AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మూడు కీలక బిల్లులపై లోక్‌సభలో సాయంత్రం ఓటింగ్.. ఆమోదంపై సర్వత్రా నెలకొన్న ఉత్కంఠ!

దేశ చరిత్రలో శుక్రవారం బిగ్‌డేగా నిలవనుంది. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుల ఆమోదంపై ఉన్న ఉత్కంఠకు ఇవాళ తెరపడనుంది. ఇవాళ రెండో రోజు లోక్ సభలో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై చర్చ కొనసాగనుంది. సాయంత్రం నాలుగు గంటలకు బిల్లులపై లోక్ సభలో ఓటింగ్ ప్రక్రియ మొదలు కానుంది. నారీశక్తి పేరుతో కేంద్రం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు నిజంగా మహిళల సాధికారత దిశగా అడుగు పడుతుందా..? లేదా అన్న ప్రశ్నలకు సమాధానం కొన్ని గంటల్లో తేలనుంది.

మూడు కీలక బిల్లులపై లోక్‌సభలో సాయంత్రం ఓటింగ్.. ఆమోదంపై సర్వత్రా నెలకొన్న ఉత్కంఠ!
Women's Reservation Bill India
Anand T
|

Updated on: Apr 17, 2026 | 10:38 AM

Share

శుక్రవారం పార్లమెంట్‌లో సమావేశాల్లో ఎంతో కీలకం. మూడు కీలక బిల్లులపై లోక్‌సభలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఓటింగ్‌ జరగనుంది. నారీశక్తికి వందన్ చట్ట సరవణకు ఆమోదం లభిస్తుందా లేదా అన్నది శుక్రవారం సాయంత్రం 4గంటలకు తేలనుంది. అందుకే దేశమొత్తం పార్లమెంట్ సమావేశాలపై ఊపిరిబిగపట్టి చూస్తోంది. మహిళలకు 33శాతం రిజర్వేషన్‌కు అన్నీ పార్టీలు ఓకే. కానీ సమస్యల్లా డీలిమిటేషన్‌తోనే. ఇది సాధారణ బిల్లు కాదు. రాజ్యాంగ సవరణ చేయాలి. అంటే ఇక్కడ సింపుల్ మెజారిటీ సరిపోదు. స్పెషల్ మెజారిటీ కావాలి. అంటే హౌస్‌లో ఉన్న మొత్తం సభ్యుల్లో మెజారిటీతో పాటు, హాజరై ఓటు వేసిన వారిలో 2/3 మద్దతు కావాలి. లోక్‌సభ ఫుల్ స్ట్రెంగ్త్ 543. ప్రస్తుతం ఉన్న సభ్యులు 540. అందరూ హాజరైతే 360ఓట్ల మద్దతు కావాలి.

ప్రస్తుతం NDAబలం 293. అంటే కనీసం 67 అదనపు ఓట్లు కావాలి. ఇక్కడే అసలు సమస్య సాధారణ బిల్లుల్లా విపక్షాన్ని పక్కన పెట్టి పాస్ చేయడం ఇక్కడ సాధ్యం కాదు. కానీ విపక్షాలన్నీ డీలిమిటేషన్‌బిల్లును తీసుకొచ్చి కేంద్రం కుట్రకు పాల్పడిందని ఆరోపణలు చేస్తున్నాయి. అందుకే ఎన్డీయేతర పార్టీలు ఎన్ని అధికారపక్షానికి మద్దతు ఇస్తాయన్నది ఇక్కడ కీలకం. కొన్ని పార్టీలు నేరుగా సపోర్ట్ ఇవ్వకపోయినా, గైర్హాజరయితే 2/3 టార్గెట్ కూడా తగ్గుతుంది.

మరోవైపు విపక్షం కూడా ఇదే లేక్కపై గేమ్ ప్లే చేస్తోంది. ఏ ఒక్క సభ్యుడూ గైర్హాజరు కాకుండా కాంగ్రెస్ విప్ జారీ చేసింది. అలాగే ఇండి కూటమిలో కీలకమైన టీఎంసీ, ఎస్పీ, డీఎంకే లాంటి పార్టీలు బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. ఒకవేళ ఈపార్టీల్లోని కొందరు క్రాస్ ఓటింగ్ చేసినా వెంటనే తెలిసిపోతోంది. అందుకే విపక్షాలు తమ సభ్యులను డేగకళ్లతో కనిపెట్టి చూస్తున్నాయి. మరోవైపు బిల్లును అందరం కలిసి తీసుకొద్దామని ప్రధాని మోదీ విపక్ష సభ్యులకు పిలుపునిచ్చారు. బిల్లు క్రెడిట్ తనకేం వద్దన్నారు.

