AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akshay Kumar: స్టార్ హీరో సింప్లిసిటి.. నడిరోడ్డుపై ఫొటోగ్రాఫర్‌కు చెప్పులు అందించిన అక్షయ్ కుమార్.. వీడియో

ఈ మధ్యన బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తోన్న సినిమాలన్నీ బోల్తా పడుతున్నాయి. ఇటీవల ఎన్నో ఆశలు పెట్టుకున్న సర్ఫిరా కూడా అభిమానులను బాగా నిరాశపర్చింది. అంతకు ముందు బడే మియా చోటే మియా, ది రాణిగంజ్ చిత్రాలు కూడా అక్షయ్ కు నిరాశనే మిగిల్చాయి.. దీంతో అక్షయ్ ఆశలన్నీ ఇప్పుడు ఖేల్‌ ఖేల్‌ మే సినిమాపై నే ఉన్నాయి.

Akshay Kumar: స్టార్ హీరో సింప్లిసిటి.. నడిరోడ్డుపై ఫొటోగ్రాఫర్‌కు చెప్పులు అందించిన అక్షయ్ కుమార్.. వీడియో
Akshay Kumar
Basha Shek
|

Updated on: Aug 08, 2024 | 10:57 PM

Share

ఈ మధ్యన బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తోన్న సినిమాలన్నీ బోల్తా పడుతున్నాయి. ఇటీవల ఎన్నో ఆశలు పెట్టుకున్న సర్ఫిరా కూడా అభిమానులను బాగా నిరాశపర్చింది. అంతకు ముందు బడే మియా చోటే మియా, ది రాణిగంజ్ చిత్రాలు కూడా అక్షయ్ కు నిరాశనే మిగిల్చాయి.. దీంతో అక్షయ్ ఆశలన్నీ ఇప్పుడు ఖేల్‌ ఖేల్‌ మే సినిమాపై నే ఉన్నాయి. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. వాణి కపూర్‌, తాప్సీ, అమ్మీ విర్క్‌, ఫర్దీన్‌ ఖాన్‌ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సినిమాల సంగతి పక్కన పెడితే.. ఈ మధ్యన ఇతర విషయాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు అక్షయ్ కుమార్. ముఖ్యంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. . కొన్ని రోజుల క్రితం కష్టాల్లో ఉన్న ప్రముఖ సింగర్ గ్లోరీ బవాకు ఏకంగా 25 లక్షలు సహాయం చేశాడు. అలాగే ఇటీవల ముంబైలోని తన ఇంటి ఆవరణలో అన్నదానం నిర్వహించిన అక్షయ్ స్వయంగా అందరికీ ప్లేటులో భోజనం వడ్డించి ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. ఇక తాజాగా హాజీ అలీ దర్గా మరమ్మత్తుల కోసం ఏకంగా రూ. కోటికిపై విరాళం అందించాడు. దీంతో అభిమానులు, నెటిజన్లు అక్షయ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇదిలా ఉంటే తాజాగా మరో తన సింప్లిసీటీని చాటుకున్నాడు అక్షయ్. వివరాలిలా ఉన్నాయి.

సాధారణంగా సినిమా తారలు కనిపిస్తే చాలు.. వారి వెంట ఫొటో గ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు వెంట పడతారు. ఈ క్రమంలోనే అక్షయ్ కుమార్ వెళుతుండగా.. ఓ వీడియో గ్రాఫర్ తన కెమెరాలో విజువల్స్ ను బంధించాడు. అయితే ఇదే సమయంలో అతని చెప్పు ఊడిపోయింది. దీనిని గమనించిన అక్షయ్ స్టార్ హీరో అన్న స్థాయిని పక్కన పెట్టి తన చేతితో చెప్పును తీసి సదరు వీడియో గ్రాఫర్ కు అందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని చూసిన వారందరూ అక్షయ్ సింప్లిసిటీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ”అక్షయ్ అన్నా.. నువ్వు చాలా ట్రేట్.. నువ్వు మా మనసులు గెల్చుకున్నావ్.. నీది చాలా గొప్ప మనసు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

 వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.