10 నిమిషాలు వెయిట్ చేయమన్నందుకు.. డాక్టర్ ముఖం పచ్చడి చేసిన BP రోగి! వైరల్ వీడియో
బీపీ పరీక్ష కోసం వచ్చిన ఓ రోగిని 10 నిమిషాలు వేచి ఉండాలని వైద్యుడు కోరినట్లు తెలుస్తోంది. అయితే, ఆ మాటకు ఆగ్రహించిన రోగి క్లినిక్‌లో ఉన్న చెక్క స్టూల్‌తో వైద్యుడిపై దాడి చేసి నానాయాగి చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో వైద్యుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది..

బీపీ టెస్ట్ కోసం ఓ డాక్టర్ వద్దకు వెళ్లగా.. అతగాడు బిజీగా ఉన్నాడు. కాస్త 10 నిమిషాలు వెయిట్ చేయమని చాలా మర్యాదగా చెప్పాడు. అయితే అక్కడికి వచ్చిన రోగికి సరిగ్గా అదే టైంకి బీపీ ఓవర్ లోడ్ అయినట్లుంది.. బీపీ చెకప్ చేయకుండానే అతగాడి బీపీ అందరూ చూసేశారు. ఎదురుగా కూర్చున్న డాక్టర్ ముఖాన్ని పచ్చడి చేసి చక్కగా పోయాడు. ఈ విచిత్ర ఘటన ఎక్కడ జరిగిందో తెలియదుగానీ.. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అసలేం జరిగిందంటే..
ఈ వీడియోలో ఓ వ్యక్తి తన రక్తపోటు (బీపీ) పరీక్ష చేయించుకోవడానికి క్లినిక్‌కు వెళ్లాడు. ఆ సమయంలో వైద్యుడు మరో పనిలో ఉండటంతో 10 నిమిషాలు వేచి ఉండాలని రోగికి సూచించించాడు. అయితే ఆ మాట విన్న వెంటనే డాక్టర్ ఎదురుగా టేబుల్‌కి అవతల వైపు కూర్చున్న రోగి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. తాను కూర్చున్న ఒక భారీ చెక్క స్టూల్‌ను ఎత్తి అమాంతం వైద్యుడి తలపై బలంగా కొట్టాడు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యింది. దెబ్బ తగలడంతో ఆ డాక్టర్ బాధతో అల్లాడిపోతూ.. రోగి నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్‌గా మారడంతో కొందరు నెటిజన్లు జోకులు పేలుస్తుంటే.. మరికొందరు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్యులపై పెరుగుతున్న దాడులు ఆందోళనకరమని వ్యాఖ్యానించారు.
इसका तो बिना किसी मशीन के बीपी चेक हो गया…😃🔥
यह व्यक्ति डॉक्टर के पास अपना बीपी चेक कराने पंहुचा था
लेकिन,
डॉक्टर ने इनसे 10 मिनट रुकने को कहा।
इतने में तो भाई साहब का बीपी हाई लेवल पर पहुंच गया और वहीं डॉक्टर पर हमला करना शुरू कर दिया। pic.twitter.com/Yd48aHY733
— Amit sehra (@darsan44562) August 1, 2026
‘బ్రో.. బీపీ పరీక్ష చేయాల్సిన అవసరం లేకుండానే అతని కోపం చూసి బీపీ ఎంత ఉందో తెలిసిపోయింది’, ‘డాక్టర్‌కు కావాల్సిన బీపీ రీడింగ్ దొరకలేదు కానీ రోగి కోపం మాత్రం అన్నీ చెప్పేసింది’, ‘నీ కోపమే నీ బీపీ ఎక్కువగా ఉందని నిరూపించింది’, ‘రోగి బీపీ తగ్గిందో లేదో తెలియదు కానీ డాక్టర్ బీపీ మాత్రం పెంచేశాడు’, ‘బీపీ ఎక్కువగా ఉంతో, తక్కువగా ఉందో తెలుసుకోవడానికి ఇదీ ఓ మార్గమే’.. అంటూ కొందరు నవ్వులు పూయిస్తే.. సమాజంలో సహనం ఎంతగా తగ్గిపోతోందో ఈ ఘటన చూపిస్తోంది. చికిత్స చేయాల్సిన వైద్యుడిపైనే దాడి చేయడం అత్యంత సిగ్గుచేటు అని ఓ నెటిజన్ ఘాటుగా వ్యాఖ్యానించాడు. ‘జీవితంలో కాస్త ఓర్పు అవసరం. ఆవేశం ఎప్పుడూ నష్టానికే దారి తీస్తుంది’ అని హితవు పలికాడు. ‘కేవలం 10 నిమిషాలు వేచి ఉండలేక హింసకు దిగడం ప్రమాదకరమైన మనస్తత్వానికి నిదర్శనం’ అని పేర్కొన్నారు. దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పలువురు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. విధుల్లో ఉన్న వైద్యుడిపై దాడి చేసిన వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.అయితే మరికొందరు వైద్యుడు వెంటనే పరీక్ష చేసి ఉండాల్సిందని అభిప్రాయపడినా, చాలా మంది ఎలాంటి పరిస్థితుల్లోనూ హింసకు సమర్థన ఉండదని స్పష్టం చేశారు.