మరోవైపు ఇక్కడ మరో లాజికల్ పాయింట్ ఉంది..ఒకవేళ బిల్లు పాస్ అయితే వెంటనే మహిళా రిజర్వేషన్ అమల్లోకి రాదు. ముందుగా డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి కావాలి. అంటే కొత్త నియోజకవర్గాలు ఫైనల్ అవ్వాలి. ఆ తర్వాతే రిజర్వేషన్ అమలవుతుంది. అంటే ఇది ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్. వెంటనే ఫలితం కనిపించదు కానీ పొలిటికల్ ఇంపాక్ట్ మాత్రం వెంటనే ఉంటుంది.

ఒకవేళ బిల్లు పాస్ అయితే దేశవ్యాప్తంగా మహిళలకు ఇది పెద్ద పాలిటికల్ మైలురాయి. ఒకవేళ వాయిదా పడితే మళ్లీ ఎప్పుడొస్తుందో చెప్పలేం. ఎందుకంటే ఇది సింపుల్ బిల్లు కాదు. పొలిటికల్ కన్సెన్సస్ అవసరం ఉన్న బిల్లు. మొత్తానికి ఎవరి దగ్గర ఎంత బలం ఉందన్నది కాదు. ఎవరు ఎవరిని ఎలా హ్యాండిల్ చేస్తారు అన్నదే కీలకం. అందుకే శుక్రవారం సాయంత్రం 4గంటలకు ఏమవుతుందన్న ఉత్కంఠ దేశవ్యాప్తంగా కనిపిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వీపుపై చిన్నారితో తల్లి పోరాటానికి సెల్యూట్‌!
వీపుపై చిన్నారితో తల్లి పోరాటానికి సెల్యూట్‌!
కాళ్లకు ఇనుప గొలుసులు, తాళం.. నదిలో ప్రత్యక్షమైన నవదంపతుల శవాలు
కాళ్లకు ఇనుప గొలుసులు, తాళం.. నదిలో ప్రత్యక్షమైన నవదంపతుల శవాలు
హైస్పీడ్‌తో ఉండే విమానం టైర్లు ల్యాండింగ్ సమయంలో ఎందుకు పేలవు?
హైస్పీడ్‌తో ఉండే విమానం టైర్లు ల్యాండింగ్ సమయంలో ఎందుకు పేలవు?
శ్రీవారి సన్నిధిలో ఆర్.పి పట్నాయక్, నటి ఉదయభాను నాది నీరాజనం
శ్రీవారి సన్నిధిలో ఆర్.పి పట్నాయక్, నటి ఉదయభాను నాది నీరాజనం
కాంతివంతమైన చర్మం కోసం అమ్మమ్మల కాలం నాటి సున్నిపిండి తయారీ
కాంతివంతమైన చర్మం కోసం అమ్మమ్మల కాలం నాటి సున్నిపిండి తయారీ
ఈ గాడ్జెట్​ ఉంటే తాళాలు, పర్స్ ఎక్కడ పెట్టారో వెతకాల్సిన పనిలేదు
ఈ గాడ్జెట్​ ఉంటే తాళాలు, పర్స్ ఎక్కడ పెట్టారో వెతకాల్సిన పనిలేదు
తినే కొద్దీ తినాలి అనిపించే మొక్కజొన్న గారెలు..
తినే కొద్దీ తినాలి అనిపించే మొక్కజొన్న గారెలు..
అబ్బాయిల గుండెల్లో ప్రింట్ అయిన బ్యూటీ..
అబ్బాయిల గుండెల్లో ప్రింట్ అయిన బ్యూటీ..
జేసీబీ కొంటే లాభమా..? నష్టమా..? తెరవెనుకున్న షాకింగ్‌ నిజాలు ఇవే!
జేసీబీ కొంటే లాభమా..? నష్టమా..? తెరవెనుకున్న షాకింగ్‌ నిజాలు ఇవే!
నిమ్మకాయ నుంచి ఒక్క చుక్క కూడా వదలకుండా రసం పిండాలా?.. ఇలా చేయండి
నిమ్మకాయ నుంచి ఒక్క చుక్క కూడా వదలకుండా రసం పిండాలా?.. ఇలా చేయండి