మీ ఇంట్లో వంకాయలు గుత్తులు గుత్తులుగా కాయాలా.. మొక్కను ఇలా పెంచండి
Samatha
2 August 2026
ప్రతి ఒకరి ఇంటిలో మొక్కలు ఉండటం సహజం. మరీ ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభం అయ్యిందంటే చాలు అనేక రకాల మొక్కలు పెంచుకుంటారు.
కొంత మంది పూల మొక్కలను ఇష్టంగా పెంచుకుంటే, మరికొంత మంది ఎక్కువగా కూరగాయల మొక్కలను పెంచుకుంటారు. కొందరూ రెండూ నాటుకుంటారు.
అయితే ఇంటిలో కూరగాయల్లో చాలా మంది వంకాయ మొక్కను నాటుకుంటారు. అయితే ఇలా వంకాయ మొక్కను నాటే సమయంలో కొన్ని చిట్కాలు పాటించాలంట.
ఇలా చిట్కాలు పాటిస్తూ వంకాయ మొక్కలను నాటడం వలన ఒక్క మొక్కే గుత్తులకు గుత్తులు కాయలను ఇస్తుంది అంటున్నారు నిపుణులు. చిట్కాలు ఏవి అంటే?
వంకాయ మొక్కలకు సూర్యకాంతి చాలా అవసరం. అందువలన ఎక్కువ సూర్య కాంతి వచ్చే చోట మొక్కను నాటడం వలన వంకాయలు గుత్తులుగా కాస్తాయంట.
అంతే కాకుండా ఈ మొక్కలు నాటే సమయంలో తప్పకుండా మీరు దూరం పాటించాలి. కనీసం రెండు అడుగుల దూరంలో మొక్కలను నాటడం వలన కాయలు ఎక్కువగా వస్తాయి, చెట్టు వేపుగా పెరుగుతుంది.
ఎక్కువగా నీరు నిలవని చోట వంకాయ మొక్కలు నాటాలి. అంతే కాకుండా, ఎప్పుడూ నీరు పోస్తూ ఉండాలి. కొంచెం ఎరువులు వేసి మొక్కలు నాటడం చాలా మంచిది.
వంకాయలు ఎక్కువగా కాసే సమయంలో మొక్క వాటి బరువు వంగిపోతూ ఉంటుంది. అందువలన మీరు ముందుగానే మొక్కకు సరైన మద్దతు ఇవ్వాలి దీని వలన కొమ్మలు విరిగిపోకుండా ఉంటాయి.