AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vinesh Phogat: ‘మహిళలకు ఇది గుణపాఠం కావాలి’.. వినేశ్ ఫొగాట్‌పై హేమ మాలిని అనుచిత వ్యాఖ్యలు.. వీడియో

గత రెండు ఒలింపిక్స్ లో ఎదురైన చేదు అనుభవాలను మర్చిపోవడానికి వినేశ్ ఫొగాట్ కు సువర్ణ అవకాశం దక్కింది. అయితే అంతలోనే ఆమెను దురదృష్టం వెక్కిరించింది. దీంతో ప్రధాని మోడీ మొదలు పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు వినేశ్ కు మద్దుతుగా నిలుస్తున్నారు

Vinesh Phogat: 'మహిళలకు ఇది గుణపాఠం కావాలి'.. వినేశ్ ఫొగాట్‌పై హేమ మాలిని అనుచిత వ్యాఖ్యలు.. వీడియో
Vinesh Phogat, Hema Malini
Basha Shek
|

Updated on: Aug 08, 2024 | 8:55 AM

Share

పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచే అవకాశాన్ని భారత రెజ్లర్ వినేష్ ఫొగాట్ కోల్పోయింది. కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉండడంతో ఆమె ఫైనల్‌లో పోటీ చేసే అవకాశం రాలేదు. ఈ వార్త యావత్ దేశాన్ని షాక్ కు గురి చేసింది. ముఖ్యంగా గత రెండు ఒలింపిక్స్ లో ఎదురైన చేదు అనుభవాలను మర్చిపోవడానికి వినేశ్ ఫొగాట్ కు సువర్ణ అవకాశం దక్కింది. అయితే అంతలోనే ఆమెను దురదృష్టం వెక్కిరించింది. దీంతో ప్రధాని మోడీ మొదలు పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు వినేశ్ కు మద్దుతుగా నిలుస్తున్నారు. స్టార్ రెజ్లర్ కు ధైర్యం చెబుతూ ఓదారుస్తున్నారు. తాజాగా వినేశ్ ఫొగట్ అనర్హత విషయంపై ప్రముఖ బాలీవుడ్ నటి, ఎంపీ హేమమాలిని కూడా స్పందించారు. అయితే ఆమె మాటలు వివాదానికి దారి తీశాయి. పారిస్‌ ఒలింపిక్స్‌ నుంచి వినేష్‌ ఫోగట్‌ అనర్హత వేటుపై హేమమాలిని ఓ మీడియాతో స్పందించారు. ‘ఇది నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అలాగే, వింత. కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉండడంతో వినేశ్ ఫొగట్ పై అనర్హత వేటు పడింది. సరైన శరీర బరువును నిర్వహించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా కళాకారులకు, మహిళలకు ఇదొక గుణపాఠం. ఆమె త్వరగా 100 గ్రాముల బరువు తగ్గాలని ఆశిస్తున్నాను. అయినా ఇప్పుడు ఒలంపిక్‌ పతకమైతే రాదు కదా’ అంటూ వ్యంగ్యంగా నవ్వారు హేమ మాలినీ.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. దీనిని చూసిన క్రీడాభిమానులు, నెటిజన్లు హేమ మాలినీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రకటనలు చేసే హేమమాలిని ఎంపీగా ఉండేందుకు అనర్హురాలని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అలాంటి వారికి ఎవరు ఓటేస్తారో అర్థం కావడం లేదు’ అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. తన శరీర బరువును పట్టించుకోకుండా వినేష్ ఫోగట్ ఇలా మారలేదు. సమోసాలు, ఐస్‌క్రీమ్‌లు తిని ఆమె బరువు పెరగలేదు. ఆమె పాటించే స్ట్రిక్ట్ డైట్, ట్రైనింగ్ గురించి తెలియకుండా ఇలాంటి ప్రకటనలు చేయకండి’ అంటూ హేమ మాలికి క్లాస్ తీసుకుంటున్నారు నెటిజన్లు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

వినేష్ ఫోగట్ రెజ్లింగ్‌లో భారత్‌కు బంగారు పతకం తెస్తుందని అందరూ ఆశించారు. కానీ శరీర బరువు కారణంగా ఆ కల చెదిరిపోయింది. పలువురు బాలీవుడ్ ప్రముఖులు వినేష్ ఫోగట్‌ను ప్రోత్సహించారు. అలియా భట్, ఫర్హాన్ అక్తర్, కరీనా కపూర్, తాప్సీ పన్ను, రణవీర్ సింగ్, రకుల్ ప్రీత్ సింగ్ సహా పలువురు ప్రముఖులు ‘వినీష్ మా ఛాంపియన్’ అని అన్నారు. అయితే హేమ మాలిని ప్రకటన మాత్రం ట్రోల్స్‌కు కారణమైంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.