిందే.

బిగ్ బాస్ సీజన్ 8 ప్రోమో.. వీడియో ఇదిగో..

జబర్దస్త్ మహిధర్ వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే