Darshan: ఇదేం పిచ్చిరా అయ్యా! నుదుటిపై  దర్శన్ పేరును పచ్చబొట్టుగా వేయించుకున్న అభిమాని.. వీడియో వైరల్

జైలులో ఉన్నప్పటికీ దర్శన్ క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంది. వీలైనంత త్వరగా డీ బాస్ (దర్శన్ ముద్దుపేరు)  బయటకు రావాలని అభిమానులు దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ కొంత మంది మాత్రం హద్దులు దాటుతున్నారు. అభిమానం పేరుతో పిచ్చి చర్యలకు పాల్పడుతున్నారు. గతంలో దర్శన్ పై ఉన్న అభిమానంతో ఒక వ్యక్తి తన కుమారుడికి ఏకంగా ఖైదీ డ్రెస్ తొడిగించి ఫొటో షూట్ చేయించాడు

Darshan: ఇదేం పిచ్చిరా అయ్యా! నుదుటిపై  దర్శన్ పేరును పచ్చబొట్టుగా వేయించుకున్న అభిమాని.. వీడియో వైరల్
Actor Darshan Fan
Follow us
Basha Shek

|

Updated on: Aug 05, 2024 | 8:04 PM

అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ జైలుకు వెళ్లి రెండు నెలలు కావస్తోంది. ప్రస్తుతం పరప్పన అగ్రహారం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడీ కన్నడ స్టార్. అతనిని చూసేందుకు నిత్యం కుటుంబ సభ్యులు, అభిమానులు, స్నేహితులు జైలుకు వస్తూనే ఉన్నారు. కాగా జైలులో ఉన్నప్పటికీ దర్శన్ క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంది. వీలైనంత త్వరగా డీ బాస్ (దర్శన్ ముద్దుపేరు)  బయటకు రావాలని అభిమానులు దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ కొంత మంది మాత్రం హద్దులు దాటుతున్నారు. అభిమానం పేరుతో పిచ్చి చర్యలకు పాల్పడుతున్నారు. గతంలో దర్శన్ పై ఉన్న అభిమానంతో ఒక వ్యక్తి తన కుమారుడికి ఏకంగా ఖైదీ డ్రెస్ తొడిగించి ఫొటో షూట్ చేయించాడు. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలయ్యాయి. ఇక జైలులో దర్శన్ కు కేటాయించిన నెంబర్ ను కూడా తమ బైక్ లకు నంబర్ ప్లేట్లుగా, ఒంటిపై పచ్చబొట్లుగా వేయించుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా ఒక అభిమానిన నుదిటిపై డీస్ పేరును పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది.

అభిమానులు తమ అభిమాన సినీ తారల చిత్రాలను, పేర్లను తమ చేతులపై లేదా నుదుటిపై టాటూలుగా వేయించుకుంటారు. అయితే ఇక్కడ దర్శన్ అభిమాని తన నుదుటిపై ‘డి బాస్’ పేరును టాటూగా వేయించుకున్నాడు. karunada_adhipati_official పేరుతో Instagram పేజీలో దీని గురించి షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. కేవలం 24 గంటల్లోనే ఈ పోస్టుకు 2 లక్షలకు పైగా లైక్స్ ,కామెంట్స్ రావడం గమనార్హం. దీనిని చూసిన వారందరూ సదరు అభిమానిని తిట్టిపోస్తున్నారు. ‘ మీ తల్లిదండ్రుల పేర్లను పచ్చబొట్టు వేయించుకోండి బ్రో. కొంచెమైనా రుణం తీర్చుకున్న వారు అవుతారు’ అంటూ ఒక నెటిజన్ సదరు అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘ఇలా చేయడం అభిమానం అనిపించుకోదు.. పిచ్చి అంటారు దీన్ని’ అంటూ ఈ వీడియోపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

 ఖైదీ వేషధారణలో ఏడాది బాలుడు.. ఫొటోస్ ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.