AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss: హిందీ బిగ్ బాస్ విజేతగా టాలీవుడ్ హీరోయిన్.. ప్రైజ్ మనీగా ఎన్ని లక్షలు అందుకుందో తెలుసా?

హిందీ బుల్లితెర ఆడియెన్స్ ను బాగా అలరిస్తోన్న బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 కు ఎండ్ కార్డ్ పడింది. జూన్‌ 21న ప్రారంభమైన కొత్త సీజన్‌ ఆగస్టు 2న ఫైనల్‌తో ముగిసింది. చాలా మంది ఊహించినట్లుగానే ప్రముఖ నటి సనా మక్బూల్ బిగ్ బాస్ ఓటీట సీజన్ 3 కిరీటాన్ని అందుకుంది. ప్రముఖ ర్యాప్‌ సింగర్‌ నేజీ రన్నరప్‌గా నిలిచాడు

Bigg Boss: హిందీ బిగ్ బాస్ విజేతగా టాలీవుడ్ హీరోయిన్.. ప్రైజ్ మనీగా ఎన్ని లక్షలు అందుకుందో తెలుసా?
Bigg Boss OTT Season 3
Basha Shek
|

Updated on: Aug 03, 2024 | 2:52 PM

Share

హిందీ బుల్లితెర ఆడియెన్స్ ను బాగా అలరిస్తోన్న బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 కు ఎండ్ కార్డ్ పడింది. జూన్‌ 21న ప్రారంభమైన కొత్త సీజన్‌ ఆగస్టు 2న ఫైనల్‌తో ముగిసింది. చాలా మంది ఊహించినట్లుగానే ప్రముఖ నటి సనా మక్బూల్ బిగ్ బాస్ ఓటీట సీజన్ 3 కిరీటాన్ని అందుకుంది. ప్రముఖ ర్యాప్‌ సింగర్‌ నేజీ రన్నరప్‌గా నిలిచాడు. వీరితో పాటు కృతికా మాలిక్, రణవీర్ షోరే, సాయి కేతన్ రావ్ టాప్-5 లో నిలిచారు. అయితే సీజన్ అంతటా తన ఆటతీరు, మాటతీరుతో అభిమానుల మనసులు గెల్చుకుంది సనా మక్బూల్. దీనికి తోడు ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. దీంతో బిగ్ బాస్ ట్రోఫీ ఈ అందాల తారనే వరించింది. శుక్రవారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో హోస్ట్ అనిల్ కపూర్ సనా మక్బుల్ కు రూ. 25 లక్షల చెక్‌ను అందించారు. దీంతో పాటు ఆమెపై బహుమతుల వర్షం కురిపిస్తున్నారు. కాగా బిగ్ బాస్ ఓటీటీ మొదటి రెండు సీజన్లకు కరణ్‌జోహర్‌, సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌లుగా వ్యవహరించారు. అయితే మూడో సీజన్‌కు మాత్రం బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అనిల్‌ కపూర్‌ వ్యాఖ్యతగా వ్యవహరించారు.

బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3‌లో చాలా మంది ప్రముఖులు పాల్గొన్నారు. అయితే అర్మాన్ మాలిక్ తన ఇద్దరు భార్యలతో బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగు పెట్టడంతో ఈ రియాలిటీ షోపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై పోలీస్ కేసు కూడా నమోదైంది. ఇక విజేత సనా మక్బూల్ విషయానికి వస్తే.. ముంబైకు చెందిన ఈ ముద్దుగుమ్మ మోడలింగ్ తో కెరీర్ ఆరంభించింది. పలు బాలీవుడ్ సీరియల్స్ లో మెరిసింది. అన్నట్లు తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ అందాల తార పరిచయమే. 2014లో నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన దిక్కలు చూడకు రామయ్య సినిమాలో హీరోయిన్ గా నటించింది సనా మక్బూల్. అలాగే 2017లో రిలీజైన మామా ఓ చందమామ మూవీలోనూ కథానాయికగా కనిపించింది. కొన్ని తమిళ సినిమాల్లోనూ తళుక్కుమందీ ముంబై ముద్దుగుమ్మ.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ విజేతగా సనా మక్బూల్.. వీడియో

రూ. 25 లక్షల ప్రైజ్ మనీ అందుకున్న సనా మక్బూల్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
కుర్రకారును ఆకట్టుకుంటున్న ట్రెండింగ్ హీరోయిన్స్
కుర్రకారును ఆకట్టుకుంటున్న ట్రెండింగ్ హీరోయిన్స్
రాబోయే భారీ చిత్రాలకు తప్పని గ్రాఫిక్స్ కష్టాలు
రాబోయే భారీ చిత్రాలకు తప్పని గ్రాఫిక్స్ కష్టాలు
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. త్వరలో పెట్రోల్‌ బైక్స్‌ బ్యాన్..!
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. త్వరలో పెట్రోల్‌ బైక్స్‌ బ్యాన్..!
వందల కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా ?? కారణాలివే
వందల కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా ?? కారణాలివే
స్పిరిట్ పై విమర్శలు.. ఐ డోంట్ కేర్ అంటున్న సందీప్ వంగా
స్పిరిట్ పై విమర్శలు.. ఐ డోంట్ కేర్ అంటున్న సందీప్ వంగా
కలిసి 20 సినిమాలు.. అయినా ఆమెతో 30ఏళ్లు మాట్లాడని హీరో కృష్ణ
కలిసి 20 సినిమాలు.. అయినా ఆమెతో 30ఏళ్లు మాట్లాడని హీరో కృష్ణ
జన నాయగన్‌ను వాళ్లే లీక్ చేశారా ?? పైరసీ వెనుక రాజకీయ కుట్ర
జన నాయగన్‌ను వాళ్లే లీక్ చేశారా ?? పైరసీ వెనుక రాజకీయ కుట్ర
చికెన్‌లోని ఈ పార్ట్స్‌తో జాగ్రత్త.. మర్చిపోయి కూడా తినొద్దు..
చికెన్‌లోని ఈ పార్ట్స్‌తో జాగ్రత్త.. మర్చిపోయి కూడా తినొద్దు..
వంటగది టైల్స్‌పై జిడ్డు మరకలా? ఆ సమస్యకు చెక్ పెట్టండిలా!
వంటగది టైల్స్‌పై జిడ్డు మరకలా? ఆ సమస్యకు చెక్ పెట్టండిలా!
బంగారమే కాదు, అక్షయతృతీయ రోజు ఇవి కొన్నా అదృష్టం కలిసొస్తది!
బంగారమే కాదు, అక్షయతృతీయ రోజు ఇవి కొన్నా అదృష్టం కలిసొస్తది!