AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Geethu Royal: ‘నా బిడ్డను చంపేశారు’.. గుండెలవిసేలా రోదిస్తోన్న గీతూ రాయల్.. వీడియో వైరల్.. ఏం జరిగిందంటే?

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో గీతూ రాయల్ ఒకరు. సీజన్ 6 లో అడుగుపెట్టిన ఆమె తనదైన ఆటతీరుతో బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. ఒకానొక దశలో గీతూనే బిగ్ బాస్ విజేతగా నిలవొచ్చని అభిమానులు ఆశించారు. అయితే తన ఓవరాక్షన్ తో ఊహించని విధంగా హౌస్ నుంచి బయటకు వచ్చింది.

Geethu Royal: 'నా బిడ్డను చంపేశారు'.. గుండెలవిసేలా రోదిస్తోన్న గీతూ రాయల్.. వీడియో వైరల్.. ఏం జరిగిందంటే?
Geethu Royal
Basha Shek
|

Updated on: Aug 03, 2024 | 6:34 PM

Share

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో గీతూ రాయల్ ఒకరు. సీజన్ 6 లో అడుగుపెట్టిన ఆమె తనదైన ఆటతీరుతో బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. ఒకానొక దశలో గీతూనే బిగ్ బాస్ విజేతగా నిలవొచ్చని అభిమానులు ఆశించారు. అయితే తన ఓవరాక్షన్ తో ఊహించని విధంగా హౌస్ నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ లకు రివ్యూలు చెప్పడంతో పాటు ఏడో సీజన్ బిగ్ బాస్ బజ్‌కు హోస్ట్ గా వ్యవహరించింది. ప్రస్తుతం టీవీ షోల్లో కనిపిస్తోన్న గీతూ రాయల్ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను అందులో షేర్ చేసుకుంటోంది. అలా గీతూ షేర్ చేసిన ఒక పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. వివరాలిలా ఉన్నాయి.. గీతూ రాయల్ కు ఓరియో అనే పెంపుడు పిల్లి ఉంది. దానిని ఒక ఫ్యామిలీ మెంబర్ లా చూసుకుంటుందామె. అయితే ఇటీవల కొన్ని వీధి కుక్కలు ఆ పిల్లిని చంపేశాయి. దీంతో బాగా ఎమోషనలైంది గీతూ. ‘ ఓరియో బంగారం.. నా బిడ్డ లేదు.. ఐ లవ్ యు.. ఐ మిస్ యూ’ అంటూ సారి పిల్లిని సమాధి చేస్తూ ఏడ్చేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆమె పిల్లితో తనకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తుకు తెచ్చుకుంది

‘2021 సంవత్సరం డిసెంబర్‌ 13న ఓరియో మా కుటుంబంలోకి అడుగు పెట్టింది. ఈ ఏడాది జూలై 27న శాశ్వతంగా అందరినీ వదిలి వెళ్లిపోయింది. నా పిల్లి చాలా అమాయకమైనది. దీనికి కనీసం ఎలా అరవాలో, కరవాలో కూడా తెలియదు. రోజూలాగే జూలై 27న ఉదయం 3.45 గంటలకు బయట వీధిలోకి వెళ్లింది. 5.30 కల్లా ఇంటికి తిరిగొచ్చేది. కానీ ఆరోజు మాత్రం రాలేదు. సాయంత్రం నాలుగు గంటల వరకు వెతుకుతూనే ఉన్నాం. చివరికి అది శవమై కనిపించింది. సెక్యూరిటీ గార్డుల నిర్లక్ష్యం వల్ల వీధి కుక్కలు కమ్యూనిటీ లోపలకు వచ్చాయి. నా బిడ్డను వెంటాడి మరీ చంపేశాయి. ఆ సమయంలో తను ఎంత భయపడిపోయిందో, ఎలాంటి బాధను అనుభవించిందో ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. ఓరియో పడ్డ ఆవేదనను తలుచుకుంటేనే కష్టంగా ఉంది. ఓరియో అంటే నాకు ప్రాణం.. ఇప్పుడు దాన్ని ఎంతగానో మిస్‌ అవుతున్నాను. ఓరియో నాన్న… వీలైతే తిరిగొచ్చేయ్‌ రా.. బంగారు కొండ.. మమ్మా నిన్ను ఎంతో ప్రేమిస్తోంది’ అని పెంపుడు పిల్లిపై తనకున్న ప్రేమకు అక్షర రూప మిచ్చింది గీతూ రాయల్. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

View this post on Instagram

A post shared by Geetu Royal (@geeturoyal_)

కాగా గతంలో బిగ్‌బాస్‌ షోలో గీతూ రాయల్ ఉన్నప్పుడు కూడా ఇంటి నుంచి ఏం కావాలంటే ఓరియో బొచ్చు కావాలని అడిగింది. ఈ విషయం అప్పట్లో తెగ వైరలైంది. ఇప్పుడదే పెంపుడు పిల్లి చనిపోవడంతో గుండెలు పగిలేలా రోదిస్తుందామె.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.