AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారేవ్వా.. చిటికెన వేలికంటే చిన్న చేపలు.. పోషకాలలో మహారాజులు! వారానికోసారి తిన్నారంటే..

సాధారణంగా మార్కెట్‌కు వెళ్లినప్పుడు చాలామంది పెద్ద పెద్ద చేపలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. కానీ, చేతి వేలి పరిమాణంలో ఉండే యాంకోవి చేపల్లో లభించే పోషకాలు పెద్ద చేపల కంటే ఎంతో ఎక్కువని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తక్కువ ధరకే లభించే ఈ చిన్న చేపలు రుచిలోనే కాకుండా, మన రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. యాంకోవి చేపల ముఖ్య ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..

Jyothi Gadda
|

Updated on: Aug 24, 2026 | 11:02 AM

Share
చేతి వేలి కంటే చిన్నగా ఉండే యాంకోవి చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. వీటిని నేత్తళ్లు అని కూడా పిలుస్తారు. తక్కువ క్యాలరీలు, అధిక పోషకాలు ఉండే ఈ చిన్న చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ B12, విటమిన్ A, కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మెదడు చురుగ్గా పనిచేసేందుకు తోడ్పడతాయి.

1 / 6
గుండె ఆరోగ్యానికి మేలు: యాంకోవి చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. వారానికి రెండుసార్లు ఈ చేపలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉండి, గుండెపోటు వంటి తీవ్ర సమస్యల ప్రమాదం తగ్గుతుంది.

2 / 6
జ్ఞాపకశక్తి, మెదడు పనితీరు: వీటిలో విటమిన్ B12 పుష్కలంగా ఉంటుంది. ఇది నరాల వ్యవస్థను కాపాడటంతో పాటు మెదడు పనితీరును వేగవంతం చేస్తుంది. పిల్లలలో జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచడానికి ఈ చేపలు ఎంతో ఉపయోగపడతాయి.

3 / 6
బలమైన ఎముకలు, పళ్ళు: ఈ చిన్న చేపలను ముళ్ళతో సహా తినవచ్చు. వీటి ఎముకలలో ఉండే ఉనికి వల్ల మన శరీరానికి కావలసిన కాల్షియం, ఫాస్పరస్, విటమిన్ D సమృద్ధిగా లభిస్తాయి. ఇది ఎముకలను, పళ్ళను దృఢంగా ఉంచడమే కాకుండా ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల సమస్యలను నివారిస్తుంది.

4 / 6
చర్మ సౌందర్యం, బరువు నియంత్రణ: యాంకోవి చేపల్లో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇవి సరైన ఎంపిక. వీటిలోని సెలీనియం వంటి ఆంటీఆక్సిడెంట్లు చర్మాన్ని మెరిసేలా చేసి, చర్మ సంబంధిత సమస్యలను నివారిస్తాయి.

5 / 6
మెర్క్యురీ ప్రమాదం తక్కువ: సముద్రంలో ఉండే పెద్ద చేపలు విషపూరితమైన మెర్క్యురీని ఎక్కువగా గ్రహిస్తాయి, కానీ చిన్నవైన యాంకోవి చేపల్లో మెర్క్యురీ స్థాయిలు అత్యల్పంగా ఉంటాయి. కాబట్టి ఇవి పిల్లలకు మరియు పెద్దలకు తినడానికి ఎంతో సురక్షితం. షాపింగ్‌కు వెళ్లినప్పుడు ఈ చిన్న చేపలు కనిపిస్తే అస్సలు వదలకుండా తెచ్చుకుని వండుకుంటే, రుచితో పాటు బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను ఉచితంగా పొందవచ్చు.

6 / 6
Follow Us