AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress : దూసుకొస్తున్న మిసైళ్లు.. దుబాయ్‌లో చిక్కుకున్న హీరోయిన్.. రక్షించాలని మోదీకి రిక్వెస్ట్

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం మొదలైంది. అటు గల్ఫ్ దేశాలపై యుద్ధాగ్ని జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఇరాన్ లక్ష్యంగా శనివారం అమెరికా, ఇజ్రాయెల్ భారీ దాడులకు దిగాయి. దీంతో ప్రతికార చర్యగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ మిస్లైళ్లతో దాడి చేస్తుంది. అటు దుబాయ్, ఖాతార్, కువైయిట్ దేశాల్లో ఎయిర్ పోర్టులు తాత్కాలికంగా మూతపడ్డాయి.

Actress : దూసుకొస్తున్న మిసైళ్లు.. దుబాయ్‌లో చిక్కుకున్న హీరోయిన్.. రక్షించాలని మోదీకి రిక్వెస్ట్
Sonal Chauhan
Rajitha Chanti
|

Updated on: Mar 01, 2026 | 11:57 AM

Share

పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు గల్ప్ దేశాలకు వేగంగా వ్యాప్తిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాపై మిస్సైళ్ల వర్షం కురిపిస్తున్నాయి. మరోవైపు ఉమ్మడి దాడులకు ప్రతికార చర్యగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా, ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి శక్తిని ప్రయోగిస్తుంది. దీంతో దుబాయ్, సౌదీ అరేబియా, రియాద్, దోహా, ఖతార్, అబుదాబీ నగరాలల్లో మిస్లైళ్లతో దాడి చేస్తున్నాయి. ఇప్పటికే గల్ఫ్ దేశాల్లోని ఎయిర్ పోర్టులు తాత్కాలికంగా మూత పడ్డాయి. గ్రీస్, స్పెయిన్, ఫ్రాన్స్, టర్కీ, జపాన్, అజర్‌బైజాన్, బ్రిటన్, నార్వే విమానయాన సంస్థలు విమానాలను రద్దు చేసినట్లు ప్రకటించాయి.దుబాయ్ విమానాశ్రయంలో విమానాలు కూడా రద్దు చేయబడ్డాయి. అయితే చాలా మంది భారతీయ పౌరులు, సినీప్రముఖులు దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకున్నారు. ఇప్పటికే మంచు విష్ణు, పివీ సింధు వంటి వారు దుబాయ్ పరిస్థితులపై ట్వీట్స్ చేయగా.. మరో హీరోయిన్ సైతం అక్కడే ఉండిపోయారు. ఈ క్రమంలో దుబాయ్ పరిస్థితిపై రియాక్ట్ అవుతూ తనక సాయం చేయాలంటూ ప్రధాని మోదీకి రిక్వెస్ట్ చేసింది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : రజినీకాంత్ చేసిన ఆ ఒక్క హెల్ప్‏తో చిరంజీవి లైఫ్ మారిపోయింది.. టాలీవుడ్ నటుడు..

“మోదీ జీ.. కొనసాగుతున్న ఉద్రిక్తత పరిస్థితుల మధ్య నేను దుబాయ్ లో చిక్కుకున్నాను. విమానాలు రద్దు చేశారు. దీంతో భారతదేశానికి తిరిగి రావడానికి సరైన మార్గం లేదు. దయచేసి సాయం చేయండి. సురక్షితంగా దేశానికి తిరిగి రావడానికి మాకు సహయం చేయండి. మీకు చాలా కృతజ్ఞతురాలిని” అంటూ తన ఇన్ స్టా స్టోరీలో పేర్కొంది. ప్రస్తుతం ఆమె స్టోరీ స్క్రీన్ షాట్స్ వైరలవుతున్నాయి. మరోవైపు ఒలింపిక్ పతక విజేత పివి సింధు కూడా దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకున్నారు. తదుపరి నోటీసు వచ్చేవరకు అన్ని విమానాలను నిలిపివేసినట్లు ఆమె తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : సందీప్ రెడ్డి వంగాకు మెసేజ్ చేసి పిచ్చోడిని అయిపోయా.. టాలీవుడ్ హీరో..

సోనాల్ చౌహాన్ 2008లో జన్నత్ సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత తెలుగు, కన్నడ, తమిళం భాషలలో నటించి మెప్పించింది. నందమూరి బాలకృష్ణ నటించిన లెజెండ్ చిత్రంలో కథానాయికగా నటించింది. అలాగే ఎఫ్ 2 సినిమాలో కీలకపాత్ర పోషించింది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది.

ఎక్కువ మంది చదివినవి : Jagapathi Babu: ఆ హీరోను ప్రతిరోజూ తలుచుకుంటా.. బతికితే అతడిలా బతకాలి.. జగపతి బాబు..

ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. ఎర్ర ఎర్ర రుమాల్ పాటకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే..

Follow Us