AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బన్నీ- మంచు విష్ణుతో ఉన్న ఈ పిల్లాడిని గుర్తు పట్టారా? ఇప్పుడు బుల్లితెరను ఏలుతున్నాడు.. మన వైజాగ్ అబ్బాయే

ఛైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన ఈ అబ్బాయి మహేశ్ బాబు, రవితేజ, బాలకృష్ణ తదితర టాప్ హీరోల సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత హీరోగా కెరీర్ ఆరంభించాడు. పలు సినిమాల్లో సోలో హీరోగా నటించిన ఈ హ్యాండ్సమ్ యాక్టర్ ఇప్పుడు బుల్లితెరపై అదర గొడుతున్నాడు. తనదైన నటనతో అందరి మనసులు మరీ ముఖ్యంగా అమ్మాయిల హృదయాలను కొల్లగొడుతున్నాడు.

బన్నీ- మంచు విష్ణుతో ఉన్న ఈ పిల్లాడిని గుర్తు పట్టారా? ఇప్పుడు బుల్లితెరను ఏలుతున్నాడు.. మన వైజాగ్ అబ్బాయే
Allu Arjun, Manchu Vishnu
Basha Shek
|

Updated on: Aug 03, 2024 | 3:28 PM

Share

పై ఫొటోలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మంచు విష్ణు చేతుల మీదుగా అవార్డు తీసుకుంటున్న కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా. ప్రస్తుతం ఈ పిల్లాడు యాక్టర్ గా మారిపోయాడు. సినిమాలు, వెబ్ సిరీస్ లు, సీరియల్స్ లో నటిస్తూ బిజిబిజీగా ఉంటున్నాడు. ఛైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన ఈ అబ్బాయి మహేశ్ బాబు, రవితేజ, బాలకృష్ణ తదితర టాప్ హీరోల సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత హీరోగా కెరీర్ ఆరంభించాడు. పలు సినిమాల్లో సోలో హీరోగా నటించిన ఈ హ్యాండ్సమ్ యాక్టర్ ఇప్పుడు బుల్లితెరపై అదర గొడుతున్నాడు. తనదైన నటనతో అందరి మనసులు మరీ ముఖ్యంగా అమ్మాయిల హృదయాలను కొల్లగొడుతున్నాడు. బిగ్ బాస్ తెలుగు షోలోనూ సందడి చేసిన ఈ నటుడు త్వరలోనే తండ్రిగా ప్రమోషన్ కూడా పొందనున్నాడు. మరి ఈ కుర్రాడు ఎవరో గుర్తు పట్టారా? అతను మరెవరో కాదు బుల్లితెర హీరో ‘మానస్ నాగులపల్లి’. అదేనండి ప్రస్తుతం టాప్ వన్ సీరియల్ అయిన ‘బ్రహ్మముడి’లో హీరో రాజ్. ఇది అతని చిన్న నాటి ఫొటో. 2004లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉత్తమ నటనకు గానూ మానస్ నాగులపల్లికి స్టార్ మా అవార్డు లభించింది. దక్షిణాది స్టార్ హీరోలు అల్లు అర్జున్, మంచు మనోజ్ ల చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నాడు మానస్. అదే ఈ ఫొటో.

ఏపీలోని విశాఖపట్నం కు చెందిన మానస్ ఛైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించాడు. మహేశ్ అర్జున్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అతను రవితేజ వీడే, బాలకృష్ణ నరసింహ నాయుడు సినిమాల్లో బాల నటుడిగా మెరిశాడు. ఆ తర్వాత 2015లో సోలో హీరోగా ‘ఝలక్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కాయ్ రాజా కాయ్, అతను, కై రాజా కై, ప్రేమికుడా, గోలి సోడా, తదితర సినిమాల్లోనూ హీరోగా కనిపించాడు.

ఇవి కూడా చదవండి

సీమంతం వేడుకలో మానస్ దంపతులు..

అదే సమయంలో బుల్లితెరకు పరిచమయ్యాడు. పితృదేవోభవ, భలే ఛాన్సులే, కోయిలమ్మా, కార్తీకదీపం వంటి సీరియల్స్ లో అలరించాడు. దీని తర్వాత తెలుగు బిగ్ బాస్ సీజన్ 5లో కూడా ఎంట్రీ ఇచ్చి బుల్లితెర ఆడియెన్స్ కు మరింత చేరువయ్యాడు. ప్రస్తుతంబ్రహ్మముడి సిరీయల్ లో హీరోగా అలరిస్తోన్న ఈ హ్యాండ్సమ్ యాక్టర్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ పాత్రల్లో కనిపిస్తున్నాడు.

1317091,1317080,1317034,1317011

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.