మీ ప్రేమకు థ్యాంక్స్.. నాకెప్పుడూ అండగా ఉన్నారు.. త్రిష పోస్ట్ వైరల్

Rajitha Chanti

Pic credit - Instagram

07 March 2026

దాదాపు రెండు దశాబ్దాలుగా దక్షిణాది సినీప్రపంచంలో చక్రం తిప్పుతున్న హీరోయిన్ త్రిష. అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ. 

నాలుగు పదుల వయసులోనూ ఏమాత్రం చెక్కు చెదరని అందంతో వెండితెరపై కవ్విస్తుంది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో నటిస్తూ బిజీగా ఉంది.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు చాలా కాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్‏గా ఉంటూ పోస్టులు చేస్తున్నారు.

తాజాగా త్రిష తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. క్రీమ్ కలర్ పట్టుచీరలో త్రిష మరింత అందంగా కనిపిస్తూ సినీ ప్రియులను ఫిదా చేస్తున్నాయి.

 ఆ ఫోటోస్ షేర్ చేస్తూ ఎల్లప్పుడూ నా అభిమానులుగా నాకు అండగా ఉండి నాకు ప్రేమ చూపిస్తున్నందుకు ధన్యవాదాలు అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.

త్రిష ధరించిన క్రీమ్ కలర్ పట్టుచీరకు గ్రీన్ కలర్ స్టోన్స్‌ తో ఉన్న నెక్‌ సెట్ ఆమెకు మరింత అందం తీసుకొచ్చింది. సింపుల్ చిరునవ్వుతో కట్టిపడేస్తుంది. 

గత నాలుగైదు రోజులుగా త్రిష పేరు సోషల్ మీడియాలో మారుమోగుతున్న సంగతి తెలిసిందే. విజయ్, సంగీత విడాకుల ఇష్యూలో ఆమె పేరు వినిపిస్తుంది.

ఇటీవల విజయ్ దళపతితో కలిసి ఒకే రంగు దుస్తులలో చెన్నైలోని ఓ వివాహ వేడుకకు హాజరైన సంగతి తెలిసిందే. దీంతో మరోసారి త్రిష పేరు తెరపైకి వచ్చింది.