AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakshana OTT: ఓటీటీలోకి వచ్చేసిన పాయల్ రాజ్‌ పుత్ లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఎందులో చూడొచ్చంటే?

రిలీజ్ కు ముందు ఈ సినిమా ప్రేక్షకుల నోళ్లలో బాగా నానింది. దానికి కారణం హీరోయిన్ పాయల్ రాజ్ పుత్, మేకర్స్ కు మధ్య జరిగిన గొడవలు. ఎప్పుడో పూర్తయిన సినిమాని ఇప్పుడు విడుదల చేస్తున్నారని.. రెమ్యూనరేషన్ సైతం ఇవ్వకుండా ప్రమోషన్స్ కి రావాలని కోరుతున్నారంటూ పాయల్ రాజ్ పుత్ చేసిన కామెంట్స్ టాలీవుడ్ లో తీవ్ర దుమారం రేపాయి.

Rakshana OTT: ఓటీటీలోకి వచ్చేసిన పాయల్ రాజ్‌ పుత్ లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఎందులో చూడొచ్చంటే?
Rakshana Movie
Basha Shek
|

Updated on: Aug 01, 2024 | 7:38 PM

Share

ప్రేమ కథలు, రొమాంటిక్ సినిమాలు, నెగిటివ్ రోల్స్ సినిమాల్లో నటించి మెప్పించిన పాయల్ రాజ్ పుత్ మొదటిసారి పోలీసాఫీసర్ గా కనిపించిన చిత్రం రక్షణ. మంగళవారం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆమె నటించిన సినిమా ఇదే. రిలీజ్ కు ముందు ఈ సినిమా ప్రేక్షకుల నోళ్లలో బాగా నానింది. దానికి కారణం హీరోయిన్ పాయల్ రాజ్ పుత్, మేకర్స్ కు మధ్య జరిగిన గొడవలు. ఎప్పుడో పూర్తయిన సినిమాని ఇప్పుడు విడుదల చేస్తున్నారని.. రెమ్యూనరేషన్ సైతం ఇవ్వకుండా ప్రమోషన్స్ కి రావాలని కోరుతున్నారంటూ పాయల్ రాజ్ పుత్ చేసిన కామెంట్స్ టాలీవుడ్ లో తీవ్ర దుమారం రేపాయి. మరోవైపు చిత్ర బృందం సైతం పాయల్ పై చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ కు ఫిర్యాదు చేసింది. ఇలా పలు వివాదాల తో వార్తల్లో నిలిచిన రక్షణ సినిమా ఎట్టకేలకు జూన్ 7 న థియేటర్లలో రిలీజైంది. అయితే ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. క‌థ, కథనం కొత్త‌గా ఆకట్టుకునేలా ఉన్నా సినిమాను ఇంట్రెస్టింగ్‌గా మల్చడంలో ద‌ర్శ‌కుడు విఫలమయ్యాడని రివ్యూలు వచ్చేశాయి. అయితే సిన్సియర్ పోలీసాఫీసర్ పాత్రలో పాయల్ రాజ్ పుత్ నటన బాగుందని ప్రశంసలు వినిపించాయి. ఇలా థియేటర్లలో ఓ మోస్తరుగా నిలిచిన రక్షణ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా సొంతం చేసుకుంది.

ఈ నేపథ్యంలో గురువారం (ఆగస్టు 01) అర్ధరాత్రి నుంచే రక్షణ సినిమాను ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు తీసుకొచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది ఆహా. ప్రణదీప్ ఠాకూర్ తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ మానస్ విలన్ రోల్ లో నటించడం విశేషం. అలాగే శివన్నారాయణ, మానస్, రాజీవ్ కనకాల, వినోద్ బాలా, ఆనంద్ చక్రపాణి తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. హ‌రిప్రియ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ ఈ సినిమాని నిర్మిస్తూ ద‌ర్శ‌క‌త్వం వహించారు. మరి థియేటర్లలో పాయల్ రాజ్ పుత్ సినిమాను మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి రక్షణ ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

ఆహాలో స్ట్రీమింగ్..

పాయల్ రాజ్ పుత్ రక్షణ సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!