AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devdutt Padikkal: రీప్లేస్మెంట్‌గా వచ్చి.. రైజింగ్ స్టార్‌గా మారాడు! ఇక తప్పించడం గంభీర్ తరం అవుతుందా?

Devdutt Padikkal: శ్రీలంకతో రెండో టెస్టులో వరుసగా రెండో సెంచరీతో దేవదత్ పడిక్కల్ అదరగొట్టారు. 117 పరుగులతో తన సత్తా చాటడంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రశంసలు అందుకున్నారు. నంబర్-3 స్థానంలో పడిక్కల్ పర్మనెంట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో సాయి సుదర్శన్‌కు పోటీ మరింత పెరిగింది.

Devdutt Padikkal: రీప్లేస్మెంట్‌గా వచ్చి.. రైజింగ్ స్టార్‌గా మారాడు! ఇక తప్పించడం గంభీర్ తరం అవుతుందా?
Devdutt Padikkal
Rakesh
|

Updated on: Aug 24, 2026 | 12:30 PM

Share

Devdutt Padikkal: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో దేవదత్ పడిక్కల్ మరో అద్భుత శతకంతో మెరిసి జట్టుకు రక్షణగా నిలిచారు. గాయపడిన సాయి సుదర్శన్ స్థానంలో లభించిన అవకాశాన్ని పడిక్కల్ నూటికి నూరు శాతం ఉపయోగించుకున్నారు. ఆయన బ్యాటింగ్ ప్రతిభకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫిదా అయ్యారు. మూడో స్థానంలో పడిక్కల్ పర్మనెంట్ బ్యాటర్‌గా మారే సూచనలు కనిపిస్తుండటంతో సాయి సుదర్శన్ బెంచ్ కే పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కొలంబో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 66 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన వేళ పడిక్కల్ క్రీజులోకి వచ్చారు. శ్రీలంక బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ 117 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. ఈ సిరీస్‌లో ఇది ఆయనకు వరుసగా రెండో సెంచరీ కావడం విశేషం. గాళ్లలో జరిగిన తొలి టెస్టులో 167 రన్స్ చేసిన పడిక్కల్, ఈ పర్యటనలో ఇప్పటివరకు 3 ఇన్నింగ్స్‌ల్లో 109.33 సగటుతో 328 పరుగులు సాధించి రికార్డులు సృష్టించారు.

బీసీసీఐ విడుదల చేసిన స్పెషల్ వీడియోలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పడిక్కల్ ఆటతీరును ఆకాశానికెత్తేశారు. “దేవదత్ పడిక్కల్‌కు నంబర్-3లో లభించిన ప్రతి అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. టెస్టు క్రికెట్ ఎంత కష్టమైనదో మనందరికీ తెలుసు. దేవదత్ ఇలా స్థిరంగా పరుగులు సాధించడం భారత క్రికెట్‌కు ఎంతో మంచి పరిణామం” అని గంభీర్ కొనియాడారు. 2024లో టెస్టు అరంగేట్రం చేసిన తొలి రోజుల్లో తీవ్రంగా నిరాశపరిచిన పడిక్కల్, ఈ శ్రీలంక పర్యటనలో లంక ఎలెవన్‌పై వార్మప్ మ్యాచ్‌లో 142*, మొదటి టెస్టులో 167, రెండో టెస్టులో 117 పరుగులతో చెలరేగడం గమనార్హం.

ఇది కూడా చదవండి: Video: వామ్మో పంతు.. ఏంటా స్ట్రెంతు! సిక్స్ కొడితే ఎక్కడికెళ్లి పడిందో తెలుసా?

కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సైతం పడిక్కల్ సాధించిన విజయంపై ఆనందం వ్యక్తం చేశారు. “కొత్తగా జట్టులోకి వచ్చిన బ్యాటర్‌కు వెంటనే రాణించడం సులభం కాదు. ప్రతి ఒక్కరూ మొదటి మ్యాచ్ నుంచే అద్భుతంగా ఆడాలని కోరుకుంటాం, అయితే సరైన సమయం వచ్చినప్పుడే ఆటగాళ్లు తమ అత్యుత్తమ ప్రదర్శనను ఇస్తారు. పడిక్కల్‌కి టెస్టుల్లో విజయవంతమయ్యే పూర్తి నైపుణ్యం ఉంది. గతంలో ఇండియా-ఎ తరఫున ఇక్కడే ఆడిన అనుభవం కూడా అతనికి బాగా ఉపయోగపడింది” అని గిల్ వివరించారు.

ఇది కూడా చదవండి: Yashasvi Jaiswal: వాడు ఏమన్నాడో మీకు తెలుసా..? స్టార్ కామెంటేటర్‌‌పై విరుచుకుపడ్డ జైస్వాల్

పడిక్కల్ చూపుతున్న మైండ్ బ్లాకింగ్ ఫామ్ వల్ల జట్టు మేనేజ్‌మెంట్ ఆలోచనల్లో పెద్ద మార్పు వచ్చింది. సుదీర్ఘ కాలం పాటు నంబర్-3 స్థానంలో సాయి సుదర్శన్‌ను ఊహించిన జట్టు మేనేజ్‌మెంట్, ఇప్పుడు పడిక్కల్ దెబ్బకు సుదర్శన్‌ను పక్కన పెట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది. పడిక్కల్ చూపిస్తున్న ఈ క్లాస్ బ్యాటింగ్ ఆయనను టెస్టు జట్టులో శాశ్వత సభ్యుడిగా మార్చేసింది. వరుస సెంచరీలతో చెలరేగుతున్న దేవదత్ పడిక్కల్ భారత టెస్టు జట్టులో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నారు. కెప్టెన్, కోచ్ లభించిన ఈ అపారమైన నమ్మకంతో పడిక్కల్ రాబోయే రోజుల్లో టీమిండియాకు ప్రధాన బ్యాటింగ్ స్తంభంగా మారే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us