- Telugu News Photo Gallery Cinema photos Tollywood Villain Mahesh Manjrekar Daughter Saiee Manjrekar Latest Photos Goes Viral
Mahesh Manjrekar: ఈ టాలీవుడ్ విలన్‌కు ఇంత అందమైన కూతురుందా? తెలుగులో హీరోయిన్‌గా కూడా నటించిందా?
మహేశ్ మంజ్రేకర్.. ఎక్కువగా బాలీవుడ్ లో కనిపించే ఈ నటుడు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. గోపీచంద్ ఒక్కడున్నాడు, ఎన్టీఆర్ అదుర్స్, రవితేజ డాన్ శీను, సిద్ధూ జొన్నల గడ్డ గుంటూరు టాకీస్,ప్రభాస్ సాహో, తదితరసూపర్ హిట్ సినిమాల్లో విలన్‌గా ఆకట్టుకున్నాడు.
Updated on: Aug 09, 2024 | 8:59 AM

మహేశ్ మంజ్రేకర్.. ఎక్కువగా బాలీవుడ్ లో కనిపించే ఈ నటుడు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. గోపీచంద్ ఒక్కడున్నాడు, ఎన్టీఆర్ అదుర్స్, రవితేజ డాన్ శీను, సిద్ధూ జొన్నల గడ్డ గుంటూరు టాకీస్,ప్రభాస్ సాహో, తదితరసూపర్ హిట్ సినిమాల్లో విలన్‌గా ఆకట్టుకున్నాడు.

తన నటనతో కామెడీ పండించ గలడు. క్రూరత్వం చూపించగలడు. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేయడం ఈ నటుడి స్టైల్. అందుకే ఇతనికి బాలీవుడ్ లో బాగా క్రేజ్.

మాజీ సీఎం జగన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన యాత్ర 2 సినిమాలోనూ అద్భుతంగా నటించాడు మహేశ్ మంజ్రేకర్. చంద్రబాబు నాయుడి పాత్రకు ప్రాణం పోశాడు.

తెలుగు, తమిళ, హిందీ, మరాఠీ, కన్నడ, బెంగాలీ, భోజ్‌పురి భాషల్లో ఇతడు నటించిన మహేశ్ మంజ్రేకర్‌లో మంచి దర్శకుడు కూడా ఉన్నాడు. మెగా ఫోన్ పట్టి పలు సినిమాలు తీసి అలరించాడు.

మహేశ్ మంజ్రేకర్ కు ముగ్గురు పిల్లలు. ఇందులో సయీ మంజ్రేకర్ ఒకరు. సల్మాన్ ఖాన్ 'దబంగ్ 3' మూవీతో హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయమైందీ అందాల తార

అన్నట్లు తెలుగులోనూ ఈ ముద్దుగుమ్మ హీరయిన్ గా నటించింది వరుణ్ తేజ్ గని, రామ్ పోతినేని స్కంద, మేజర్ సినిమాల్లో నటించింది. అయితే పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు.