Bigg Boss: ‘బిగ్ బాస్ నుంచి తప్పుకుంటున్నా’.. కమల్ హాసన్ సంచలన నిర్ణయం.. కారణమిదే

ప్రముఖ నటుడు, లోక నాయకుడు కమల్ హాసన్ గత ఏడేళ్లుగా 'బిగ్ బాస్ తమిళ్' రియాల్టీ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. తనదైన శైలిలో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. రాబోయే కొత్త సీజన్‌ని కూడా కమల్ నే హోస్టింగ్ చేయాలన్నది అభిమానుల కోరిక. అయితే అంతకు ముందే షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు కమల్

Bigg Boss: 'బిగ్ బాస్ నుంచి తప్పుకుంటున్నా'.. కమల్ హాసన్ సంచలన నిర్ణయం.. కారణమిదే
Kamal Haasan
Follow us
Basha Shek

|

Updated on: Aug 06, 2024 | 7:47 PM

ప్రముఖ నటుడు, లోక నాయకుడు కమల్ హాసన్ గత ఏడేళ్లుగా ‘బిగ్ బాస్ తమిళ్’ రియాల్టీ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. తనదైన శైలిలో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. రాబోయే కొత్త సీజన్‌ని కూడా కమల్ నే హోస్టింగ్ చేయాలన్నది అభిమానుల కోరిక. అయితే అంతకు ముందే షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు కమల్. ఈసారి తాను బిగ్ బాస్ షోకి హోస్ట్ చేయనని సూటిగా చెప్పారు. కమల్ హాసన్ తన నిర్ణయం వెనుక కారణాన్ని కూడా వివరించారు. సాధారణంగా బిగ్ బాస్ హోస్ట్ మార్పుపై సోషల్ మీడియాలో పలు రూమర్లు, పుకార్లు వస్తుంటాయి. అయితే ఇప్పుడు కమల్ హాసన్ గురించి వినిపిస్తున్నది గాసిప్ కాదు. ఈ విషయాన్ని స్వయంగా కమల్ హాసన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన అభిమానులకు ఓ లేఖ రాశారు. ‘7 ఏళ్ల క్రితం ప్రారంభమైన మా బిగ్ బాస్ జర్నీకి బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నానని బరువెక్కిన హృదయంతో తెలియజేస్తున్నాను . గతంలో ఒప్పుకున్న సినిమాల వర్క్ కారణంగా ఈసారి బిగ్ బాస్ షోకు అందుబాటులో ఉండలేపోతున్నాను’ అని కమల్ హాసన్ తన నిర్ణయానికి గల కారణాలను వెల్లడించారు.

‘బిగ్ బాస్ రియాలిటీ షోతో మీ ఇళ్లకు చేరుకునే అవకాశం నాకు లభించింది. మీరందరూ నాపై ఎంతో ప్రేమాభిమానాలు చూపించారు. అందుకు నేను ఎప్పటికీ కృతజ్ఞుడనై ఉంటాను. మీ సపోర్ట్ వల్ల బిగ్ బాస్ తమిళ రియాల్టీ షో నా బెస్ట్ షో అయింది. నాకు అవకాశమిచ్చిన బిగ్ బాస్ యాజమాన్యానికి రుణ పడి ఉంటాను. మీ అందరికీ, పోటీదారులందరికీ ధన్యవాదాలు’ అని కమల్ హాసన్ లేఖలో రాశారు. కొత్త సీజన్‌ను ఎవరు హోస్ట్ చేస్తారనే దాని గురించి ఛానెల్ ఇంకా సమాచారం ఇవ్వలేదు.

ఇవి కూడా చదవండి

కమల్ హాసన్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Kamal Haasan (@ikamalhaasan)

కాగా కన్నడలో కిచ్చా సుదీప్ మొదటి సీజన్ నుండి ఇప్పటి వరకు అన్ని ఎడిషన్స్ కి హోస్ట్ గా వ్యవహరించాడు. హిందీలో సల్మాన్ ఖాన్, తెలుగులో అక్కినేని నాగార్జున, మలయాళంలో మోహన్ లాల్ బిగ్ బాస్ హోస్ట్ చేస్తూ ప్రజలకు దగ్గరయ్యారు. హిందీ బిగ్ బాస్ OTT షోకు కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరించారు. ఈ సంవత్సరం, OTT షోకి యాంకరింగ్ చేసిన అనిల్ కపూర్ బాగా ట్రోల్ అయ్యాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.