AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? ప్రాణ గండం నుంచి బయటపడిన టాలీవుడ్ హీరో.. సపరేట్ ఫ్యాన్ బేస్

పై ఫొటోలో క్యూట్ గా కనిపిస్తోన్న బుడ్డోడిని గుర్తు పట్టారా? ఆ పిల్లాడు ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారిపోయాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతూ యంగ్ హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. లవ్, యాక్షన్, క్లాస్, మాస్.. ఇలా ఏ సినిమాలకైనా సూట్ అవుతాడీ హ్యాండ్సమ్ హీరో. అందుకే ఈ నటుడికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.

Tollywood: ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? ప్రాణ గండం నుంచి బయటపడిన టాలీవుడ్ హీరో.. సపరేట్ ఫ్యాన్ బేస్
Tollywood Actor Childhood Photo
Basha Shek
|

Updated on: Aug 04, 2024 | 7:34 PM

Share

పై ఫొటోలో క్యూట్ గా కనిపిస్తోన్న బుడ్డోడిని గుర్తు పట్టారా? ఆ పిల్లాడు ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారిపోయాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతూ యంగ్ హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. లవ్, యాక్షన్, క్లాస్, మాస్.. ఇలా ఏ సినిమాలకైనా సూట్ అవుతాడీ హ్యాండ్సమ్ హీరో. అందుకే ఈ నటుడికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే అందరి హీరోల్లా ఇతగాడికి కూడా ఫ్లాపులు తప్పలేదు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా వరుసగా ఆరు బ్యాక్ టు బ్యాక్ ప్లాఫ్ లు అందుకున్నాడీ ట్యాలెంటెడ హీరో. అయినా నిరాశ పడకుండా సినిమాలు చేశాడు. మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. అయితే ఈ హీరో కొన్ని నెలల క్రితం ఒక ప్రమాదకరమైన రోడ్ యాక్సిడెంట్ బారిన పడ్డాడు. మృత్యువు అంచుల వరకు వెళ్లాడు. అయితే అభిమానుల ఆశీర్వాద బలంతో ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. అయినా ఇప్పటికీ ఆ ప్రమాదపు ఛాయలు ఈ నటుడిలో కనిపిస్తున్నాయి. గతంలో ఎంతో గ్రేస్ తో డ్యాన్సులు చేసే అతను ఇప్పుడు సింపుల్ స్టెప్స్ తోనే అభిమానులను అలరిస్తున్నాడు. రోడ్ యాక్సిడెంట్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల సినిమాలను ఖాతాలో వేసుకున్న ఆ హీరో ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటా. యస్. అతను మరెవరో కాదు సుప్రీం హీరో, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. ఇది అతని చిన్నప్పటి ఫొటో.

కాగ బైక్ యాక్సిడెంట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష, బ్రో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. రెండూ సినిమాలు వంద కోట్లకు పైగా కలెక్షన్లు సాధించాయి. బ్రో తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు సాయి ధరమ్ తేజ్. సంపత్ నందితో ఓ సినిమా అనౌన్స్ చేసిన ఎందుకో కానీ ఈ ప్రాజెక్టు నుంచి అప్ డేట్స్ రావడం లేదు. అయితేఇప్పుడు తొలిసారి ఓ భారీ ప్రాజెక్టుతో మన ముందుకు రానున్నాడీ మెగా హీరో. హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి రూ. 120 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఆగస్టులో ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కనుందని సమాచారం. 2025లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

ఇవి కూడా చదవండి

సీఎం రేవంత్ రెడ్డితో సాయి ధరమ్ తేజ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ ఒలవడం..
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ ఒలవడం..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది